Hero Siddharth: ‘మీ విలాసాలు తగ్గించుకోండి’ ఏపీ మంత్రులకు గట్టిగా ఇచ్చిపడేసిన హీరో సిద్ధార్ధ

ఏపీలో సినిమా టిక్కెట్ల వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది.

FOLLOW US: 

ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలు భారీగా తగ్గించేసింది ప్రభుత్వం. సినిమాటోగ్రఫీ చట్టంలో చాలా మార్పులు చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేయడం, ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు అమ్మడం, టిక్కెట్ ధరలు భారీగా తగ్గించడం వంటివి చేసింది. ప్రాంతాన్ని బట్టి టిక్కెట్ల ధరలను నిర్ణయించారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో టిక్కెట్ ధర మరీ పది రూపాయలకు అమ్మాల్సి వస్తోంది. దీంతో హీరో నాని ‘శ్యామ్ సింగరాయ్’ మీడియా సమావేశంలో హీరో నాని కొన్ని వ్యాఖ్యలు చేశారు. థియేటర్లు నడపడం కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్ అని కామెంట్ చేశారు. టిక్కెట్ ధరల మరీ ఇంతగా తగ్గించడం ప్రేక్షకులను అవమానించడమేనని అన్నారు. దీనిపై ఏపీ మంత్రులు మండి పడ్డారు. నాని ఎవరో మాకు తెలియదంటూ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. మరో మంత్రి కన్నబాబు ‘సినిమా టిక్కెట్ల ధరలు తగ్గిస్తే ప్రజలను అవమానించడమా? కిరాణా షాపులంటే అంత చులకనా?’ అంటూ మండి పడ్డారు.  ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. 

సిద్ధార్థ కౌంటర్
ఏపీ మంత్రులకు హీరో సిద్ధార్థ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మంత్రులనే నేరుగా టార్గెట్ చేసి పోస్టు పెట్టారు. ‘టిక్కెట్ల ధరలు తగ్గించి ప్రజలకు డిస్కౌంట్లు అందిస్తున్నామని మంత్రులు చెబుతున్నారు. కానీ మేము ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాం కదా... వాటిని కొందరు తమ విలాసాలకు ఖర్చు పెట్టుకుంటున్నారు. మరికొందరు లక్షల కోట్ల రూపాయలు అవినీతి రూపంలో కాజేస్తున్నారు. మీ (మంత్రులు) ఖర్చులు, విలాసాలు తగ్గించుకుని మాకు డిస్కౌంట్స్ ఇవ్వండి’అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను చదివిన వాళ్లంతా... ఏపీ మంత్రులకు కాలడం ఖాయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Also Read: సమంతకు అండగా రంగంలోకి దిగిన ఫ్రెండ్... భావోద్వేగ పోస్టు
Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
Also Read: అది నా ఇష్టం! మీ క్యారెక్ట‌ర్ సంగ‌తేంటి?... సైలెంట్‌గా క్లాస్ పీకిన అన‌సూయ‌!
Also Read: శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు... ఎంత పని చేశావ్ 'బిగ్ బాస్'!
Also Read: కొమురం భీముడో... కొమురం భీముడో... ఎన్టీఆర్ సాంగ్ ప్రోమో వచ్చింది! చూశారా?
Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!

Published at : 24 Dec 2021 03:43 PM (IST) Tags: Movie Tickets AP Ministers Hero Siddhartha హీరో సిద్ధార్థ

సంబంధిత కథనాలు

Kamal Haasan: ‘ఎవరు అడ్డొచ్చినా ఎదుర్కొంటా’ - హిందీ భాషపై కమల్ హాసన్ వ్యాఖ్యలు

Kamal Haasan: ‘ఎవరు అడ్డొచ్చినా ఎదుర్కొంటా’ - హిందీ భాషపై కమల్ హాసన్ వ్యాఖ్యలు

NBK 107 Special Song Update: బాలకృష్ణ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నది 'ఖిలాడి' భామ డింపుల్ కాదు, చంద్రిక రవి

NBK 107 Special Song Update: బాలకృష్ణ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నది 'ఖిలాడి' భామ డింపుల్ కాదు, చంద్రిక రవి

Varun Tej New Movie Update: వరుణ్ తేజ్ సినిమాలో విలన్‌గా - తెలుగు తెరకు తమిళ్ హీరో రీఎంట్రీ

Varun Tej New Movie Update: వరుణ్ తేజ్ సినిమాలో విలన్‌గా - తెలుగు తెరకు తమిళ్ హీరో రీఎంట్రీ

Prabhas Project K Update: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై 

Prabhas Project K Update: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై 

Chethana raj Passed Away: కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి

Chethana raj Passed Away: కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

YSRCP Rajyasabha Candidates : ఇద్దరు రెడ్లు, ఇద్దరు బీసీలు - వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీళ్లే

YSRCP Rajyasabha Candidates :   ఇద్దరు రెడ్లు, ఇద్దరు బీసీలు  - వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీళ్లే

SRH vs MI: సన్‌రైజర్స్‌ ఇయ్యాల గెలిస్తే బతికుంటరు! లేదంటే ఇంటికొస్తరు!

SRH vs MI: సన్‌రైజర్స్‌ ఇయ్యాల గెలిస్తే బతికుంటరు! లేదంటే ఇంటికొస్తరు!

Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయకు ఊరట- వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయకు ఊరట- వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

Nara Lokesh: ఏపీలో ప్రతీ ఇంటా వెంకాయ‌మ్మ మాటే వినిపిస్తోంది : సీఎం జగన్‌కు నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్

Nara Lokesh: ఏపీలో ప్రతీ ఇంటా వెంకాయ‌మ్మ మాటే వినిపిస్తోంది : సీఎం జగన్‌కు నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్