అన్వేషించండి
Podharillu Serial Today March 16th: మహా,చక్రి లాయర్‌ను ఎందుకు కలిశారు..? మహాకు నిహారిక ఇచ్చిన సలహా ఏంటి..?
Podharillu Serial Today March 16th: మహా,చక్రి లాయర్‌ను ఎందుకు కలిశారు..? మహాకు నిహారిక ఇచ్చిన సలహా ఏంటి..?

పొదరిల్లు సీరియల్
Source : Jio Hotstar/ Star Maa
Podharillu Serial Today Episode: మహా వాళ్ల వదిన నిహారిక ఫోన్ చేయడంతో మహా ఆమెను రెస్టారెంట్‌లో కలిసింది. మీ అమ్మానాన్న అలా ప్రవర్తిస్తారని నేను ఊహించలేకపోయానని నిహారిక మహాకు సారీ చెబుతుంది. ఇప్పుడు నీ సంగతి ఏంటని అడుగుతుంది. ఆ ఇంట్లో నువ్వు బాగానే ఉంటున్నావు కదా అని అంటే...మన ఇంట్లోకన్నా చాలా బాగా ఉంటున్నాను అని చెబుతుంది. మరి చక్రి సంగతి ఏంటని అడగ్గా... మాకు జరిగింది ఉత్తుత్తి పెళ్లి మాత్రమేనని మహా చెబుతుంది.
పోలీసుస్టేషన్‌లో పెళ్లి జరిగిన తర్వాత ఎవరిదారిన వాళ్లు పోదాం అనుకున్నామని....కానీ వాళ్లు చట్టప్రకారం రిజిస్టర్ చేస్తారని ఊహించలేదని అంటుంది. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావ్ అని అడగ్గా...నేను ఉద్యోగం చూసుకుని వెళ్లిపోతానని మహా చెబుతుంది. దీంతో నిహారిక ఆమెకు గట్టింగా వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నావో నీకు తెలియడం లేదని అంటుంది. మీరు ఉత్తిత్తి పెళ్లి అనుకుంటే సరిపోదని....చట్టప్రకారం మీకు నిజంగానే పెళ్లి అయ్యిందని హెచ్చిరిస్తుంది. భవిష్యత్‌లో చక్రి అడ్డం తిరగడని ఎందుకు అని గ్యారెంటీ ఏంటని అంటుంది. చక్రి చాలా మంచివాడని అలా చేయడని అంటే....నీకు అందం ఉంది, డబ్బు ఉంది. మంచి భవిష్యత్ రాబోతుందని నిహారిక గుర్తు చేస్తుంది.ఇవన్నీ ఉన్న అమ్మాయిని ఎవరైనా ఎందుకు వదులుకుంటారని చెప్పి... వెంటనే విడాకులు తీసుకోమని సలహా ఇచ్చి వెళ్లిపోతుంది.
నిహారిక చెప్పిన మాటలు మహాపై చాలా బలంగా పనిచేస్తాయి. వదిన చెప్పినట్లు మున్ముందు చక్రి అడ్డం తిరిగి విడాకులు ఇవ్వనంటే పరిస్థితి ఏంటని భయపడుతుంది. చక్రి విడాకులు ఇవ్వనన్నట్లు కలగంటుంది. దీంతో మహా భయం మరింత రెట్టింపవుతుంది. మహా, నిహారికను కలవడం చూసిన చక్రి...వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకుని ఉంటారని ఆలోచిస్తూ నిద్రపోకుండా ఉంటాడు. అప్పుడే తన గదిలో నుంచి బయటకు వచ్చిన మాహ...చక్రిని బయటకు వెళ్దామని చెప్పడంతో ఎగిరిగంతులేస్తూ ఆమెను బయటకు తీసుకెళ్తాడు. జరిగిందేదో జరిగిపోయింది...కలిసి ఉండమని వాళ్ల వదిన చెప్పి ఉంటుందని చక్రి సంబరపడిపోతుంటాడు. అప్పుడే మహా చక్రి గుండెల్లో బాంబు పేల్చుతుంది.మనకు జరిగిన పెళ్లి ఇద్దరికీ ఇష్టం లేకుండా జరిగింది కాబట్టి మనం విడాకులు తీసుకుని ఎవరి భవిష్యత్ వాళ్లు చూసుకుందామని అంటుంది. ఇప్పుడు విడాకులు తీసుకోకుండా కూడా ఎవరి పని వాళ్లు చేసుకోవచ్చు కదా అని చక్రి అంటాడు.అలా వద్దని నాకు చాలా ఇబ్బందిగా ఉందని...మున్ముందు మరిన్ని ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మనం విడాకులు తీసుకుందామని మహా చెబుతుంది. దీంతో చేసేదేమీ లేక చక్రి సరేనంటాడు. రేపు ఉదయమే లాయర్‌ను కలిసి మాట్లాడదామని మహా చెబుతుంది.
ఉదయమే లాయర్‌ను కలవడానికి మహా సిద్ధమవ్వగా...అక్కడికి వెళ్లడం తప్పించుకోవడం కోసం చక్రి ఎత్తులపై ఎత్తులు వేస్తుంటాడు. అన్నీ మీరు అనుకున్నట్లు చేయడమేకానీ...అసలు నా గురించి నా ఇష్టాఇష్టాల గురించి పట్టించుకోరా అని చక్రి అంటాడు. ఇందులో నీ ఇష్టం ఏముందని...మనం ఇష్టపడి పెళ్లిచేసుకోలేదుకదా అని అంటుంది. మరి విడాకులు ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారని చెప్పగా....సరే త్వరలోనే లాయర్‌ను వెతుకుదామని చక్రి అంటాడు. ఒక 4,5 వారాల్లో మంచి లాయర్‌ను చూస్తానని చెబుతాడు.
అవసరం లేదని నేను ఆల్రెడీ ఆన్‌లైన్‌లో వెతికి ఓ మంచి లాయర్‌ను చూశానని ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామని చెబుతుంది. దీంతో చేసేదిలేక మహాతోపాటు చక్రి కూడా లాయర్‌ను కలవడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా ఈ విడాకులు కేసు ఎలాగైనా చెడగొట్టాలన్నట్లు చక్రి ఆలోచిస్తుంటాడు. లాయర్ వేరే వాళ్లతో మాట్లాడుతున్నారని కొంచెం వెయిట్ చేయమని అసిస్టెంట్ చెప్పడంతో మహా ఫోన్ మాట్లాడేందుకు బయటకు వెళ్తుంది . ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కించమంటూ చక్రి దేవుడుని కోరుకుంటాడు.
Before You Go
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















