అన్వేషించండి

Rajamouli Thanks Pawan & Mahesh: పవన్ కల్యాణ్... మహేష్ బాబుతో పాటు వాళ్లకూ రాజమౌళి థాంక్స్! ఎందుకంటే...

పవన్ కల్యాణ్, మహేష్ బాబు సహా మరో ఇద్దరికీ రాజమౌళి థాంక్స్ చెప్పారు. ఎందుకు? ఏమిటి? ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే... 

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా సినిమా 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు ఉదయం వరకూ ఆ సినిమా వచ్చిన వారం ఐదు రోజులకు 'భీమ్లా నాయక్' వస్తుందని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు భావించారు. మళ్లీ జనవరి 14న ప్రభాస్ 'రాధే శ్యామ్' ఉంది. మూడు భారీ సినిమాలు సంక్రాంతికి వస్తే... వసూళ్ల పరంగా మూడు సినిమాలకు నష్టమేనని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందారు. ఓ విధంగా నిర్మాతలకూ ఆ టెన్షన్ ఉందనేది ఇండస్ట్రీ టాక్. అయితే... తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ చేసిన ప్రయత్నాలు ఫలించడంతో పవన్ కల్యాణ్ సినిమా వెనక్కి వెళ్లింది. జనవరి 12న విడుదల కావాల్సిన సినిమాను ఫిబ్రవరి 25కు వాయిదా పడింది. 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్' పాన్ ఇండియా సినిమాలు కాబట్టి వాటికి దారిచ్చింది. ఈ సందర్భంగా సినిమాలు వాయిదా వేసుకున్న హీరోలు, నిర్మాతలకు రాజమౌళి థాంక్స్ చెప్పారు.
"సంక్రాంతి బరిలో పోటీ లేకుండా చూడాలని మొదట చొరవ తీసుకున్న వ్యక్తి మహేష్ బాబు. 'సర్కారు వారి పాట' పక్కా పొంగల్ సినిమా అయినప్పటికీ... వేసవికి వాయిదా వేశారు. ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించారు. నా హీరోకి, మైత్రీ మూవీ మేకర్స్ బృందానికి థాంక్స్. 'ఎఫ్ 3' మూవీ వాయిదా వేసిన 'దిల్' రాజు గారికి, చిత్ర బృందానికి థాంక్స్. 'భీమ్లా నాయక్' వాయిదా వేయాలని పవన్ కల్యాణ్ గారు, నిర్మాత చినబాబు (సూర్యదేవర రాధాకృష్ణ) గారు తీసుకున్న నిర్ణయం అభినందనీయం" అని రాజమౌళి ట్వీట్ చేశారు.
'ఆర్ఆర్ఆర్' విడుదలైన వారం రోజుల పాటు థియేటర్ల దగ్గర ఎటువంటి పోటీ లేదు. ఆ తర్వాత 'రాధే శ్యామ్' తప్ప మరో భారీ సినిమా దగ్గరలో లేదు. సో... 'ఆర్ఆర్ఆర్'కు పోటీ లేదు. అందువల్ల, అందరికీ రాజమౌళి థాంక్స్ చెప్పారు. నిజం చెప్పాలంటే... మొదట మహేష్ బాబు 'సర్కారు వారి పాట' కూడా సంక్రాంతి బరిలో ఉంది. 'ఆర్ఆర్ఆర్' విడుదల తేదీ ప్రకటించిన తర్వాత తన సినిమాను మహేష్ వాయిదా వేశారు.

Also Read: అమ్మో... అప్పుడు చాలా భయపడ్డాను! - సాయి పల్లవి ఇంటర్వ్యూ
Also Read: పవర్ స్టార్ అభిమానులకు నిర్మాత సారీ... పవన్ చెప్పడం వల్లే!
Also Read: బాలయ్య దగ్గరకు అల్లు అర్జున్ వస్తున్నాడు... రవితేజ వెనక్కి వెళ్లాడు!
Also Read: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు స‌డ‌న్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన రాధే శ్యామ్ టీమ్‌... రెబల్ స్టార్ లుక్ రిలీజ్!
Also Read: అప్పుడు అనుష్కతో... ఇప్పుడు సమంతతో
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Streamings : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ నాలుగు డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ నాలుగు డోంట్ మిస్
Bigg Boss Season 10 Today Nov 19th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: కష్టపడి ఆడారు.. చివరకు రద్దు చేశారు! డిక్టేటర్స్ మెచ్చిన నలుగురు ఎవరు? అమన్ స్వాప్ ప్లానేనా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: కష్టపడి ఆడారు.. చివరకు రద్దు చేశారు! డిక్టేటర్స్ మెచ్చిన నలుగురు ఎవరు? అమన్ స్వాప్ ప్లానేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహాని ఎత్తుకొని నిప్పుల గుండం తొక్కిన విహారి! అంటించేసిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహాని ఎత్తుకొని నిప్పుల గుండం తొక్కిన విహారి! అంటించేసిన అంబిక!
Horror Thriller OTT : ఆ 'రాత్రి' ఏం జరిగింది? - ఎక్స్‌క్లూజివ్‌గా మరో హారర్ అంథాలజీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆ 'రాత్రి' ఏం జరిగింది? - ఎక్స్‌క్లూజివ్‌గా మరో హారర్ అంథాలజీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget