Ticket Prices Issue: పవన్ కి సపోర్ట్ చేసి ఉంటే.. పరిస్థితి ఇలా ఉండేదా..?
ఇండస్ట్రీలో ఒకడిగా పవన్ కళ్యాణ్ టికెట్ రేట్ ఇష్యూ గురించి మాట్లాడితే ఎవరూ సపోర్ట్ చేయలేదు.
సెప్టెంబర్ నెలలో జరిగిన సాయి ధరమ్ తేజ్ 'రిపబ్లిక్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన గెస్ట్ గా వచ్చినప్పుడే కచ్చితంగా పొలిటికల్ కామెంట్స్ చేస్తారని అందరూ భావించారు. ఎందుకంటే అప్పటికే ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్ ఇష్యూ నడుస్తోంది. అలానే బెనిఫిట్, ప్రీమియర్ షోల పర్మిషన్స్ గురించి కూడా రచ్చ జరుగుతోంది. స్టేజ్ పైకెక్కి స్పీచ్ మొదలుపెట్టిన పవన్ టికెట్ రేట్ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
జగన్ ప్రభుత్వంతో పాటు సినీ పెద్దలకు కూడా ప్రశ్నించారాయన. వెంటనే ఈ విషయంలో ఇండస్ట్రీ ఒక్కటవ్వాలని చెప్పారు పవన్ కళ్యాణ్. ఈ స్పీచ్ తోనైనా.. ఇండస్ట్రీ పెద్దలు బయటకొచ్చి మాట్లాడతారని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. పైగా.. పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని.. వాటితో ఇండస్ట్రీకి సంబంధం లేదని అన్నారు. ఏపీ ప్రభుత్వ మంత్రులను కలుసుకొని.. వాళ్లతో సంధి కుదుర్చుకునే ప్రయత్నం చేశారే తప్ప.. ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో ఊహించలేకపోయారు.
ఇప్పుడు పరిస్థితిని చూస్తుంటే.. ఒక్క ఏపీలో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో సినిమాలకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఓవర్సీస్ కూడా భారీ వసూళ్లు రాబడుతున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఐదు రూపాయలకు, పది రూపాయలకు సినిమా టికెట్లను అమ్ముతోంది. ఇప్పటికీ కూడా ఈ వ్యవహారంపై ఎవరూ సీరియస్ గా మాట్లాడడం లేదు. ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్లను ట్రోల్ చేస్తున్నారు.
ఇండస్ట్రీలో ఒకడిగా పవన్ కళ్యాణ్ ఆరోజు ఈ ఇష్యూ గురించి మాట్లాడితే ఎవరూ సపోర్ట్ చేయలేదు. ఇప్పుడేమో తమ సినిమాలకు కలెక్షన్స్ లేవని బాధపడుతున్నారు. ఆరోజే పవన్ కి సపోర్ట్ గా నిలిచి.. ఇండస్ట్రీ అంతా ఒకటిగా ఉంటే ఈరోజు ఈ సమస్య వచ్చేదా..? అంటూ పవన్ ఫాలోవర్స్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా.. ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దలు ఏపీ ప్రభుత్వాన్ని నిలదీస్తారో లేదో చూడాలి!
Also Read:'ఆర్ఆర్ఆర్'కి పెద్ద దెబ్బే.. కలెక్షన్స్ పై ఎఫెక్ట్ తప్పదు..
Also Read:స్టార్ కమెడియన్ కి ఒమిక్రాన్..? హాస్పిటల్ లో ట్రీట్మెంట్..
Also Read:హీరోయిన్ తో ఆమిర్ ఖాన్ సీక్రెట్ మ్యారేజ్.. అసలు నిజమిదే..
Also Read: పవన్ కల్యాణ్ వెనుక వరుణ్ తేజ్... 'గని' రిలీజ్ డేట్ ఫిక్స్!
Also Read: తొడ కొట్టిన బాలయ్య... తగ్గేదే లే!
Also Read: భీమ్లా నాయక్... పవన్ కల్యాణ్ కోసం త్రివిక్రమ్ స్పెషల్ క్లైమాక్స్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి