Vijayendra Prasad: 'విక్రమార్కుడు' సినిమాకి సీక్వెల్.. కానీ మేటర్ ఏంటంటే..?
'విక్రమార్కుడు' సినిమాకి సీక్వెల్ రాబోతుంది. అయితే అది తెలుగులో మాత్రం కాదట.
![Vijayendra Prasad: 'విక్రమార్కుడు' సినిమాకి సీక్వెల్.. కానీ మేటర్ ఏంటంటే..? KV Vijayendra Prasad confirms he is working on the script of Akshay Kumar's Rowdy Rathore 2 Vijayendra Prasad: 'విక్రమార్కుడు' సినిమాకి సీక్వెల్.. కానీ మేటర్ ఏంటంటే..?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/22/edeb132787e697872abaa4bceb1fc51d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 'విక్రమార్కుడు'. తెలుగులో ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో ఈ సినిమాను బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా 'రౌడీ రాథోడ్' పేరుతో రీమేక్ చేశారు. హిందీలో ప్రభుదేవా ఈ రీమేక్ ను డైరెక్ట్ చేయగా.. సంజయ్ లీలా భన్సాలీ నిర్మాతగా వ్యవహరించారు. అక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది.
'విక్రమార్కుడు' సినిమాకి స్టోరీ అందించిన.. విజయేంద్రప్రసాద్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. సీక్వెల్ కి స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నానని ఆయన స్వయంగా వెల్లడించారు. కానీ అది తెలుగు సీక్వెల్ కాదట. బాలీవుడ్ లో 'రౌడీ రాథోడ్'కి కొనసాగింపుగా సీక్వెల్ రాబోతుంది. దీనికోసం కథ రాయమని సంజయ్ లీలా భన్సాలీ.. విజయేంద్రప్రసాద్ ను సంప్రదించారట. దానికి ఆయన ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఇందులో అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా పాత్రలను కంటిన్యూ చేస్తున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరి తెలుగులో కూడా సీక్వెల్ కి ప్లాన్ చేస్తారేమో చూడాలి. అదే జరిగితే మరో ఇండస్ట్రీ హిట్ పడడం ఖాయం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజమౌళి 'విక్రమార్కుడు' సీక్వెల్ చేసే ఛాన్స్ లేదనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేసిన 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram
Also Read: నాగార్జున వస్తే.. పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా..?
Also Read: 'ఆర్ఆర్ఆర్' ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్ట్ లుగా చిరంజీవి, బాలకృష్ణ..?
Also Read:సూపర్ స్టార్ రజినీకాంత్.. నానికి ఛాన్స్ ఇస్తారా..?
Also Read:శంకర్-చరణ్ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. అదే ఫార్ములా..
Also Read:సముద్రఖని డైరెక్షన్.. త్రివిక్రమ్ ప్రొడక్షన్.. హీరోగా పవన్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)