Pawan Kalyan Seize the Ship | డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నౌకను సీజ్ చేయగలరా? | ABP
సీజ్ ది షిప్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్న డైలాగ్ ఇది. ఎవరో చెప్పి ఉంటే ఈ డైలాగ్ ఇంత ఫేమస్ అయ్యేది కాదేమో. కానీ అక్కడుంది పవన్ కళ్యాణ్. ఆయన ఆంధ్రప్రదేశ్ కు ఉపముఖ్యమంత్రి అయినా ఆయన అభిమానుల్లో ఆయన పట్ల ఉండే క్రేజ్ నిన్నటి నుంచి ఈ డైలాగ్ ను నేషనల్ లెవల్లో మారు మోగేలా చేస్తోంది. కాకినాడ పోర్టు స్మగ్లర్లకు సంఘవిద్రోహ శక్తులకు అడ్డాగా మారిందనేది పవన్ కళ్యాణ్ ఆరోపణ. ఆయన మాటల్లో వాస్తవం ఉండి ఉండొచ్చు. ప్రజాధనాన్ని ముఖ్యంగా చౌకధరల్లో డిపోల్లో ప్రజలకు అందాల్సిన సబ్సిడీ బియ్యాన్ని దొంగదారుల్లో దేశాలు దాటించేస్తున్న బ్లాక్ మార్కెట్ కేటు గాళ్లపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సిందే..చట్టం ప్రకారం అలాంటి వారికి కఠినంగా శిక్ష పడాల్సిందే. కానీ ఈ వీడియోలో ఓ చిన్న విషయాన్ని డిస్కస్ చేయాలంకుంటున్నా. పవన్ కళ్యాణ్ నిన్న చేసిన పనిని మెచ్చుకుంటూనే ఆయన నిజాయతీని ప్రశంసిస్తూనే పవన్ కు సీజ్ ద షిఫ్ అనే అధికారం అసలు ఉందా..లేదా ఆవేశంలో ఆయన తన పరిమితిని, అధికార పరిధులను దాటి ప్రవర్తించారా... అసలు రాజ్యాంగం ఏం చెబుతుంది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా నిన్న పవన్ కళ్యాణ్ సీజ్ చేయమన్న షిఫ్ పనామా స్టెల్లా. స్టెల్లా ఆ కార్గో షిప్ పేరు. అది పనామా దేశానికి చెందింది. గూడ్స్ తీసుకుని వెస్ట్ ఆఫ్రికాకు వెళ్తోంది ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి అది అంతర్జాతీయ నౌక.