సంకల్ప పత్రం పేరిట బీజేపీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది. వికసిత్ భారత్ థీమ్‌తో దీన్ని తయారు చేసింది.

మోదీ సూచనల మేరకు ఈ మేనిఫెస్టో రూపకల్పనకు 15 లక్షల మంది సలహాలు, సూచనలు పరిశీలించింది బీజేపీ.

వచ్చే ఐదేళ్ల పాటు ఉచిత రేషన్, ఆయుష్మాన్ భారత్‌ స్కీమ్‌లో భాగంగా తక్కువ ధరకే మందులు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు.

ఇంటింటికీ పైప్‌లైన్‌ ద్వారా వంటగ్యాస్, 3 కోట్ల మంది పేదలకు ఇళ్ల నిర్మాణం చేపడతామని బీజేపీ హామీ ఇచ్చింది.

3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మారుస్తామని, ట్రాన్స్‌జెండర్‌లకూ ఆయుష్మాన్ స్కీమ్ అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.

దేశవ్యాప్తంగా యూసీసీ అమలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ లాంటి కీలక అంశాలనూ మేనిఫెస్టోలో చేర్చింది బీజేపీ.

ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం, మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక క్లస్టర్ల ఏర్పాటు లాంటి కీలక హామీలు ఇచ్చారు.

మొత్తం 14 అంశాలతో ఈ మేనిఫెస్టోని రూపొందించిన బీజేపీ హ్యాట్రిక్‌ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.