Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
Google Search Tips: గూగుల్‌లో మనం చాలా విషయాలు సెర్చ్ చేస్తాం. కానీ కొన్ని విషయాలు సెర్చ్ చేస్తే ఏకంగా జైల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Tech Tips: ఈ ఆధునిక యుగంలో దాదాపు ప్రతిదీ ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే సెర్చ్ ఇంజిన్ గూగుల్. గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నప్పుడు సమాచారం ప్రామాణికతను మనం స్వయంగా చెక్ చేయాలి. అయితే గూగుల్ సెర్చ్ సమయంలో మనం దేనిని వెతుకుతున్నామో, దేన్ని వెతక్కూడదో గుర్తుంచుకోవడం ముఖ్యం. గూగుల్ సెర్చ్ విషయంలో మీ చిన్న నిర్లక్ష్యం మిమ్మల్ని జైలులో పెట్టవచ్చు. ఇప్పుడు మనం గూగుల్‌లో ఏం సెర్చ్ చేయకూడదో వాటి గురించి తెలుసుకుందాం.
పైరేటెడ్ సినిమా
చాలా మంది వ్యక్తులు ఫ్రీగా సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లను చూడటానికి గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. కానీ మీరు కొత్త సినిమాలను పైరేట్ చేసినా లేదా గూగుల్‌లో సెర్చ్ చేసినా, అది నేరం కిందకు వస్తుంది. మీకు కనీసం మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఇది కాకుండా మీకు రూ. 10 లక్షల జరిమానా కూడా విధించవచ్చు.
చైల్డ్ పోర్న్ లేదా చైల్డ్ క్రైమ్ గురించి సెర్చ్ చేయవద్దు
చైల్డ్ పోర్న్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తే అది కూడా నేరం కిందకే వస్తుంది. దీనికి సంబంధించి భారతదేశంలో చట్టం కఠినంగా ఉంది. పోక్సో చట్టం 2012లోని సెక్షన్ 14 ప్రకారం, చైల్డ్ పోర్న్ చూడటం, సేవ్ చేయడం కూడా నేరం కిందకే వస్తుంది. మీరు ఈ కేసులో పట్టుబడితే మీపై తగిన చర్యలు తీసుకోవచ్చు. ఈ నేరానికి మీకు ఐదు నుంచి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించవచ్చు.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
బాంబు లేదా ఆయుధాన్ని ఎలా తయారు చేయాలి?
గూగుల్‌లో బాంబులు లేదా ఆయుధాలను తయారు చేసే పద్ధతిని తెలుసుకోవడానికి ప్రయత్నించవద్దు. మీరు ఇలా చేస్తే మీరు మొదట భద్రతా సంస్థల రాడార్‌లోకి వస్తారు. మీపై తగిన చర్యలు కూడా తీసుకోవచ్చు. అంతే కాదు ప్రెషర్ కుక్కర్ బాంబ్ తయారీ విధానాన్ని గూగుల్‌లో సెర్చ్ చేయడం కూడా నేరం కిందకే వస్తుంది.
అబార్షన్ గురించి సెర్చ్ చేయవద్దు
అబార్షన్ గురించి గూగుల్‌లో ఎప్పుడూ సెర్చ్ చేయకూడదు. ఎందుకంటే డాక్టర్ అనుమతి లేకుండా అబార్షన్ చేయడం భారతదేశంలో చట్టవిరుద్ధం. మీరు దీని గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఘోరంగా ఇరుక్కోవచ్చు. అలాగే సెక్యూరిటీ పరంగా కూడా ఇది సరైనది కాదు. దీన్ని గూగుల్‌లో ఎప్పుడూ సెర్చ్ చేయవద్దు.
ఈ విషయాలను కూడా సెర్చ్ చేయకూడదు
గూగుల్‌లో నేర కార్యకలాపాల గురించి సెర్చ్ చేయకండి. అలాగే అత్యాచార బాధితురాలి పేరును వెతకకండి.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
This is an incredible search result from Google:
— Cyrus (@CyrusShepard) February 23, 2019
• Answers a fairly complex question
• Takes the copy of many 3rd party publisher to create its own independent web page
• Zero visible on-page links to the publishers who provided the data
This is the future of Google Search pic.twitter.com/txNU2Z7HB5