Anasuya & Rashmi: అనసూయను తీసేయండి... రష్మీని తీసుకు రండి!
ఒక్క వారం కోసం అనసూయ బదులు రష్మీని తీసుకొచ్చారు. ఎందుకు? అనేది పక్కన పెడితే... అనసూయ బదులు రష్మీని తీసుకోవాలనే డిమాండ్ మొదలు అయ్యింది.
'జబర్దస్త్'కు అనసూయ యాంకర్. 'ఎక్స్‌ట్రా జబర్దస్త్'కు రష్మీ గౌతమ్ యాంకర్. మొదట రెండు షోలకు నాగబాబు, రోజా జడ్జ్‌లుగా ఉండేవారు. నాగబాబు వెళ్లిన తర్వాత ఆయన స్థానాన్ని మనోతో భర్తీ చేశారు. టీమ్ లీడర్లలో మార్పులు, చేర్పులు పక్కన పెడితే... యాంకర్లు, జడ్జ్‌లు అలాగే ఉన్నారు. అయితే... ఇప్పుడు యాంకర్ మారింది. అనసూయ బదులు 'జబర్దస్త్'కు రష్మీ గౌతమ్ వచ్చింది.
అవును.. ఈ వారం (డిసెంబర్ 23 ఎపిసోడ్) 'జబర్దస్త్'లో అనసూయ కనిపించరు. ఆమె బదులు రష్మీ గౌతమ్ యాంకరింగ్ చేశారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన ప్రోమోలో రష్మీ తనదైన శైలిలో డాన్స్ చేసి అలరించారు. అయితే... ఒక్క వారమే రష్మీ గౌతమ్ 'జబర్దస్త్' యాంకరింగ్ చేస్తారని ప్రోమోలో స్పష్టం చేశారు. ఏదైనా సినిమా షూటింగ్ కోసం లేదంటే మరో కారణం చేత అనసూయ అందుబాటులో లేకపోవడంతో రష్మీని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
Also Read: రావాలి సుధీర్... కావాలి రష్మీ!
'ఢీ' కొత్త సీజన్ 'ఢీ 14'లో 'సుడిగాలి' సుధీర్, రష్మీని కంటిన్యూ చేయకపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. అనసూయ లేకపోతే కొత్త సందేహాలు వస్తాయని ఒక్క ఎపిసోడ్ కోసం రష్మీ వస్తున్నట్టు చెప్పినట్టు ఉన్నారు. ఇది కొత్త తలనొప్పులు తీసుకు వచ్చింది. 'జబర్దస్త్'కు రష్మీని తీసుకు రమ్మని ఆమె అభిమానులు కొంత మంది యూట్యూబ్, సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. 'అనసూయ కంటే రష్మీ డ్రస్ లు పద్దతిగా ఉన్నాయి' అని ఒకరు కామెంట్ చేస్తే... 'రష్మీని 'జబర్దస్త్' యాంకర్ గా లేదంటే, 'ఢీ'లో పెట్టండి' అని మరో నెటిజన్ కోరారు. 'అనసూయను పర్మినెంట్ గా తీసేయండి' ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఏం అవుతుందో చూడాలి.
Jabardasth Latest Promo - 23rd December 2021:
Also Read: పవన్ కల్యాణ్... మహేష్ బాబుతో పాటు వాళ్లకూ రాజమౌళి థాంక్స్! ఎందుకంటే...
Also Read: అసభ్యకర సందేశాలు.. ఇంటికి వచ్చి మరీ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్..
Also Read: అమ్మో... అప్పుడు చాలా భయపడ్డాను! - సాయి పల్లవి ఇంటర్వ్యూ
Also Read: పవర్ స్టార్ అభిమానులకు నిర్మాత సారీ... పవన్ చెప్పడం వల్లే!
Also Read: బాలయ్య దగ్గరకు అల్లు అర్జున్ వస్తున్నాడు... రవితేజ వెనక్కి వెళ్లాడు!
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన రాధే శ్యామ్ టీమ్... రెబల్ స్టార్ లుక్ రిలీజ్!
Also Read:అప్పుడు అనుష్కతో... ఇప్పుడు సమంతతో
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి