Chammak Chandra: తల్లిదండ్రులకు ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టిస్తున్న 'చమ్మక్' చంద్ర...
తల్లిదండ్రులు అంటే తనకు ఎంత గౌరవం అనేది 'చమ్మక్' చంద్ర మాటల్లో కాదు... చేతల్లో చూపిస్తున్నారు. ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టిస్తున్నారు.
ఉరుకుల పరుగుల జీవితం... ప్రేమ లేదని... జీవిత భాగస్వామికి ఇష్టం లేదని... ప్రస్తుత సమాజంలో కొంత మంది తల్లిదండ్రులను సరిగా చూడటం లేదు. ఓల్డ్ ఏజ్ హోమ్స్‌కు పంపిస్తున్నారు. కొంత మంది సంతోషంగా చూసుకుంటున్నారు. 'జబర్దస్త్' షోతో పేరు, పాపులారిటీ సంపాదించుకుని... ఆ తర్వాత బుల్లితెరపై తనకు అంటూ ఓ పేరు తెచ్చుకున్న 'చమ్మక్' చంద్ర అయితే తల్లిదండ్రుల కోసం ఏకంగా ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టిస్తున్నారు.
"చంద్ర అంటే మోస్ట్ రెస్పాన్సిబుల్ సన్ (బాధ్యత గల కుమారుడు). తాను బావుంటే చాలని, తల్లిదండ్రులు ఎలా ఉన్నా పర్వాలేదని అనుకునే కొడుకులు ఉన్న ఈ రోజుల్లో... 'నేను బావున్నాను. మా అమ్మానాన్న నా కన్నా బావుండాలని ఒక మంచి ఇల్లు కట్టించాడు" అని నటుడు, నిర్మాత నాగబాబు తెలిపారు. కొత్త ఏడాది సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు 'జీ తెలుగు' ఛానల్‌లో ప్రసారం కానున్న ప్రత్యేక కార్యక్రమం 'దావత్'లో ఆయన ఈ సంగతి చెప్పారు.
Also Read: 'శ్యామ్ సింగ రాయ్' రివ్యూ: తిరగబడిన సంగ్రామమా? ఎగసిపడిన అలజడా?
"అమ్మానాన్న పోయిన తర్వాత నా దగ్గర వంద కోట్లు ఉన్నా... నాకు ఆనందం ఉండదు. ఉన్నన్ని రోజులూ నేను కట్టించే ఇల్లులో నాలుగు రోజులు ఉన్నా... దాని కంటే నాకు ఏ ఆస్తి అవసరం లేదు" అని 'చమ్మక్' చంద్ర ఎమోషనల్ అయ్యారు. ఆయన తండ్రి అయితే కన్నీళ్లు పెట్టుకున్నారు. అమ్మకి, నాన్నకి ఇంత కంటే గొప్ప గిఫ్ట్ ఎవరూ ఇవ్వలేరని నాగబాబు వ్యాఖ్యానించారు. అదీ సంగతి! 'జబర్దస్త్' నుంచి బయటకు వచ్చిన తర్వాత 'జీ తెలుగు'లో 'అదిరింది' షోకి చంద్ర వచ్చారు. ఆ తర్వాత 'స్టార్ మా'లో 'కామెడీ స్టార్స్'లో కూడా చేశారు. ఇప్పుడు పలు ఛానళ్లలో ఈవెంట్లు, వగైరా వగైరా చేస్తున్నారు.
Biggest DAAWATH of 2021 - New Year Special Event Promo:
Also Read: దీప్తి -షన్ను బ్రేకప్? సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో అయిన లవ్‌బర్డ్స్... బిగ్‌బాస్ విడదీశాడుగా?
Also Read: సొరంగంలో మాయమైన రైలు.. ఈ రియల్ మిస్టరీని ‘రాధేశ్యామ్’ ఛేదిస్తాడా? ఆ రైలు ఏమైంది?
Also Read: ఏపీలో సినిమా థియేటర్లపై కొనసాగుతున్న దాడులు.. నేడు కర్నూలు, ప.గో జిల్లాలో సినిమా హాళ్ల సీజ్ !
Also Read: టాలీవుడ్‌పై తెలంగాణ సర్కార్ చల్లని చూపు... టిక్కెట్ రేట్లు పెంచుతూ ఉత్తర్వులు !
Also Read: ‘మీ విలాసాలు తగ్గించుకోండి’ ఏపీ మంత్రులకు గట్టిగా ఇచ్చిపడేసిన హీరో సిద్ధార్ధ