Russia Ukraine War : ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
Zelensky: రష్యా ఉక్రెయిన్ వార్ ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాటో దేశాలు హామీ ఇస్తే కాల్పుల విరమణకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు.
Russia war in Ukraine is likely to end: పొరుగుదేశం ఉక్రెయిన్ పై రష్యా దాడులు ప్రారంభించి రోజులు..వారాలు..నెలలు గడిచిపోతున్నాయి.కానీ వార్ మాత్రం సాగుతూనే ఉంది. దీని వల్ల ఆ రెండు దేశాలు భారీగా నష్టపోయాయి. ఉక్రెయిన్ కు నాటో దేశాలు ఆయుధాలు ఇస్తూండటంతో రష్యా ఆయా దేశాలపై అణుబాంబులు వేయడానికి సిద్ధమని ప్రకటనలు చేస్తోంది.ఈ క్రమంలో తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తమపై దాడులు జరగబోవని హమీ ఇస్తే కాల్పుల విరమణ పాటిస్తామని నాటోకు చెప్పింది. ఇప్పుడు రష్యా ఏం చేస్తుందన్నది కీలకం.
యుద్ధంలో భారీగా నష్టపోయిన రష్యా, ఉక్రెయిన్
ఉక్రెయిన్ పై దాడి చేసిన రష్యా కూడా యుద్ధంలో భారీగా నష్టపోయింది. సైనికులు లక్షల్లో చనిపోయారు. ఆర్థిక పరంగా ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో పుతిన్ కూడా ఈ యుద్ధాన్ని ముగించాలన్న ఆలోచనలో ఉన్నారు.కానీ ఆయన అప్పర్ హ్యాండ్ సాధిస్తేనే కిందకు దిగుతారు. ఉక్రెయిన్‌కు ఇక పోరాడే శక్తి లేదు. ఆయుధాలు లేవు. సైన్యం దగ్గర ఓపికలేదు యుద్ధ బరి నుంచి పారిపోతున్నారన్న వార్తలు వస్తున్నాయి.ఎలా చూసినా రెండు దేశాలు ఇప్పుడు అవకాశం వస్తే యుద్ధాన్ని అపడానికి సిద్ధంగా ఉన్నాయి.కానీ అలాంటి పరిస్థితుల్ని నాటో దేశాలు కల్పించడం లేదు. ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇస్తే రష్యాపై వేసేందుకు అనుమతులు ఇస్తున్నాయి.
Also Read: TANAలో 30 కోట్ల గోల్ మాల్ - కోశాధికారే కొట్టేశారు - ప్రవాసాంధ్రుల పరువు పోయినట్లే !
నాటో దేశాలు తల్చుకుంటే రెండు దేశాల మధ్య శాంతి
మధ్యప్రాచ్యంలో శాంతి కోసం అమెరికా చేసిన ప్రయత్నాలు పాక్షిక విజయం సాధించాయి. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా చేసిన ప్రయ్తనాలు ఫలించాయి. ఇజ్రాయెల్ తాము కాల్పుల విరమణకురెడీనేనని అది లెబనాన్ స్పందనను బట్టే ఉంటుందని తెలిపింది. లెబనాన్ ఇప్పటికి అయితే ఇజ్రాయెల్ పై దాడుల వరకూ ఆలోచించాలని అనుకోవడం లేదు. అందుకే ప్రస్తుతం మధ్య ప్రాచ్యంలోదాడుల మాట వినిపించడం లేదు. ఇప్పుడు ఉక్రెయిన్ - రష్యా మధ్యకూడా ఈ కాల్పుల విరమణ అధికారికంగానో. .అనధికారికంగానో జరిగితే ప్రశాంతత వస్తుంది.ఉక్రెయిన్ ఓ అడుగు ముందుకు వేసి తాము కాల్పుల విరమణకు రెడీఅని చెప్పింది.ఇప్పుడు నాటో దేశాలు తమ బాధ్యత నిర్వర్తిస్తే యుద్ధం ఆగిపోతుందని అనుకోవచ్చు.
Also Read: భార్యకు బంగారు చైన్ కొనిస్తే డ్రాలో రూ.8 కోట్ల లాటరీ తగిలింది - ఈ డబ్బులు భార్యవా ? భర్తవా ?
ట్రంప్ వైఖరి కూడా కీలకం
అమెరికన్లు యుద్ధాలను కోరుకోరు.ఆ విషయం ట్రంప్ కు బ ాగా తెలుసు. అందుకే అమెరికా ఎన్నికల ప్రచారంలో తాను వస్తే యుద్ధాలను ఆపేస్తానని ప్రకటించారు. అప్పటికే ఆగిపోతే ఆయన అలాంటి పరిస్థితులు మరోసారి రాకుండా చూడగలరని ప్రపంచం నమ్ముతోంది. ప్రపంచపెద్దన్నగా అవునన్నా..కాదన్నా అమెరికాకు ఇంకా పట్టు ఉంది. ఇప్పుడు ఉక్రెయిన్ వేసిన ముందడుగుతో.. రష్యాతో స్నేహం వరకూ తేలేకపోయినా యుద్ధాన్ని మాత్రం ఆపగలిగితే.. మూడో ప్రపంచయుద్ధం ముప్పు నుంచి దేశం బయటపడినట్లే అనుకోవచ్చు.