By: ABP Desam | Updated at : 25 Dec 2021 02:47 PM (IST)
సన్నీలియోన్ ను ఇండియా నుంచి తరిమేయమంటూ ఫైర్..
ఒక్కోసారి సినిమాలో కొన్ని సంఘటనలు, పాటలు ప్రేక్షకుల మనోభావాలను కించపరిచే విధంగా ఉంటాయి. దీంతో నెటిజన్లు ఓ రేంజ్ లో ఏకిపారేస్తుంటారు. ఇలా వివాదాల మధ్య చిక్కుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. తమ సంస్కృతి, మనోభావాలు, ప్రతిష్ట దెబ్బతీసేలా సినిమాలో సాంగ్స్, సీన్స్ ఉన్నాయంటూ విరుచుకుపడిన వారు కూడా ఉన్నారు. తాజాగా బాలీవుడ్ నటి సన్నీలియోన్ నటించిన 'మధుబన్ మే రాధిక నాచే ' వీడియో ఆల్బమ్ విడుదలైంది.
ఇందులో సన్నీలియోన్ తన హాట్ పెర్ఫార్మన్స్ తో రచ్చ చేసింది. ఇప్పుడు ఆ అదే పాట ఆమెపై వ్యతిరేకతను తీసుకొచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని పవిత్ర స్థలాల్లో ఒకటైన 'మధుర'కు చెందిన పూజారులు ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వీడియో ఆల్బమ్ ను నిషేధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ పాటలో సన్నీలియోన్ చేసిన డాన్స్ తమ మతపరమైన మనోభావాలను కించపరిచేలా ఉందని ఆరోపించారు.
సన్నీలియోన్ పై ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆల్బమ్ ను నిషేధించకపోతే కోర్టుని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. సన్నీలియోన్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని.. లేదంటే ఇండియా నుంచి ఆమెని తరిమేయాలంటూ బృందావన్‌కు చెందిన సంత్ నావల్ గిరి మహారాజు అన్నారు. అలాగే అఖిల భారతీయ తీర్థ పురోహిత్ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేష్ పాఠక్ కూడా ఈ పాటలో సన్నీ పెర్ఫార్మన్స్ ను తప్పుబట్టారు.
అవమానకర రీతిలో డాన్స్ చేయడం ద్వారా బ్రిజ్‌భూమి ప్రతిష్టను దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాట రాధాకృష్ణల మధ్య ఉన్న ప్రేమను తెలియజేసేలా ఉంటుంది. అయితే సన్నీలియోన్ తన డాన్స్ స్టెప్పులతో హిందువుల మనోభావాలను కించపరిచిందంటూ నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ఈ పాటను కనికా కపూర్, అరిందమ్ చక్రవర్తి ఆలపించగా.. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించారు. షరీబ్ తోషి ఈ పాటను స్వరపరిచారు.
Also Read:పవన్ కి సపోర్ట్ చేసి ఉంటే.. పరిస్థితి ఇలా ఉండేదా..?
Also Read:'ఆర్ఆర్ఆర్'కి పెద్ద దెబ్బే.. కలెక్షన్స్ పై ఎఫెక్ట్ తప్పదు..
Also Read:స్టార్ కమెడియన్ కి ఒమిక్రాన్..? హాస్పిటల్ లో ట్రీట్మెంట్..
Also Read:హీరోయిన్ తో ఆమిర్ ఖాన్ సీక్రెట్ మ్యారేజ్.. అసలు నిజమిదే..
Also Read: పవన్ కల్యాణ్ వెనుక వరుణ్ తేజ్... 'గని' రిలీజ్ డేట్ ఫిక్స్!
Also Read: తొడ కొట్టిన బాలయ్య... తగ్గేదే లే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
10th Class Diaries Movie Review - 'టెన్త్ క్లాస్ డైరీస్' రివ్యూ: స్కూల్ డేస్ లవ్వే కాదు, అంతకు మించి - శ్రీరామ్, అవికా గోర్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
Anya’s Tutorial Web Series Review - 'అన్యాస్ ట్యుటోరియల్' రివ్యూ: రెజీనా, నివేదితా సతీష్ భయపెట్టారా? లేదా?
Pakka Commercial Movie Review - 'పక్కా కమర్షియల్' రివ్యూ: గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి తెరకెక్కించిన సినిమా ఎలా ఉందంటే?
Movie Tickets Issue: ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ సర్కారుకు చుక్కెదురు!
Karthika Deepam జులై 1 ఎపిసోడ్: హిమని అపార్థం చేసుకుని మోనితతో పోల్చిన శౌర్య, మనసు మార్చుకోని డాక్టర్ సాబ్
Swallowing Mucus: కఫాన్ని మింగేస్తే ఏం జరుగుతుంది? శ్లేష్మం ఎందుకు ఏర్పడుతుంది?
Nupur Sharma Case: నుపుర్ శర్మపై సుప్రీం కోర్టు ఫైర్- 'దేశానికి ఆమె క్షమాపణలు చెప్పాల్సిందే'
Rocketry Movie Review - 'రాకెట్రీ' రివ్యూ: ఫస్టాఫ్‌లో సైన్స్ పాఠాలు, సెకండాఫ్‌లో భావోద్వేగాలు - నంబి నారాయణన్ బయోపిక్ ఎలా ఉందంటే?
Indian Railways: సింగిల్ ఛాయ్‌కు రూ.70 వసూలు చేసిన రైల్వేశాఖ- ఎందుకో తెలుసా?