అన్వేషించండి
Advertisement
NBK Unstoppable: తొడ కొట్టిన బాలయ్య... తగ్గేదే లే!
బాలకృష్ణ తొడ కొట్టారు. సినిమాలో కాదు.... షోలో! 'అన్ స్టాపబుల్' షోలో! 'పుష్ప' టీమ్ అతిథులుగా వచ్చిన ఎపిసోడ్ లో 'తగ్గేదే లే' అంటూ ఆయన సందడి చేశారు.
నట సింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్ స్టాపబుల్'. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆయనకు జోడీగా 'పుష్ప: ద రైజ్'లో కథానాయికగా నటించిన రష్మికా మందన్నా, దర్శకుడు సుకుమార్ ఈ షోలో సందడి చేయనున్నారు. 'పుష్ప' టీమ్ అతిథులుగా వచ్చిన ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలో ఆహా ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్‌గా దీని ప్రోమో రిలీజ్ చేశారు. బన్నీతో పాటు బాలకృష్ణ కూడా 'పుష్ప' డైలాగ్ చెప్పడం అందులో హైలైట్. తొడ కొట్టడం స్పెషల్ మూమెంట్.
'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా... ఫైర్! తగ్గేదే లే' అని 'పుష్ప'లో డైలాగ్‌ను అల్లు అర్జున్‌తో పాటు బాలకృష్ణ కూడా చెప్పారు. తగ్గేదే లే అన్నప్పుడు అల్లు అర్జున్ ఓ చేత్తో మరో చేయి భుజం మీద కొడితే... బాలకృష్ణ తొడ కొట్టారు. సినిమాల్లో బాలకృష్ణ తొడ కొట్టడం ప్రేక్షకులు చూశారు. సినిమా ఫంక్షన్స్‌లోనూ తొడ కొట్టారు. షోలో కొట్టడం స్పెషల్ మూమెంట్. అది అభిమానులకు నచ్చింది.
తొలుత క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న అల్లు అర్జున అండ్ 'పుష్ప' టీమ్ స్పెషల్ ఎపిసోడ్ విడుదల చేస్తామని 'ఆహా' ఓటీటీ తెలిపింది. అయితే... అనుకున్న సమయానికి విడుదల చేయలేదు. దాంతో నెటిజన్స్ 'ఆహా'ను ఓ ఆట ఆడుకున్నారు. కనీసం ప్రోమో రిలీజ్ చేయనప్పుడైనా అర్ధం చేసుకోవాల్సిందంటూ కామెంట్స్ చేశారు. ఒక్కసారైనా చెప్పిన టైంకి రిలీజ్ చేశారా అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. రిలీజ్ చేసే ఆలోచన లేనప్పుడు హాడావిడి ఎందుకు చేశారంటూ 'ఆహా'ని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. 'పుష్ప' టీమ్ కోసం మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేనితో షూట్ చేసిన ఎపిసోడ్‌ను వెనక్కి నెట్టారు.#UnstoppableMeetsThaggedheLe 🤘🤙
— ahavideoIN (@ahavideoIN) December 24, 2021
Team #PushpaTheRise joins #NandamuriBalakrishna on #UnstoppableWithNBK 😍
MASSive Episode Premieres soon on @ahavideoIN.
@alluarjun @aryasukku @iamRashmika pic.twitter.com/O71Y5o0ol9
Also Read: భీమ్లా నాయక్... పవన్ కల్యాణ్ కోసం త్రివిక్రమ్ స్పెషల్ క్లైమాక్స్!
Also Read: '83' మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
Also Read: తల్లిదండ్రులకు ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టిస్తున్న 'చమ్మక్' చంద్ర...
Also Read: 'శ్యామ్ సింగ రాయ్' రివ్యూ: తిరగబడిన సంగ్రామమా? ఎగసిపడిన అలజడా?
Also Read: ఇక తెలుగులో 24 గంటల బిగ్‌బాస్.. నాన్‌స్టాప్ బాదుడే!
Also Read: 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు' రివ్యూ: సినిమా ఎలా ఉంది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also Read: '83' మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
Also Read: తల్లిదండ్రులకు ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టిస్తున్న 'చమ్మక్' చంద్ర...
Also Read: 'శ్యామ్ సింగ రాయ్' రివ్యూ: తిరగబడిన సంగ్రామమా? ఎగసిపడిన అలజడా?
Also Read: ఇక తెలుగులో 24 గంటల బిగ్‌బాస్.. నాన్‌స్టాప్ బాదుడే!
Also Read: 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు' రివ్యూ: సినిమా ఎలా ఉంది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తిరుపతి
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion