Sreerama Chandra: శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు... ఎంత పని చేశావ్ 'బిగ్ బాస్'!
సింగర్ శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు. 'బిగ్ బాస్' ఎంత పని చేశాడో చూశారా?
సింగర్ శ్రీరామ చంద్ర 'బిగ్ బాస్' నుంచి బయటకు వచ్చాడు. టైటిల్ విన్నర్‌గా నిలుస్తాడని అతడి అభిమానులు ఆశించారు. సాధారణ వీక్షకులు కొందరు విన్నర్ కాకపోయినా రన్నరప్‌గా నిలుస్తాడని అనుకున్నారు. అయితే... అనూహ్యంగా మూడో స్థానంలో శ్రీరామ చంద్ర నిలిచాడు. గతం గతః. ఇప్పుడు అది పక్కన పెడితే... 'బిగ్ బాస్' నుంచి శ్రీరామ చంద్ర బయటకు వచ్చినా, 'బిగ్ బాస్'లో టాస్క్‌లు వల్ల ఏర్పడిన గాయాల నుంచి అతడు బయటకు రాలేదు.
ఇప్పుడు శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే... ప్రేక్షకులు ఎవరికి అయినా కన్నీళ్లు ఆగవు. అంతలా అతడి కాళ్లు మారిపోయాయి. 'బిగ్ బాస్'లో శ్రీరామ చంద్ర ఓ ఐస్ టాస్క్ చేసిన సంగతి తెలిసిందే. అందులో చాలా సేపు ఐస్ మీద నిలబడటం వల్ల అతడి పాదాలు, కాళ్ల మీద ఎఫెక్ట్ చాలా పడింది. ఎంత ఎలా అంటే... రంగు మారిపోయేంతలా! ఆ కాళ్లను చూపించిన శ్రీరామ చంద్ర "ఐయామ్ లివింగ్ ఎవ్రి బిట్ ఆఫ్ ఇట్. (నేను ప్రతిదీ ఎంజాయ్ చేస్తున్నాను. కొత్త స్కిన్... కొత్త జీవితం... మీ ప్రేమ" అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇంకా... ప్రియాతో ఇన్‌స్టా లైవ్‌లో ఆ గాయాలు తగ్గడానికి ఓ నెల పడుతుందని చెప్పారని శ్రీరామ చంద్ర తెలిపారు. "విక్రమ్ గారికి 'ఐ' సినిమాలో స్కిన్ మీద బబుల్స్ వచ్చినట్టు... ఐస్ టాస్క్ తర్వాత తన కాళ్ళ మీద బబుల్స్ వచ్చాయి" అని అతడు పేర్కొన్నారు.
View this post on Instagram
Also Read: కొమురం భీముడో... కొమురం భీముడో... ఎన్టీఆర్ సాంగ్ ప్రోమో వచ్చింది! చూశారా?
Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!
Also Read: సంక్రాంతి కూడా అక్కడే ప్లాన్ చేసిన మహేష్ బాబు...
Also Read: 'ఢీ' నుంచి దర్శకేంద్రుడి దగ్గరకు... దీపికా పిల్లి గ్రాఫ్ ఓ రేంజ్‌లో ఉంది మరి!
Also Read: 'భీమ్లా నాయక్' బ్యూటీకి మరో క్రేజీ సినిమాలో ఛాన్స్!
Also Read: 'కనీసం నీకు నువ్వైనా సమాధానం చెప్పుకో'.. దీప్తి స్టేటస్ షణ్ముఖ్ ని ఉద్దేశించేనా..?
Also Read: 'విక్రమార్కుడు' సినిమాకి సీక్వెల్.. కానీ మేటర్ ఏంటంటే..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి