Tamil Arasu Amma : అప్పట్లో మొగుడు వద్దని ప్రియుడే ముద్దని రచ్చ.. ఇప్పుడు ఏకంగా మాతాజీ అవతారం ! తమిళనాడును షేక్ చేస్తున్న మహిళ కన్నింగ్ స్టోరీ
మొగుడు వద్దని ప్రియుడే ముద్దని ఓ మహిళ వెళ్లిపోయింది. తన వాదనను టీవీ చానళ్లలో వినిపించింది. ఆమె ఏడేళ్ల తర్వాత ఆదిపరాశక్తి పేరుతో భక్తుల ముందుకు వచ్చిింది. కానీ ఆమె కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు.
![Tamil Arasu Amma : అప్పట్లో మొగుడు వద్దని ప్రియుడే ముద్దని రచ్చ.. ఇప్పుడు ఏకంగా మాతాజీ అవతారం ! తమిళనాడును షేక్ చేస్తున్న మహిళ కన్నింగ్ స్టోరీ New incarnation of Kiladi Lady in Tamil Nadu by the name of Annapurna Amma - sensational with old affairs coming out Tamil Arasu Amma : అప్పట్లో మొగుడు వద్దని ప్రియుడే ముద్దని రచ్చ.. ఇప్పుడు ఏకంగా మాతాజీ అవతారం ! తమిళనాడును షేక్ చేస్తున్న మహిళ కన్నింగ్ స్టోరీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/28/22846e8e405c5984bc8275c385a5cad5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తమిళనాడులో ఇప్పుడు ఓ కొత్త అమ్మ సంచలనం సృష్టిస్తున్నారు. ఆమె రాజకీయ అమ్మ కాదు., డెమీగాడ్ అమ్మ. తనను తాను స్వయం ప్రకటిత ఆదిపరాశక్తిగా ప్రకటించుకున్న అమ్మ. అయితే చూపించిన మహిమలను చూసి అక్కడి ప్రజలు ఫ్లాటైపోలేదు. అంతకు మించి ఆమె బ్యాక్‌గ్రౌండ్ చూసి... కళ్లు తిరిగిపడిపోతున్నారు. ఆమె ఆదిపరాశక్తి అంటే మరో కోణంలో నమ్మాల్సిందేనని సైటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే ఆమె భర్తని వదిలేసి ప్రియుడితో పరారైన బాపతు క్యారెక్టర్., ఆమె ఇప్పుడు ఆదిపరాశక్తినని ప్రకటించుకుని తనను తాను మార్కెటింగ్ చేసుకుంటోంది.
చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్ లోని ఓ కల్యాణ మండపం వేదిక అన్నపూర్ణి అరసు మాతాజీ జనవరి ఒకటిన దివ్య దర్శనం ఇవ్వనున్నారని, భక్తులకు ఉపదేశం చేయనున్నారని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. ఈ మాతాజీ చుట్టూ భక్తులు ఆశీర్వచనాలు తీసుకోవడం, క్షణాల్లో ఆమె పూనకం వచ్చినట్టు ఊగి పోతు భక్తుల కోరికల్ని తీర్చడం, వరాలు ఇవ్వడం వంటి అనేక వీడియోలు యూట్యూబ్‌లో ప్రత్యక్షం అయ్యా యి. అయితే ఈ మొహం ఎక్కడో చూసినట్లుగా ఉందే అని చాలా మందికి అనిపించింది. వెంటనే సెర్చ్ చేశారు. అంతే... ఆమె జాతకం బయటకు వచ్చేసింది. ఆమె ఎవరంటే... ఏడేళ్ల క్రితం.. టీవీ చానళ్లలోవైరల్ అయిన ఓ న్యూస్ లో హీరోయిన్.
2014లో ఓటీవీ ఛానల్ వేదికగా జరిగిన చర్చలో తనకు భర్త, 14 ఏళ్ల కుమార్తె కన్నా, ప్రియుడు అరసే ముఖ్యం అని స్పష్టం చేసి అతడితో వెళ్లి పోయిన ఓ మహిళ గురించి విస్తృతంగా చర్చలు జరిగాయి. ఆ మహిళే ఈ అన్నపూర్ణేశ్వరి. అలాగే గత వివాదాల వీడియోలు సైతం తెర మీదకు తెచ్చే సోషల్ మీడియా పోస్టులు కూడా భారీగానే పెరిగాయి. గతంలో భర్త, కుమార్తెను వదిలి ప్రియుడే కావాలని రచ్చకెక్కిన ఓ మహిళ తాజాగా తాను ఆది పరాశక్తి అవతారం అని చెప్పుకుంటూ.. తెర మీదకు రావడం స్థానికులను విస్మయంలో పడేసింది. ఆమె గురించి మొత్తం బయటకు రావడంతో ఇతర వివరాల్ని సోషల్ మీడియా ఆరా తీసింది.
Also Read: Year Ender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం
భర్తను వదిలేసింది సరే... ప్రియుడే కావాలంటే వెళ్లింది కదా.. ఆ ప్రియుడేమయ్యాడు అని కొంత మంది ఆరా తీశారు. అయితే ప్రియుడు అరసు అనుమానాస్పదంగా గతంలో మరణించినట్టు తేలింది. దీంతో పోలీసులు ఎంటరయ్యారు. దీంతో ఈ వివాదాస్పద మాతాజీ అదృశ్యమయ్యారు. కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న నిర్వాహకులు, తమ సెల్‌ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మాతాజీని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడీమె తమిళనాట అంతా హాట్ టాపిక్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)