News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Deepthi-Shannu Breakup: దీప్తి -షన్ను బ్రేకప్? సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో అయిన లవ్‌బర్డ్స్... బిగ్‌బాస్ విడదీశాడుగా?

దీప్తి సునయన, షణ్ముక్ జశ్వంత్‌ల ప్రేమలో బిగ్‌బాస్ నిప్పులు పోశాడు.

FOLLOW US: 
Share:

దీప్తి సునయన - షణ్ముక్ జశ్వంత్ పాపులర్ యూట్యూబర్లు.  ఆ పాపులారిటీతోనే ఇద్దరూ బిగ్‌బాస్ హౌస్లోకి వెళ్లారు. దీప్తి సునయన బిగ్‌బాస్ 2లో ఎంట్రీ ఇచ్చింది. షన్ను కూడా ఆ తరువాత మూడు లేదా నాలుగో సీజన్లలో ఎంట్రీ ఇస్తాడనుకున్నారు. కానీ సీజన్ 5లో అడుగుపెట్టాడు. బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి... యాక్సిడెంట్ చేయడం వల్ల వచ్చిన నెగిటివిటీని పోగొట్టుకుంటానని చెప్పాడు. కానీ మరింత నెగిటివిటీని మూటగట్టుకుని రావడమే కాదు, దీప్తి ప్రేమని కూడా కోల్పోయే పరిస్థితికి చేరుకున్నాడు. ఇప్పుడు వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని టాక్. దానికి సాక్ష్యంగా వారిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో అయ్యారు. దీప్తి ఇన్‌స్టా ఖాతాను షన్ను అన్‌ఫాలో అవ్వగా, షన్ను ఖాతాను దీప్తి అన్‌ఫాలో అయ్యింది. అంతేకాదు వారిద్దరూ ఒక పరస్పర అంగీకారంతోనే బ్రేకప్ చెప్పుకున్నారని సమాచారం. అంతా సజావుగా ఉంటే వచ్చే రెండు మూడేళ్లలో పెళ్లీపీటలు ఎక్కాల్సిన జంట ఇది.  

అయిదేళ్ల ప్రేమకు గండికొట్టిన బిగ్‌బాస్
షన్ను-దీప్తిల ప్రేమ అయిదేళ్ల నాటిది. వాకి ఇంట్లో వారికి కూడా తెలుసు. ఇద్దరూ కలిసి రియల్ లవర్స్‌లా రియాల్టీషోలో కూడా పాల్గొన్నారు. ఇద్దరూ కలిసి ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.  అంతేకాదు షన్ను పుట్టిన రోజున ‘ఐ లవ్ యూ షన్ను’అంటూ వీడియో సందేశం కూడా పంపింది దీప్తి. వారి ప్రేమ ఇంత పబ్లిక్‌గా మారిపోయింది. బిగ్‌బాస్ వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టినట్టు కనిపిస్తోంది. సిరి, షన్నుల హగ్గులు, ముద్దులు, అలకలు, బుజ్జగింపులతోనే ఎపిసోడ్లకు ఎపిసోడ్లే నడిపేశాడు. దీంతో సిరి-షన్నులు హగ్గుల స్టార్లుగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు ఎప్పుడూ చూసినా ఒకరికొకరు తినిపించుకుంటూ, ఒకే చోట పడుకుంటూ, కూర్చుంటూ చూసేవాళ్లకే చిరాకు తెప్పించారు. ఇక దీప్తికి కోపం రాకుండా ఉంటుందా?

షన్ను... హగ్గుల స్టార్ అంటూ నెట్‌లో మారుమోగిపోయింది అతని పేరు. హౌస్‌లో ఉన్నంత కాలం సిరి కోసమే ఆడడం, ఆమె కోసమే ఆలోచించడం, గాలి కూడా మధ్యలో దూరలేనంతగా హగ్గులతో అతుక్కోవడం, ఆట మీద కన్నా సిరి మీదే ఆసక్తి చూపించడం... ఇవన్నీ అతడిని టైటిల్‌కు దూరం చేశాయి. ఆ విషయం బయటికి వచ్చాక షన్ను కూడా ఒప్పుకున్నాడు.

దీప్తి పోస్టులే చెబుతున్నాయి...
 ఇక దీప్తి తన ఇన్‌స్టా స్టేటస్‌లో నిగూఢమైన అర్థాలు వచ్చేలా పోస్టులు పెట్టింది. ‘కనీసం నీకు నువ్వయినా సమాధానం చెప్పుకునేలా ఉండు’ అని ఒకసారి స్టేటస్ పెట్టింది. మరోసారి ‘నా చుట్టూ ఉన్న పరిస్థితులూ అనుకూలంగా లేనప్పటికీ నేను నా లైఫ్‌ను ఆస్వాదిస్తున్నా’ అని, ఇంకోసారి ‘ఈ ఏడాది నాకేం బాగోలేదు... అయినా చాలా నేర్చుకున్నాను’ అని పోస్టులు పెట్టింది. ఇవన్నీ షన్నును ఉద్దేశించే అని నెటిజన్లు భావిస్తున్నారు. అది నిజం కూడా కావచ్చు.  

Also Read: ‘మీ విలాసాలు తగ్గించుకోండి’ ఏపీ మంత్రులకు గట్టిగా ఇచ్చిపడేసిన హీరో సిద్ధార్ధ

Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!

Also Read: 'కనీసం నీకు నువ్వైనా సమాధానం చెప్పుకో'.. దీప్తి స్టేటస్ షణ్ముఖ్ ని ఉద్దేశించేనా..?

Also Read: హీరోయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఈ నొప్పిని భరించాల్సిందే.. రష్మిక స్వీట్ వార్నింగ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Published at : 24 Dec 2021 05:10 PM (IST) Tags: Deepthi Sunaina Shanmukh jaswanth Deepthi Shannu Biggboss Shannu దీప్తిసునయన

ఇవి కూడా చూడండి

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Naga panchami November 28th Episode : నన్ను కాటేసి చంపేది నువ్వే.. పంచమికి షాక్ ఇచ్చిన మోక్ష!

Naga panchami November 28th Episode : నన్ను కాటేసి చంపేది నువ్వే.. పంచమికి షాక్ ఇచ్చిన మోక్ష!

Animal: 'యానిమల్'లో మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్ - ఆ మెషీన్ గన్ కాస్ట్ ఎంతో తెలుసా?

Animal: 'యానిమల్'లో మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్ - ఆ మెషీన్ గన్ కాస్ట్ ఎంతో తెలుసా?

Krishna Mukunda Murari promo: కృష్ణని పేరు పెట్టి పిలిచిన మురారి.. గతం గుర్తుకురావడంతో టెన్షన్ పడుతున్న ముకుంద!

Krishna Mukunda Murari promo: కృష్ణని పేరు పెట్టి పిలిచిన మురారి.. గతం గుర్తుకురావడంతో టెన్షన్ పడుతున్న ముకుంద!

Brahmamudi Promo: కావ్య రాజ్ ముందు అడ్డంగా బుక్కైనా రాహుల్.. రేపటి ఎపిసోడ్​లో రుద్రాణికి చుక్కలే!

Brahmamudi Promo: కావ్య రాజ్ ముందు అడ్డంగా బుక్కైనా రాహుల్.. రేపటి ఎపిసోడ్​లో రుద్రాణికి చుక్కలే!

టాప్ స్టోరీస్

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి

IND Vs AUS, Innings Highlights:శతకంతో రుతురాజ్ ఊచకోత , ఆసీస్ పై మరోసారి భారీ స్కోర్

IND Vs AUS, Innings Highlights:శతకంతో  రుతురాజ్ ఊచకోత , ఆసీస్ పై మరోసారి భారీ స్కోర్

Uttarkashi Tunnel Rescue Photos: 17 రోజుల తరువాత టన్నెల్ నుంచి క్షేమంగా బయటపడిన 41 మంది కార్మికులు

Uttarkashi Tunnel Rescue Photos: 17 రోజుల తరువాత టన్నెల్ నుంచి క్షేమంగా బయటపడిన 41 మంది కార్మికులు

Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల

Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల