RRR: 'ఆర్ఆర్ఆర్' ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్ట్ లుగా చిరంజీవి, బాలకృష్ణ..?
హైదరాబాద్ లో 'ఆర్ఆర్ఆర్' భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తున్నారు. బాలీవుడ్ లో ఈ సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవలే ముంబైలో గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఏరోజున ఈవెంట్ ను నిర్వహించబోతున్నారనే విషయంలో క్లారిటీ లేనప్పటికీ.. దీనికి అతిథులుగా మాత్రం మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ హాజరు కాబోతున్నారని సమాచారం. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది. ఒకరి సినిమా ఈవెంట్ కి మరో హీరో గెస్ట్ గా రావడం, సినిమా గురించి గొప్పగా మాట్లాడడం ఇలా చాలానే జరుగుతున్నాయి. ఇటీవల 'అఖండ' సినిమా ఈవెంట్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా వెళ్లారు.
ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' ఈవెంట్ కి చిరంజీవి, బాలకృష్ణలను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ రావడం పక్కా అని తెలుస్తోంది.. కానీ బాలయ్య మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. వీరిద్దరూ గనుక ఒకే స్టేజ్ పై కనిపిస్తే ఫ్యాన్స్ హడావిడి మాములుగా ఉండదు. ఒకే వేదికపై మెగా, నందమూరి ఫ్యామిలీ హీరోలను చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది.
ఇక ఈ సినిమాలో అలియా భట్, ఓలివియా మోరిస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌దేవ్‌గణ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని పాటలను విడుదల చేశారు.అందులో 'నాటు నాటు' పాటలో హీరోలు ఇద్దరు వేసిన స్టెప్పులకు సూపర్బ్ రెస్పాన్స్ లభించింది. 'జనని...' సాంగ్ సినిమాలో ఎమోషన్ ఎలివేట్ చేసింది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత.
Also Read:సూపర్ స్టార్ రజినీకాంత్.. నానికి ఛాన్స్ ఇస్తారా..?
Also Read:శంకర్-చరణ్ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. అదే ఫార్ములా..
Also Read:సముద్రఖని డైరెక్షన్.. త్రివిక్రమ్ ప్రొడక్షన్.. హీరోగా పవన్..
Also Read: అర్ధరాత్రి ఆ హీరో ఇంటి దగ్గర కెమెరా కంటికి చిక్కిన హీరోయిన్
Also Read: వసుధారని ఇంట్లోంచి పంపించేయాలని జగతికి షాకిచ్చిన రిషి.. గుప్పెడంత మనసు డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి