మిస్ వరల్డ్ 2024 పోటీలు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగాయి. కొత్త మిస్ వరల్డ్ ఈ ప్రపంచానికి పరిచయం అయింది. క్రిస్టినా పిస్కోవాను ఈ కిరీటం వరించింది. ఈమెది చెక్ రిపబ్లిక్ దేశం. క్రిస్టినాకు మిస్ వరల్డ్ కిరీటంతో పాటు మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ కూడా లభించింది. ఈ డబ్బును ప్రజల కోసం ఖర్చు పెడతానని ఆమె ప్రకటించింది. మిస్ వరల్డ్ కిరీటం కూడా చాలా ప్రత్యేకమైనది. జపనీస్ కంపెనీ మికిమోటో ఈ కిరీటాన్ని వజ్రాలతో రూపొందించింది. ఈ కిరీటం విలువ కూడా మిలియన్ డాలర్లు.