అన్వేషించండి
Advertisement

Shanmukh: 'ఫాలో.. అన్‌ఫాలో కాదు.. నేనే గ్యాప్ ఇచ్చా..' దీప్తితో పెళ్లిపై షణ్ముఖ్ క్లారిటీ..
సోషల్ మీడియాలో దీప్తితో షణ్ముఖ్ కి బ్రేకప్ జరిగిందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. దీప్తి ఇన్స్టాగ్రామ్ లో పెట్టే పోస్ట్ లు కూడా అలానే ఉండడంతో అందరూ వీరి బ్రేకప్ విషయం నిజమనే అనుకున్నారు.

దీప్తితో పెళ్లిపై షణ్ముఖ్ క్లారిటీ..
బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొన్న షణ్ముఖ్ హౌస్ లో ఉన్నన్ని రోజులు సిరితో చాలా స్నేహంగా ఉన్నాడు. వారిద్దరి హగ్గులు, ముద్దులు హాట్ టాపిక్ అయ్యేవి. ఇద్దరూ ఒకరికొకరు ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతున్నామంటూ ఓపెన్ గానే చెప్పేశారు. షణ్ముఖ్ అయితే సిరికి అడిక్ట్ అయిపోతున్నా అంటూ శ్రీరామ్ తో డిస్కస్ కూడా చేశాడు. హౌస్ లోకి సిరి మదర్ వచ్చి హగ్గుల గురించి హెచ్చరించినా.. వీళ్లు మాత్రం మానలేదు.
ఫ్రెండ్షిప్ హగ్ అంటూ ఇద్దరూ ఆడియన్స్ ను విసిగించారు. షణ్ముఖ్ చాలా ఏళ్లుగా దీప్తి సునైనాతో రిలేషన్ లో ఉన్నాడు. సిరికి శ్రీహాన్ అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ సంగతి మర్చిపోయి ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉండడం ఆడియన్స్ కు నచ్చలేదు. దీంతో షణ్ముఖ్-సిరిలను బాగా ట్రోల్ చేశారు. రీసెంట్ గా బిగ్ బాస్ షో ముగిసిపోవడంతో బయటకొచ్చిన షణ్ముఖ్.. తన ఫ్రెండ్ సిరి-జెస్సీలతో కలిసి వైజాగ్ లో తిరుగుతున్నాడు.
మరోపక్క సోషల్ మీడియాలో దీప్తితో షణ్ముఖ్ కి బ్రేకప్ జరిగిందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. దీప్తి ఇన్స్టాగ్రామ్ లో పెట్టే పోస్ట్ లు కూడా అలానే ఉండడంతో అందరూ వీరి బ్రేకప్ విషయం నిజమనే అనుకున్నారు. సోషల్ మీడియాలో కూడా ఒకరినొకరు అన్‌ఫాలో అయ్యారని వార్తలొచ్చాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు షణ్ముఖ్.
ఇన్స్టాగ్రామ్ లో లైవ్ లోకి వచ్చిన షణ్ముఖ్.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఎక్కువమంది దీప్తి గురించే అడగడంతో.. 'బ్రేకప్ లాంటివి ఏం జరగలేదని.. కాస్త స్పేస్ ఇచ్చానని' క్లారిటీ ఇచ్చాడు షణ్ముఖ్. ఇక అన్‌ఫాలో గురించి మాట్లాడుతూ.. బిగ్ బాస్ షోకి వెళ్లకముందు కూడా ఒకరినొకరం సోషల్ మీడియాలో ఫాలో అవ్వలేదని.. పెళ్లి తరువాతే ఒకరి అకౌంట్ ని మరొకరు ఫాలో అవ్వాలని ముందే ఫిక్స్ అయ్యామని తెలిపాడు షణ్ముఖ్.
ప్రస్తుతం వైజాగ్ లో ఉన్నానని.. హైదరాబాద్ వెళ్లగానే దీప్తిని కలుస్తానని చెప్పాడు. తన కారణంగా దీప్తి చాలా నెగెటివిటీను ఫేస్ చేసిందని.. అయినప్పటికీ తనకోసం నిలబడిందని చెప్పాడు షణ్ముఖ్. ఆమెతో బ్రేకప్ జరగదని.. తన చేతి మీద పచ్చబొట్టు పోయేంత వరకు దీపుని వదలనని చెప్పుకొచ్చాడు.
View this post on Instagram
Also Read:తమన్ కి క్రేజీ ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్.. 'రాధేశ్యామ్' బీజియమ్ అదిరిపోవాలంతే..
Also Read: త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ లో నవీన్.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..
Also Read: ఏపీలో థియేటర్లు క్లోజ్.. నిఖిల్ ఎమోషనల్ పోస్ట్..
Also Read:సల్మాన్ ఖాన్ కి పాముకాటు.. హాస్పిటల్ లో ట్రీట్మెంట్..
Also Read:టాలీవుడ్ లో యూనిటీ లేదు.. వైరల్ అవుతోన్న నాని వ్యాఖ్యలు
Also Read:యూవీ క్రియేషన్స్ లో నవీన్ పోలిశెట్టి.. అనుష్కకు జంటగా..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion