Image Source: ANI

వయనాడ్‌లో కొండ చరియలు విరిగి పడి 160 మందికి పైగా మృతి చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Image Source: ANI

వాతావరణ మార్పుల కారణంగా భారత్‌లో ఈ మధ్య కాలంలో వరుసగా ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి.

Image Source: ANI

భారీ వర్షాలు, వరదలు, తుఫాన్‌లు వెంటాడుతున్నాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లుతున్నాయి.

Image Source: ABP Live

జూన్‌లో ఢిల్లీలో భారీ వర్షాలు కురవడం వల్ల వరదలు ముంచెత్తాయి. ఎక్కడికక్కడ రోడ్లు జలమయం అయ్యాయి.

ముంబయిలో కురిసిన భారీ వానలకు వరదలు వచ్చాయి. హోర్డింగ్ కూలిన ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.

Image Source: ABP Live

అసోంలోనూ విపరీతమైన వర్షాలు కురిసి నదులు ఉప్పొంగాయి. కొండచరియలు విరిగి పడి 79 మంది ప్రాణాలు కోల్పోయారు.

గతేడాది డిసెంబర్‌లో తమిళనాడులో భారీ వర్షాలు, వరదలకు 31 మంది మృతి చెందారు. ప్రజా రవాణా ఎక్కడికక్కడ నిలిచిపోయింది.

గతేడాది అక్టోబర్‌లో సిక్కిమ్‌లో వరదలు ముంచెత్తాయి. ఎప్పుడూ లేని స్థాయిలో వర్షాలు కురిసిన కారణంగా 179 మంది మృతి చెందారు.