Crime News: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం... వారికి ఇదివరకే పెళ్లయింది, కానీ సీక్రెట్‌గా కలుసుకుంటూ చివరికి ఇలా!
ఇద్దరికీ ఇంతకుముందే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. కలుసుకోవద్దని కుటుంబసభ్యులు పదే పదే వారించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.
వారిద్దరూ ప్రేమించుకున్నారు.. కానీ ఇంట్లో వాళ్లు వారి ప్రేమను ఒప్పుకోలేదని పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రియుడి పరిస్థితి నిలకడగా ఉండగా... ప్రియురాలి పరిస్థితి విషమంగా వుంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో వైవాహిక బంధానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. పెళ్లి అనే బంధాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. కానీ వివాహిత, ఓ వ్యక్తి ప్రేమించుకున్నారు. కుటుంబసభ్యులు పదే పదే వారించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే.. ఇద్దరికీ ఇంతకుముందే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
అనంతపురం నగర శివారులోని ఉప్పారపల్లి గ్రామానికి చెందిన గురుమూర్తికి, చిన్నకుంట గ్రామానికి చెందిన వివాహితకు కొన్ని రోజుల కిందట పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ వీరిరువురికీ అప్పటికే వేరొకరితో పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. గురుమూర్తి, సాయిలీల ప్రేమ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాలు ఇద్దరిని మందలించాయి. మనస్తాపం చెందిన ఆమె, గురుమూర్తి టీవీ టవర్ సమీపంలో ఉన్న బ్రిడ్జి (వన మిత్ర పార్కు) వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది గమనించిన స్థానికులు ఇద్దరిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురుమూర్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గురుమూర్తికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడని బంధువులు చెబుతున్నారు.
గతంలో కూడా ఈ సమస్యపై ఇరువురిని కుటుంబసభ్యులు హెచ్చరించినా వారిద్దరిలో ఏ మార్పు రాలేదు. ఎట్టి పరిస్థితుల్లోను వీరు మరో వివాహం చేసుకోవాలని భావించారు. ఇదివరకే పెళ్లయిన వారు ఇలా వివాహేతర బంధంతోనైనా ఏకం కావాలనుకోవడం ఇరు కుటుంబాలకు సమస్యగా మారింది. స్థానికులు సైతం ఈ విషయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు సర్ది చెప్పినా ప్రయోజనం కనిపించలేదు.
ఇక తాము కలుసుకొనేందుకు అవకాశం లేదని భావించిన వివాహిత, ఆ వ్యక్తి అనంతపురం సమీపంలో ఆత్యహత్యాయత్నం చేశారు. వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మహిళ పరిస్థితి కాస్త విషమంగా ఉండగా, గురుమూర్తి బాగానే ఉన్నాడని సమాచారం. ఇలాంటి పనుల వల్ల ఇరు కుటుంబాల వారి పరువు పోతుందని, పిల్లలపై చెడు ప్రభావం చూపుతాయని పోలీసులు, అధికారులు పదే పదే చెబుతున్నా కొందరిలో మార్పు రావడం లేదు. శారీరక ఆకర్షణ వల్ల ప్రాణాలు పోవడం తరచుగా ఏదో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి.
Also Read: Shanmukh: 'ఫాలో.. అన్‌ఫాలో కాదు.. నేనే గ్యాప్ ఇచ్చా..' దీప్తితో పెళ్లిపై షణ్ముఖ్ క్లారిటీ..
Also Read:టాలీవుడ్ లో యూనిటీ లేదు.. వైరల్ అవుతోన్న నాని వ్యాఖ్యలు
Also Read: Year Ender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం