అన్వేషించండి

HYDRA Demolitions: హైడ్రా మిగిల్చిన ఆర్థిక  నష్టాల బాధ్యత  ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

Telangana News | కొత్త ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడ్డ వ్యవస్థ హైడ్రా (HYDRA). హైడ్రా తొందరపాటు చర్య వల్ల 10 వేల కోట్ల ఆర్థిక నష్టం జరిగింది. ఈ అంశంపై కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందన్న ఉత్కంఠ నెలకొంది.

Hydra Demolitions | తెలంగాణలో హైడ్రా రేపిన దుమారం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం హైడ్రా (HYDRA) నెమ్మదించింది. కూల్చివేతలు ఆగాయి. కాని కూల్చేసిన  నిర్మాణాల ఓనర్లు మాత్రం పుట్టెడు దుఃఖంతో ఉన్నారు. రుణాల ఊబిలో కూరుకుపోయామని నిరాశలో ఉన్నారు. వారికి రుణ మంజూరు నిమిత్తం సంతకాలు చేసిన షూరిటీ దారుల్లో ఆందోళన. స్నేహితుడనో, లేక బంధువనో ష్యూరిటీ ఇచ్చాం.. ఇప్పుడు వాళ్లు లోన్ ఈఎంఐ కట్టలేకపోతే తమ జీతాల్లో కోత పెడతారా.. తమ ఆస్థులు జప్తు చేసి కట్టమంటారా అన్న భయం నెలకొంది.

ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన  అనుమతులను నమ్మి పది వేల కోట్లు  రుణాలు ఇచ్చాం. ఇప్పుడు వాటిని ఎలా వసూలు చేసుకోవాలన్న  వ్యూహాల్లో బ్యాంకర్లు. హైడ్రా కూల్చివేతలు ఆగినా  దాని తాలుకూ ఆర్థిక ప్రకంపనలు ఇంకా సాగుతూనే ఉన్నాయి.  కోట్లు ఖర్చు చేసి కట్టుకున్న విల్లాల దగ్గర నుండి, లక్షలు వెచ్చించి కొనుగోలు చేసుకున్న  ఇళ్ల వరకు ఆర్థిక నష్టాన్ని మిగిల్చాయి.  అయితే  ఈ నష్టాన్ని మోయాల్సింది ఎవరు అన్న ప్రశ్న సర్వత్రా తలెత్తుతోంది.  ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా తప్పును సరి చేయాడానికి మరో తప్పు చేస్తే ఎలా అన్న సామాన్యుడి ప్రశ్నకు  ఇప్పుడు ఎవరు సమాధానం ఇస్తారన్నదే అసలు ప్రశ్న.


HYDRA Demolitions: హైడ్రా మిగిల్చిన ఆర్థిక  నష్టాల బాధ్యత  ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన వ్యవస్థ తీసుకున్న ఆనాలోచిత చర్య !

పదేళ్ల తర్వాత  తెలంగాణ ఓటరు కొత్త ప్రభుత్వాన్ని గద్దనెక్కించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  అయితే హైదరాబాద్ ను బాగు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి కొత్త నిర్ణయం ఇప్పుడు బూమ్ రాంగ్ అయిందా అన్న చర్చ  సాగుతోంది. ప్రతీ సీఎంకు హైదరాబాద్ అంటే చాలా మక్కువ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే కల్పతరువు మన భాగ్య నగరం. సీఎం సీటు ఎక్కిన ప్రతీ ఒక్కరు హైదరాబాద్ పై తమ ముద్ర ఉండేందుకు ప్రయత్నిస్తారు.  గత సీఎంలు హైదరాబాద్ కుఎన్నో నగిషీలద్దారు.  ఐటీ పరిశ్రమ వచ్చినా, సైబర్ టవర్ నిర్మాణం అయినా, దాని పేరుతో సైబరాబాద్ వంటి కొత్త నగరం ఏర్పడినా, హైదరాబాద్ కు మెట్రో రైల్ వచ్చినా, నగరంలో ఫ్లైఓవర్లు కట్టినా తమ ప్రభుత్వ హయాంలో ఇది చేశామని గొప్పగా చెప్పుకోవాలంటే  హైదరాబాద్ లో ఏదో చేయాలి. ఇది ప్రతీ సీఎం ఆలోచన. ఇది మంచిదే. నగరంలో కోటిన్నర జనాభా నివసిస్తోంది. ప్రతీ రోజు తెలంగాణ గ్రామల నుండి మొదలు ప్రపంచం నుండి  లక్షలాది మంది వస్తుంటారు, పోతుంటారు. వేలాది మంది హైదరాబాద్ లోనే తమ  బ్రతుకు తెరువు వెతుక్కుంటారు.  ఇలా హైదరాబాద్ అందరికీ మత్తెక్కించే గమ్మత్తైన నగరం. ఆలాంటి నగరం పై తమ ముద్ర ఉండాలని ఎవరు మాత్రం అనుకోరు. 

కొత్తగా వచ్చిన రేవంత్ సర్కార్ తీసుకున్న  హైడ్రా ఏర్పాటు, చెరువు భూముల్లో ఉన్న  అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం మాత్రం ఇప్పుడు పెద్ద చిక్కునే తీసుకువచ్చింది. అయితే రాజకీయ నాయకులు మంచి చేయాలన్న తలంపుతో ఉండవచ్చు. కాని  ఆ నిర్ణయాలను అమలు చేసే వ్యవస్థ ఇంకా జాగ్రత్తగా ఆలోచించాల్సింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త వ్యవస్థ హైడ్రా. ఈ హైడ్రా అయినా పూర్తి స్థాయిలో ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేస్తే వచ్చే పరిణామాలు ఏంటి. వాటిని ఎలా ఎదుర్కోవాలి అన్న పూర్తి ప్రణాళిక తయారు చేయాలి. దాన్ని ప్రభుత్వ పెద్దల ముందు చర్చించిన తర్వాత తన దూకుడు ప్రదర్శించాల్సి ఉంది. కాని అలాంటి పూర్తి స్థాయి కసరత్తు జరిగినట్లు లేదు. కొత్త ప్రభుత్వం, కొత్త వ్యవస్థ సృష్టించిన సరి కొత్త సమస్య ఇప్పుడు తెలంగాణ ముందు ఉంది.

Also Read: Telangana Politics: తెలంగాణలో BRS బ్యాటరీకి కాంగ్రెస్ ఛార్జింగ్- బీఆర్ఎస్‌ను జాకీలు పెట్టి లేపుతున్న రేవంత్ సర్కార్!

 తప్పును సరిదిద్దేందుకు మరో తప్పు చేయాలా..?

ఉద్దేశాలు మంచివే అయినా వాటి ఫలితాలు దుష్ప్రభావాన్ని మిగల్చకూడదు.  హైదరాబాద్  లోని చెరువులను పరిరక్షించాలన్న నిర్ణయం మంచిదే.  కాని దాన్ని కాపాడేందుకు తీసుకున్న చర్యలు  ఇప్పుడు వివాస్పదంగా మారాయి. గత ప్రభుత్వాలు చేసిన తప్పును  సరి చేసే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మరో తప్పును సృష్టించాయి.  చెరువు ఎఫ్ టీఎల్  లేదా బఫర్ జోన్ల పరిధిలో ఇళ్ల నిర్మాణాలు అక్రమ నిర్మాణాలని కూల్చి వేసింది.  ఇలా ప్రభుత్వం చెబుతోన్న అక్రమనిర్మాణాలకు బ్యాంకులు దాదాపు పది వేలకోట్ల రూపాయల వరకు రుణాలు ఇచ్చాయి. ఈ పరిణామాల తర్వాత  ఉలిక్కిపడ్డ బ్యాంకులు లెక్కలు తీస్తే దాదాపు 8వేల నుండి పది వేల కోట్ల వరకు చిన్న, పెద్ద, బడాబాబుల వంటి వాళ్లకు రుణాలు ఇచ్చాయి.. బ్యాంకులు  ఇళ్ల నిర్మాాణానికి  లోన్లు ఇవ్వాలంటే  రిజిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ వంటి శాఖల నుుండి అనుమతులు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత రుణాలు ఇస్తుంది . అలా పై మూడు శాఖల అనుమతులను పరిశీలించి, న్యాయ నిపుణుల సలహాలతోనే ఈ ఇళ్లకు రుణం మంజూరు చేసింది.  

ఇక్కడ ఇల్లు నిర్మించిన వారు లేదా ఇళ్లు కొనుక్కున్న వారి తప్పు లేదు. వారికి లోన్లు ఇచ్చిన బ్యాంకులది తప్పులేదు.  కాని తప్పు ఏదైనా ఉంది అంటే  గత ప్రభుత్వాల నిర్ణయాలు,  ఆ ప్రభుత్వ పాలనా వ్యవస్థలు. ఆనాడు సరైన నిర్ణయం కొత్త ప్రభుత్వం రాగానే మరో కొత్త వ్యవస్థను సృష్టించి అది తప్పు ఇది సరైంది అని నిర్ణయం తీసుకుంటే , అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమైన తన ఐదేళ్ల కాలపరిమితిలో గత ప్రభుత్వాల నిర్ణయాలను సరి చేయడానికే సమయం వెచ్చించాల్సి వస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. అయితే గత ప్రభుత్వాల తప్పులను, అప్పటి పాలకుల నిర్ణయాలను సమీక్షించవల్సిందే. కాని మధ్యలో సామాన్యుడు బలి అయ్యే పరిస్థితి వస్తే ఎలా.  ఇప్పుడు  అదే జరిగింది. చెరువులను పరిరక్షిస్తున్నామన్న పేరుతో సామాన్యుడి ఇళ్లు కూల్చివేస్తే  తప్పును సరి చేయడం కోసం మరో తప్పు చేయడమే అవుతుంది.

ఈ నష్టానికి బాధ్యత ఎవరిది ?

 ఇప్పుడు హైడ్రా బాధితులకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. తమ రుణాలు మరలా ఎలా వెనక్కి వస్తాయన్నది వారి వైపు ఆలోచన.  ఇదిలా ఉంటే ఇప్పుడు బంతి కోర్టులో ఉంది.  అన్ని అనుమతులు తీసుకుని ఇళ్లు కట్టుకుంటే హైడ్రా కూల్చివేసిందని ఫిర్యాదు దారులు న్యాయ వ్యవస్థ మెట్లు ఎక్కారు. అయితే ఇప్పుడు న్యాయస్థానం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి. సామాన్యుడు తన స్వంత పనులు, ఇంటి పనులు మాత్రమే చక్కపెట్టుకోగలడు.  అందరితో కలిసి జీవించే క్రమంలో సంఘంలో వచ్చే  సమస్యల పరిష్కారం ఆ  ఒక్కడితో సాధ్యం కాదు. ఈ క్రమంలోనే  సంఘంలో తలెత్తే సమస్యల పరిష్కారాని ఓ వ్యవస్థను తయారు చేసుకున్నాడు. ఆ వ్యవస్థ పేరే ప్రభుత్వం.  ఆ ప్రభుత్వంలోని  అంతర్గత వ్యవస్థలే ఆయా శాఖలు. ఇలా  ఏర్పడ్డ రిజిస్ట్రేషన్ ,  హెచ్ఎండీఏ,  జీహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ, వాటర్ బోర్టు వంటి శాఖలన్నీ తన స్థలం, ఇళ్లు సక్రమమే అని స్ఠాంపు వేసి మరీ అధికారికంగా రుజువు పత్రాలు ఇస్తే ఆ వ్యక్తి బ్యాంకుల నుండి రుణాలు తెచ్చుకుని ఇళ్లు నిర్మించుకున్నారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ తప్పు పట్టాల్సి వస్తే ఎవరిని తప్పుబడుతుందో న్యాయంగానే ఊహించి చెప్పేయవచ్చు.  ఈ మూడు శాఖలు చేసిన తప్పుకు  సామాన్య ప్రజ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి.

రుణ గ్రహీతలు రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో బ్యాంకులు జప్తు చేయడానికి అక్కడ స్థలం లేదు, ఆ స్థలంలో నిర్మాణాలు లేవు. ఇప్పుడు బ్యాంకుల ముందున్న పరిస్థితి ఒక్కటే ఆ రుణ గ్రహీత మిగతా ఆస్థులు జప్తు చేయడం  లేదా   అతని జీతంలో నుండి రికవరీ చేయడం లేదా రుణ గ్రహీతకు ష్యూరిటీ ఇచ్చిన వారి నుండి వసూలు చేయడం. ఇప్పుడు వీరంతా నష్ఠపోయిన సమూహంగా మారారు.వీరికి న్యాయం చేసేందుకు  ఈ మూడు శాఖల నుండి బ్యాంకులకు చెల్లించాల్సిన దాాదాపు పది వేల కోట్ల రూపాయలు  వసూలు చేయాలని  న్యాయస్థానం ఆదేశిస్తే పరిస్థితి ఏంటి. 

ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా..?

బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలు  సంబంధింత శాఖల నుండి చెల్లించాలని న్యాయస్థానం ఒక వేళ తీర్పు ఇస్తే అప్పుడు ప్రభుత్వం  ఏం నిర్ణయం తీసుకుంటున్నద చర్చ సాగుతోంది. రైతు రుణ మాఫీ చేసేందుకు బ్యాంకులకు ప్రభుత్వమే రైతులు తీసుకున్న  తన ఖజానా నుండి విడతల వారీగా చెల్లిస్తుంది. ఒక వేళ న్యాయస్థానం అలాంటి తీర్పు ఇస్తే ప్రభుత్వం చెల్లిస్తుందా.  పది వేల కోట్లకు అటు ఇటుగా రుణాలు ఇచ్చినట్లు బ్యాంకింగ్ ప్రతినిధులు చెబుతున్నారు. అంత మొత్తం చెల్లించే బాద్యత కాంగ్రెస్ సర్కార్  తీసుకోగలుగుతుందా.  ఇప్పటికే  ఎన్నికల్లో ఇచ్చిన హమీల అమలుకు ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు  నానా తంటాలు పడే పరిస్థితి.

బడ్జెట్ లోటు పూరించుకునేందుకు భూముల అమ్మకాలపైన ప్రభుత్వం దృష్టి సారించింది. గత పదేళ్లలో భూముల అమ్మకాల ద్వారా  గత ప్రభుత్వం ఆశించిన స్థాయిలో మాత్రం నిధులు సమకూరలేదు.  అలాంటిది  ఇంత మొత్తం చెల్లించే బాధ్యత సర్కార్ తీసుకుంటుందా అన్నది చూడాలి.  అయితే న్యాయస్తానం ఏం తీర్పు ఇవ్వనుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం ఏం స్టెప్స్ తీసుకుంటుంది అన్నది మాత్రం ఉత్కంఠగా ఉంది.  ఏది ఏమైనా దేశంలోనే ఇది కొత్తగా ఏర్పడిన సమస్యగా చెప్పవచ్చు.  దీని మీద న్యాయస్థానాలు ఏం తీర్పువెళ్లడిస్తాయన్నది మాత్రం ఆసక్తికరం.

Also Read: Telangana News: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Numaish 2025: భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
Embed widget