అన్వేషించండి

YSRCP Kannababu: పవన్‌ కల్యాణ్‌ను షిప్‌లోకి వెళ్ల‌కుండా ఆపిందెవ‌రు? చంద్రబాబే బాధ్యత వహించాలి: కన్నబాబు

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ను షిప్ లోనికి వెళ్ల‌నీయ‌కుండా ఆయ‌న కంటే పెద్ద‌శ‌క్తి ఆపిఉంటుంద‌ని వైసీపీ మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు అన్నారు. ప‌వ‌న్ ఆవేద‌న అర్ధం అయ్యంద‌ని క‌న్న‌బాబు చెప్పారు..

AP Deputy CM Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తాను కాకినాడ వస్తానంటే ఆపేశారని అన్నారు. పైగా షిప్‌లోకి వెళ్తానంటే తనను ఆపేశారని ఆయనే స్వయంగా చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా ఏర్పాటుచేసుకున్న ప్రభుత్వమే కదా.. డిప్యూటీ సీఎం ను ఆపేసింది ఎవరు..? షిప్‌లోకి వెళ్తానంటే అనుమతి ఇవ్వనిదెవరు..? పవన్‌ స్థాయి వ్యక్తిని ఆపాలంటే అంతకంటే పై స్థాయి వారే కదా అపేది.. ఎవరు ఆపి ఉంటారు.. ఈప్రశ్నలన్నీ సామాన్యుడికి కూడా వస్తున్నాయి. నిగ్గుతేల్చేందుకు వస్తానంటే అలా ఆపాలనే ప్రయత్నం ఎవరు చేసుంటారు... పవన్‌ కంటే పై స్థాయి వారే ఆపుంటారని అనుకుంటున్నారు అంటూ వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

పోర్టుకు రాకుండా అడ్డుకుంటున్నారు

ఆరునెలల నుంచి పోర్టుకు వస్తానంటే తనను ఆపేస్తున్నారని సాక్షాత్తూ డిప్యూటీ సీఎం చెప్పడం విన్నానని, అసలు ఏప్రభుత్వం వచ్చినప్పటికీ కానీ బియ్యం ఎగుమతులు, కాకినాడ పోర్టు కార్యకలాపాల పై ప్రత్యేక దృష్టిపెట్టారని అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన పదిహేను రోజులకే పౌర సరఫరాలశాఖ మంత్రి నాదేండ్ల మనోహర్‌ కాకినాడ రావడం, అనంతరం బియ్యం నిల్వలపై ఆయనే స్వయంగా దాడులు చేశారు. సుమారు 54 వేల టన్నుల బియ్యాన్ని సీచ్‌ చేసినట్లు చూశాం.. దానిలోసుమారు 1400 టన్నుల పీడీఎస్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించినట్లు కన్నబాబు తెలిపారు.

పోర్టులో బియ్యం ఎగుమతులుపై సివిల్‌ సప్లై శాఖ నుంచి చెక్‌ పోస్ట్‌లు పెట్టారని, సీజ్‌ చేసిన బియ్యాన్ని సివిల్‌ సప్లై ఆధ్వర్యంలోనే నిల్వచేశారని చూశాం.. మళ్లీ అయిదారు రోజుల నుంచి ఈ వార్తలు వస్తున్నాయి.. సివిల్‌ సప్ల్సై ఛైర్మన్‌గా ఉన్న తోట సుధీర్‌ కూడా పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకున్నట్లు, ఆతరువాత జిల్లా కలెక్టర్‌ షాన్‌ షన్మోహన్‌ కూడా 640 టన్నులు పట్టుకున్నట్లు చూశాం.. అయితే చాలా ఆశ్ఛర్యంగా ఉంది.. ఈ 640 టన్నుల బియ్యం అల్రెడీ సివిల్‌ సప్లై మినిస్టర్‌ నాదెండ్ల మనోహర్‌ పట్టుకున్న బియ్యమే అని చెప్పారు.

సీజ్ చేసిన బియ్యం పోర్టుకు ఎలా వెళ్లింది

సివిల్‌ సప్లై స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని విడుదల చేస్తే మళ్లీ అదే బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం కల్పించిందనే కదా అర్ధం. అంటే సీజ్‌ చేసిన బియ్యాన్ని బ్యాంకు గ్యారెంటీ ఇచ్చి రిలీజ్‌చేసుకున్నారు అని చెబుతున్నారు. విడుదల చేసిన బియ్యం ఎగుమతులపై షరతులు పెట్టిందా.. రిలీజ్‌ చేసిన బియ్యం విదేశాలకు ఎగుమతులు చేయడానికి అవకాశం ఎలా ఉంటుంది అంటూ కన్నబాబు ప్రశ్నించారు. ఎవరి మధ్య అవగాహన ఒప్పందం ఉంది.. అధికారులు ఏం చేస్తున్నారు.. ఎక్కడా లేని విధంగా రెండు చెక్‌ పోస్టులు సివిల్‌ సప్లై పెట్టింది. వీటిని దాటుకుని పోర్టు వరకు ఎలా వెళ్లింది. అసలు గొడౌన్‌ నుంచి రిలీజ్‌చేసినప్పుడు షరతులు ఏంటని అడుగుతున్నాం అన్నారు. 

Also Read: Pawan Kalyan Seize The Ship: సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?

పవన్‌ వ్యాఖ్యలు తక్కువగా చూడకూడదు.. 

రాష్ట్రంలో విశాఖపట్నం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనూ, కాకినాడ పోర్టు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనం నడుస్తున్నాయి. గంగవరం, కృష్ణపట్నం పోర్టు అదానీ, కాకినాడ సీ పోర్టు వేరే కంపెనీ ఆదీనంలో నడుస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదీనంలో నడుస్తున్న పోర్టులోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని కన్నబాబు అన్నారు. దేశభద్రతకే కాకినాడ నుంచి ముప్పు కలిగే ఆందోళన ఉందని, కసబ్‌ లాంటి ఉగ్రవాది వస్తాడేమో, ఆర్డీఎక్స్ వంటి పేలుడు పదార్థాలు తెస్తారేమోనని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. దేశభద్రత విషయం కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. పైగా ఇక్కడ కోస్ట్‌గార్డు కూడా పనిచేస్తోంది. అయినప్పటికీ  డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు తక్కువగా చూడకూడదంటూ కన్నబాబు సెటైర్లు వేశారు. కలెక్టర్‌ వెళ్లిన షిప్‌లోకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్తే ఎలా ఆపారు.. సివిల్‌ సప్లై రేషన్‌ బియ్యం దందా జరుగుతుందని మీ అనుకూల పత్రికలే రాస్తున్నాయి. వ్యస్థలో ఉన్న లోపాలను సరిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కన్నబాబు అన్నారు. 

పవన్‌ కల్యాణ్‌ అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి..

సమన్వయ లోపం ఉందా.. ఒకరికొకరు సహకరించుకోవడం లేదా? పవన్‌ కల్యాణ్‌ లేవనెత్తిన అంశాలు పరిశీలిస్తే ఇది చిన్నవిషయం కాదన్నారు. సమాధానం చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే... దానికి బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చెప్పాలన్నారు. పవన్‌ ఆరోపించినట్లు దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. సీజ్‌ద షిప్‌ అనికూడా పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కానీ ఆ షిప్‌ సీజ్‌ అయ్యిందో లేదో చూడాలి. సమాచారం కోసం ఏ అధికారికి ఫోన్‌ చేసినా ఫోన్లు ఎత్తడం లేదు.. మీడియా ద్వారా తెలుసుకున్న విషయాలే మాట్లాడుతున్నాము. సివిల్‌ సప్లై డిపార్ట్‌మెంట్‌ కూడా పోర్టు భద్రత విషయంలో కానీ, అక్రమ రవాణా విషయంలో కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని కన్నబాబు డిమాండ్‌ చేశారు.. 

చంద్రబాబు దెబ్బ ప్రతీ ఒక్కరిపైనా పడింది

బాబు ష్యూరిటీ బాదుడు గ్యారెంటీ.. ఎటువంటి తారతమ్యత లేకుండా అందరినీ సమానంగా బాదుడు బాదుతున్నాడని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు.. వచ్చిన 5 నెలల్లో 15,485 కోట్ల 36 లక్షల రూపాయల విద్యుత్తు ఛార్జీల భారం వేశారు. సంపద సృష్టిస్తానని చెప్పుకొస్తే ఏదో అనుకున్నాం.. ఈరకమైన సంపద అయితే వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రజలమీద భారం వేసి సృష్టించదు. పైగా అన్నిటికీ జగన్‌ వల్లనే అని చెబుతున్నారు. ఫీజ్‌ రియింబర్స్‌మెంట్‌కు డబ్బులు లేవని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చెబుతున్నారు. ఒక్క యూనిట్‌కు రూ.2.19 పైసలు అదనపు భారాన్ని చంద్రబాబు మోపారని కన్నబాబు తెలిపారు. 1000 బిల్లు వచ్చేవారు రేపటి నుంచి రూ.2,000 కట్టాల్సి ఉంటుందన్నారు. తానొస్తే విద్యుత్తు ఛార్జీలు పెంచను అంటూ ఊదరగొట్టారు. దాదాపు అన్ని సభల్లోనూ ఇదే చెప్పారు.. అయిదేళ్లు చెప్పిందే చెప్పి అయిదు నెలలు గడవకుండా మాటమార్చారు అన్నారు. 

చంద్రబాబు మద్దతు మీడియా ఊదరగొడుతుంది.. 

చంద్రబాబుకు అనుకూల మీడియా మద్దతు తోడుంది. మీడియా మొయ్యకపోతే ఆయన వైఫల్యాలకు ప్రజలు ఏం చేయాలో అర్ధంకానీ పరిస్థితి ఉంటుంది.. భయంకరమైన ప్రచారం ఇది. తాను ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందన్న గొప్ప నమ్మకం.. 2014 నాటికి విద్యుత్తు పంపిణీ సంస్థలకు రూ.29 వేల కోట్లు అప్పులున్నాయి. ఆయన దిగిపోయే నాటికి అంటే 2019కు రూ.86 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన గొప్ప దార్శనికుడు, గొప్ప వ్యక్తి అంటూ ఆయన అనుకూల మీడియా ఊదరగొడుతుందని కన్నబాబు అన్నారు.

టీడీపీ స్క్రిప్ట్‌ పురంధేశ్వరి చదువుతున్నారు.. 

అదానీతో విద్యుత్తు ఒప్పందాలకు సంబందించి బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం మాజీ సీఎం జగన్‌ను వేలెత్తి చూపించినట్లు మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే టీడీపీ రాసిచ్చిన స్క్రిప్ట్‌ ఆమె చదువుతున్నారు అనిపిస్తోంది. ఆమె మాటలన్నీ చంద్రబాబుకు అనుకూలంగానే ఉన్నాయి. జగన్‌ అవినీతికి పాల్పడ్డారని వండివార్చి బురద జల్లుతున్నారు. అమెరికా అక్కడ వేసిన అఫడవిట్‌లో ఎవరి పేర్లు లేవని స్పష్టం చేసింది. విదేశాంగశాఖ మంత్రి ఎవరి ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. కానీ పురంధేశ్వరి జగన్‌ వైపు వేలెత్తి చూపించి మాట్లాడితే ప్రజలు ఎలా నమ్ముతారు. కొంతకాలం లడ్డూతో నడిపారు. ఇప్పుడు అదానీతో ఒప్పందాలంటూ నడుపుతున్నారు. ఇలా జనం దృష్టి మళ్లించాలని ప్రయత్నాలు తప్పా.. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కనిపించడంలేదని ఎద్దేవా చేశారు. 

Also Read: Chandrababu Comments: వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Rohit Sharma: రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
NITW: వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా
NITW: వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Embed widget