Salman Khan Hospitalized : సల్మాన్ ఖాన్ కి పాముకాటు.. హాస్పిటల్ లో ట్రీట్మెంట్..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాముకాటుకు గురయ్యారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాముకాటుకు గురయ్యారు. మహారాష్ట్రలోని పన్వేల్ లో ఆయన ఫామ్ హౌస్ లో ఈ ఘటన జరిగింది. శనివారం రాత్రి ఆయన పాముకాటుకు గురికాగా.. వెంటనే హాస్పిటల్ కు తరలించారు. అయితే సల్మాన్ ను విషం లేని పాము కాటేయడంతో ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. నవీ ముంబైలోని కమోతే ప్రాంతంలోని MGM హాస్పిటల్ లో ఆయన్ను జాయిన్ చేశారు. ట్రీట్మెంట్ అనంతరం ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు సల్మాన్ ను డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆయన ఫామ్ హౌస్ లోనే రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.
రేపు సల్మాన్ ఖాన్ 56వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోబోతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన పాముకాటుకు గురికావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సల్మాన్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఫామ్ హౌస్ కి వెళ్లిన సల్మాన్ ని పాము కాటేసింది.
ప్రమాదం తప్పింది కాబట్టి సల్మాన్ తన పుట్టినరోజు వేడుకలను సింపుల్ గా ఫామ్ హౌస్ లోనే తన ఫ్యామిలీతో జరుపుకోనున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల విడుదలైన 'అంతిమ్' సినిమాలో సల్మాన్ కీలకపాత్రలో కనిపించారు. పోలీస్ ఆఫీసర్ గా ఆయన పాత్ర అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ.. కథలో సత్తా లేకపోవడంతో ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయ్ జాన్' సీక్వెల్ ను ప్లాన్ చేశారు. 2015లో విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అందుకుంది. అందుకే ఇప్పుడు సీక్వెల్ ను తెరకెక్కించబోతున్నారు. దీనికి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందించనున్నారు. రీసెంట్ గా ఆయన ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
Also Read:టాలీవుడ్ లో యూనిటీ లేదు.. వైరల్ అవుతోన్న నాని వ్యాఖ్యలు
Also Read:యూవీ క్రియేషన్స్ లో నవీన్ పోలిశెట్టి.. అనుష్కకు జంటగా..
Also Read: 'మా రెండు కుటుంబాల మధ్య 35 ఏళ్ల పోరు..' మెగా,నందమూరి ఫ్యామిలీలపై ఎన్టీఆర్ కామెంట్స్..
Also Read:సల్మాన్ కి 'నాటు' స్టెప్స్ నేర్పించిన ఎన్టీఆర్, చరణ్..
Also Read: సన్నీకి మాధవీలత వార్నింగ్.. అతడు కనిపిస్తే చెంప పగలగొడతా అంటూ ఫైర్..
Also Read:అవమానకర రీతిలో డాన్స్.. సన్నీలియోన్ ను ఇండియా నుంచి తరిమేయమంటూ ఫైర్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి