Bigg Boss Telugu Season 8: డబుల్ ఎలిమినేషన్‌లో తేజ, పృథ్వీ - గోల్డెన్ టికెట్‌తో లక్కీ ఛాన్స్... టైటిల్ గెలిచే దమ్ము ఎవరికి?
Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ ఇంట్లో పదమూడో వారం వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చిన టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్‌ను అభినందించాడు. తేజ ఎలిమినేట్ అయ్యాడు.
Tasty Teja Eliminated in 13th Weekend: బిగ్ బాస్ ఇంట్లో పదమూడో వారం గడిచేందుకు టైం వచ్చింది. వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చిన టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్‌ను అభినందించాడు. ఆ తరువాత గోల్డెన్ టికెట్, బ్లాక్ టికెట్ అనే ఆట పెట్టాడు. ఆ తరువాత దమ్ము, దుమ్ము అనే టాస్క్ పెట్టాడు. చివరకు తేజ ఎలిమినేటర్ అయినట్టుగా చెప్పుకొచ్చాడు. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్‌లో పృథ్వీ ఎలిమినేట్ అవుతాడని తెలుస్తోంది. మరి శనివారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ సారి చూద్దాం
శుక్రవారం నాడు కంట్రీ డిలైట్ టాస్క్ జరిగిందని చూపించాడు. ఇక మెగా చీఫ్ టైం అయిపోయిందని, ఓ సారి ఇళ్లంతా తిరిగి మెగా చీఫ్ బ్యాడ్జ్‌ని స్టోరూంలో పెట్టమని రోహిణిని బిగ్ బాస్ ఆదేశించాడు. అనంతరం నాగార్జున ఇంటి సభ్యులతో మాట్లాడాడు. టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్‌ను అభినందించి.. ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకుని నేరుగా ఫినాలేకి వెళ్లాడని నాగ్ తెలిపాడు. ఫస్ట్ ఫైనలిస్ట్ అయినందుకు ట్రోఫీని కూడా ఇప్పించాడు.
అవినాష్ గెలవడంతో నాలుగు లక్షలు వచ్చాయని, అలా మొత్తంగా ప్రైజ్ మనీ 54 లక్షల 30 వేలు అయ్యాయని చూపించాడు. అనంతరం బ్లాక్ టికెట్, గోల్డెన్ టికెట్ అని ఆట ఆడించాడు. ఈ క్రమంలో తేజకి బ్లాక్ టికెట్‌ను నిఖిల్ ఇచ్చాడు. ఆటల్లో ఓడిపోతే డీమోటివేట్ అవుతాడు అని తేజ గురించి నిఖిల్ చెబుతాడు. ఆపై ప్రేరణకి గౌతమ్ బ్లాక్ టికెట్ ఇస్తాడు. సంచాలక్ నిర్ణయాన్ని గౌరవించలేదు, గెస్టులను అవమానపర్చిందని ప్రేరణ గురించి గౌతమ్ చెబుతాడు. ఇక ప్రేరణ ఎలా రూల్స్ బ్రేక్ చేసిందో వీడియో వేసి చూపించాడు నాగ్. దీంతో ప్రేరణ తన తప్పుని ఒప్పుకుంది. రోహిణి వచ్చి పృథ్వీకి బ్లాక్ టికెట్ ఇచ్చింది.
అవినాష్ ఏమో నబిల్‌కు, తేజ ఏమో విష్ణుకి బ్లాక్ టికెట్ ఇచ్చారు. ఇక ప్రేరణ వంత వచ్చే సరికి గౌతమ్ మీద రివేంజ్ అన్నట్టుగా చెప్పింది. గౌతమ్ టాస్కుల్లో బాగా ఆడలేదని, సుడోకు గేమ్ తప్పుగా ఆడాడు అంటూ చెప్పింది. ఇక గౌతమ్‌కు బ్లాక్ టికెట్ ఇవ్వాలా? లేదా? అని హౌస్ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో విష్ణు, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, నబిల్ అంతా కూడా గౌతమ్‌కు బ్లాక్ టికెట్ ఇవ్వమని ఓటు వేశారు. కానీ నాగార్జున మాత్రం గోల్డెన్ టికెట్ ఇచ్చి ఆ ఐదుగురి పరువు తీశాడు. వారంతా గౌతమ్ మీద ఎంత గ్రడ్జ్‌తో ఉన్నారో అందరికీ చూపించేశాడు నాగ్.
Also Read: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎపిసోడ్ 89 రివ్యూ: సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
గౌతమ్, రోహిణి, నిఖిల్‌లకు గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. చివరకు అవినాష్‌కు బ్లాక్ టికెట్ ఇస్తానని నాగ్ ప్రాంక్ చేశాడు. దీంతో అవినాష్ ఊపిరి ఒక్కసారిగా ఆగినంత పని అయింది. అదంతా ప్రాంక్ అని చెప్పడంతో కాస్త కూల్ అయ్యాడు. ఆ తరువాత దమ్ము, దుమ్ము అనే టాస్క్ పెట్టాడు. ఇందులో ఎక్కువగా దుమ్ము అని తేజకు ట్యాగ్ ఇచ్చారు. నిఖిల్, నబిల్‌లకు టైటిల్ గెలిచే దమ్ము ఉందని ట్యాగ్ ఇచ్చారు. గోల్డెన్ టికెట్ వచ్చిన వారికి ప్రయోజనాలు ఉంటాయని, అవేంటో బిగ్ బాస్ చెబుతాడని నాగ్ అంటాడు.ఆపై తేజ ఎలిమినేట్ అయినట్టుగా నాగ్ చెప్పేస్తాడు.
స్టేజ్ మీదకు తేజ తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు. కూరగాయలతో కంటెస్టెంట్లను పోల్చమని తేజకు టాస్క్ ఇచ్చాడు నాగ్. అవినాష్ ఆటల్లో, మాటల్లో ది బెస్ట్ అని ఉల్లిపాయ అని ఇచ్చాడు. రోహిణి గెలుపు అన్ని సీజన్లలో ది బెస్ట్ అని పొటాటో ఇచ్చాడు. విష్ణు కాకరకాయ అని, గౌతమ్ క్యాబేజీలా పొరపొరలు బయటకు వస్తూనే ఉంటుందని అన్నాడు. ప్రేరణ మాట సరి చేసుకోకపోతే ఎలిమినేట్ అవుతావ్.. అని బెండకాయ ఇచ్చాడు. పృథ్వీలో ఫన్ ఉంది కానీ యారగెంట్ చూపిస్తాడు అని పచ్చి మిర్చి ఇచ్చాడు. గౌతమ్ టాప్ 2 అని ఫిక్స్ చేసి చెప్పాడు తేజ. నబిల్ ఆటలో కన్ ఫ్యూజ్ అవుతున్నాడు. ముందు టాప్ 2 అనుకున్నా.. కానీ ఇప్పుడు టాప్ 5లో ఉంటాడంతే అని చెప్పాడు. నిఖిల్ తన ఎమోషన్స్‌ను తగ్గిస్తే బెటర్ అని సలహా ఇచ్చాడు.