By: ABP Desam | Updated at : 22 Dec 2021 10:56 AM (IST)
కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా
కియారా అడ్వాణీ ప్రేమలో ఉన్నారా? 'ఉన్నాను' అని ఆమె ఎప్పుడూ, ఎక్కడా ఓపెన్‌గా చెప్పింది లేదు. కానీ, ఆమె ప్రేమలో ఉన్నారని హిందీ సినిమా ఇండస్ట్రీ, మీడియా అంటోంది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా అడ్వాణీ ప్రేమలో ఉన్నారని బీ-టౌన్ ఖబర్. వీళ్లిద్దరూ 'షేర్ షా' సినిమాలో జంటగా నటించారు. ఇద్దరికీ అదే తొలి సినిమా. అందులో వీళ్లిద్దరి కెమిస్ట్రీ హాట్ టాపిక్ అయ్యింది. రియల్ లైఫ్‌లో లవ్‌లో ఉన్నారు కాబట్టే రీల్ లైఫ్‌లో అంత బాగా చేయగలిగారని కొందరు కామెంట్లు చేశారు. అప్పుడూ సిద్ధార్థ్ గానీ, కియారా గానీ పెదవి విప్పలేదు.
రీసెంట్‌గా ముంబైలోని బాంద్రాలో గల పాలీ హిల్స్‌లో... సిద్ధార్థ్ మల్హోత్రా ఇంటి దగ్గర కియారా అడ్వాణీ కెమెరా కంటికి చిక్కారు. క్యాజువల్‌గా కార్ దిగి సిద్ధార్థ్ ఇంటికి నడుచుంటూ వెళ్లారు. కెమెరాలు ఉన్నాయని భయపడుతున్నట్టు లేదు. ఆమెను ముంబై పాపరాజీ ఫొటోలు తీసింది. సిద్ధార్థ్ ఇంటికి కియారా సరదాగా కూడా వెళ్లి ఉండొచ్చని కొందరు అంటున్నారు. అదీ నిజమే కావచ్చు. అయితే... డిన్నర్ టైమ్‌లో వెళ్లడంతో డేట్ నైట్ అయ్యి ఉండొచ్చని కొందరు అంటున్నారు. విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్ పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ తమ ప్రేమ కహానీ గురించి వెల్లడిస్తారని చాలా మంది ఆశిస్తున్నారు.
సినిమాలకు వస్తే... ఇటీవల రష్యాలో హిందీ సినిమా 'జగ్ జగ్ జీయో' షెడ్యూల్ కంప్లీట్ చేసి కియారా ఇండియా వచ్చారు. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ రామ్ చరణ్ స్టార్ట్ అయితే... కియారా కూడా జాయిన్ అవుతారు. 'వినయ విధేయ రామ' తర్వాత మరోసారి చరణ్ సరసన ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: నాగచైతన్య నుంచి 50 కోట్లు తీసుకుందని ఆరోపిస్తే... స్పందించిన సమంత
Also Read: 'పుష్ప' కథ ఎవరిది? సుకుమార్ దా? చిత్తూరు జిల్లా విలేకరి దా?
Also Read: పెళ్లి ఒకడితో... ఫస్ట్ నైట్ ఇంకొకడితో టైప్ నా వల్ల అవ్వట్లేదు! - తమన్
Also Read: బాలకృష్ణ, రవితేజ మధ్య గొడవ ఏంటి? ఇదిగో తెలుసుకోండి!!
Also Read: అనసూయను తీసేయండి... రష్మీని తీసుకు రండి!
Also Read: పవన్ కల్యాణ్... మహేష్ బాబుతో పాటు వాళ్లకూ రాజమౌళి థాంక్స్! ఎందుకంటే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Jacqueline Extortion Case: జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఈడీ షాక్, రూ.200 కోట్ల కేసులో నిందితురాలంటూ షార్జ్‌షీట్!
NBK108: బాలయ్య, అనిల్ రావిపూడి సినిమా బడ్జెట్ - భారీగా ఖర్చు పెడుతున్నారే!
1770 Movie : రాజమౌళి శిష్యుడి పాన్ ఇండియా సినిమా - 'వందేమాతరం' సృష్టికర్త బంకించంద్ర 'ఆనంద్ మఠ్' స్ఫూర్తితో
Karthikeya 2: ‘కార్తికేయ-2’కు ఇస్కాన్ ప్రశంసలు - నిఖిల్ టీమ్‌కు అరుదైన గౌరవం
Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6 కంటెస్టెంట్లు వీళ్లేనట, వాళ్లకు సెకండ్ ఛాన్స్?
BJP : పార్లమెంటరీ బోర్డులోకి లక్ష్మణ్ - గడ్కరీ, చౌహాన్‌లకు నిరాశ ! బీజేపీ కీలక కమిటీల్లో మార్పులు
AP Teachers : "మిలియన్ మార్చ్" నిర్వీర్యం కోసమే టార్గెట్ చేశారా ? ఏపీ టీచర్లు ప్రభుత్వంపై ఎందుకంత ఆగ్రహంగా ఉన్నారు ?
SC on Freebies: ఉచిత హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేం, సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
Chikoti Praveen: నన్ను చంపడానికి సుపారీ, వాళ్ల పేర్లు చెప్పాలని బాగా ఒత్తిడి చేస్తున్నారు - చికోటి సంచలన కామెంట్స్