Image Source: Reuters

సూడాన్‌లో ఏడాదిగా జరుగుతున్న అంతర్యుద్ధం ఆ దేశాన్ని దుర్భర స్థితికి దిగజార్చింది. ఆహారం దొరక్క ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు.

Image Source: Reuters

ఆకలి తీరాలంటే సైనికులు తమ కోరికలు తీర్చాలని షరతులు పెడుతున్నారు. మనసు చంపుకుని మహిళలు ఒప్పుకుంటున్నారు.

Image Source: CARE Org

ఫుడ్ ఫ్యాక్టరీల్లో కాపు కాస్తున్న సైనికులు మహిళలతో తమ వాంఛలు తీర్చుకుంటున్నారు. ఆ తరవాతే తిండి పెడుతున్నారు.

Image Source: CARE Org

అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ అమానుషాలు జరుగుతున్నాయి. ఏడాదిగా బాధను దిగమింగుకుని గడుపుతున్నారు.

Image Source: CARE Org

నిలువ నీడ కావాలన్నా సైనికుల కోరికలు తీర్చాల్సి వస్తోందని బాధిత మహిళలు ఆవేదన చెందుతున్నారు.

Image Source: Reuters

ఇన్ని దారుణాలు జరుగుతున్నా తమని ఎవరూ పట్టించుకోవడం లేదని మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

Image Source: unrefugee

ఎవరూ లేని మారుమూల ఇళ్లలో సామాన్లు వాడుకోవాలన్నా కోరిక తీర్చందే సైనికులు అడుగు పెట్టనివ్వడం లేదు.

Image Source: unrefugee

ఇక్కడ దారుణాలు భరించలేక లక్షలాది మంది వలస వెళ్తున్నారు. ఇప్పటికే లక్షన్నర మంది ఈ అంతర్యుద్ధానికి బలి అయ్యారు.