అమ్మో... అప్పుడు చాలా భయపడ్డాను! - సాయి పల్లవి (Sai Pallavi) ఇంటర్వ్యూ 

'శ్యామ్ సింగ రాయ్'లో సాయి పల్లవి ఓ కథానాయికగా నటించారు. డిసెంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సాయి పల్లవితో ఇంటర్వ్యూ...

FOLLOW US: 

కథానాయికగా సాయి పల్లవి చేసిన సినిమాల సంఖ్య తక్కువే. అయితే... తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నారు. సాయి పల్లవి అంటే స‌మ్‌థింగ్‌ స్పెషల్ ఉంటుందని ఓ అంచనాకు కొంత మంది ప్రేక్షకులు వస్తారు. 'లవ్ స్టోరీ'తో ఈ ఏడాది ఓసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి పల్లవి... 'శ్యామ్ సింగ్ రాయ్'తో మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నారు. 'మిడిల్ క్లాస్ అబ్బాయి' తర్వాత నాని సరసన ఆమె నటించిన చిత్రమిది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మించారు. డిసెంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సాయి పల్లవి మీడియాతో ముచ్చటించారు.
సినిమాలో మీది దేవదాసి పాత్ర. దర్శకుడు కథ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది?
స్క్రిప్ట్ చదివేటప్పుడు మనకు ఐడియా వస్తుంది. 'సినిమా ఇలా ఉంటుంది, ఇలా చేయవచ్చు' అని! చిన్నప్పుడు మనం చరిత్ర గురించి చదువుకుని ఉంటాం. అటువంటి పాత్ర చేసే అవకాశం వచ్చింది. దేవదాసి క్యారెక్టర్ చేయడం కంటే... వాళ్ల సైకాలజీ గురించి చర్చించడం నచ్చింది.
దేవదాసి పాత్ర గురించి మీరు రీసెర్చ్ చేశారా?
దేవదాసి వ్యవస్థ గురించి పాఠశాలలో చదివా. దేవదాసీలు ప్రారంభంలో దేవుడికి సేవకులుగా ఉన్నాయి. తర్వాత తర్వాత దాన్ని మార్చేశారు. సినిమాకు ఎంత కావాలనేది చూసి తీసుకున్నారు. 'శ్యామ్ సింగ రాయ్' పాత్రతో పాటు ఎంత చూపించాలో, అంతే చూపించారు. ఇది దేవదాసి వ్యవస్థపై సినిమా కాదు.
దేవదాసి పాత్ర పరంగా ఏమైనా పరిమితులు పెట్టుకున్నారా?
రిస్ట్రిక్ష‌న్స్ ఏమీ లేవు. స్క్రిప్ట్ చదివే సంతకం పెడతాం కదా... సంతకం చేసిన తర్వాత అలా అంటే బావుండదు.
డాన్స్ మీకు, ఈ సినిమాలో మీ పాత్రకు ప్లస్ అనుకుంటున్నారా?
'లవ్ స్టోరీ'లోనే అనుకుంట... నేను డాన్స్ ఎక్కువ చేసింది!  'శ్యామ్ సింగ రాయ్'లో డాన్స్ ఎంత కావాలో... అంతే పెట్టారు. ఎక్కువ పెట్టలేదు. ఒక్క పాటలోనే కొంచెం ఉంటుంది. నాకు క్లాసికల్ డాన్స్ రాదు. ఇప్పటి వరకు నేర్చుకోలేదు. నేను చేయగలుగుతానని నమ్మి, దర్శకుడు రాహుల్ నమ్మారు. నాతో పాటు పాటలో క్లాసికల్ డాన్స్ చేసిన వారు 10, 20 ఇయర్స్ ఎక్స్‌పీరియ‌న్స్ ఉన్న‌వాళ్లు. ఆ పాటకు డాన్స్ చేసేటప్పుడు చాలా భయపడ్డాను. వాళ్లతో ఒకేలా చేశానని అంటే పెద్ద సక్సెస్ అనుకున్నాను.
'శ్యామ్ సింగ రాయ్' వేడుకలో మీ క్రేజ్ చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు!
అది గ్రాటిట్యూడ్ (కృతజ్ఞత). అది మాత్రమే కాదు... అనురాగ్ కులకర్ణి పాడారు. ఆ తర్వాత డాన్స్ చేశారు. మనం ఒక కళను ఎంజాయ్ చేయడమే పెద్ద ఇది. మనకు ఏమీ రాకున్నా ఎంజాయ్ చేయగలుగుతాం. అదే దేవుడు ఇచ్చిన పెద్ద ఆశీర్వాదం. అవన్నీ చూసి ఎమోషనల్ అయ్యాను. నా బ్రెయిన్ లో నేను మామూలు సాయి పల్లవినే. అయితే... నేను చేసే పని (సినిమాలు) చాలామందికి సంతోషం ఇస్తుందంటే ఎమోషనల్ అయ్యాను. నేను రుణపడ్డాను. నాతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలకు... ప్రేక్షకులు అందరికీ థాంక్స్ చెప్పాలని అనుకున్నాను.
ఈ క‌థ‌తో ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యారా? క్యారెక్ట‌ర్‌కు క‌నెక్ట్ అయ్యారా?
క్యారెక్ట‌ర్‌కు క‌నెక్ట్ అయితేనే స్క్రీన్ మీద యాక్టింగ్ బావుంటుంది. లేదంటే డిఫరెన్స్ తెలుస్తుంది. దేవదాసి కాకుండా సాయి పల్లవి కనపడుతుంది.
నానితో మీకు రెండో సినిమా ఇది. ఆయనతో వర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌
'ఎంసీఏ'లో ఆయనకు, నాకు మధ్య సన్నివేశాలు తక్కువ. సినిమాలో 20, 30 శాతమే ఉంటాయి. లైఫ్ లో నేను ఎలా ఉంటానో... అందులో అలాగే ఉన్నాను. నాని గారు కూడా అంతే!  డిఫ‌రెంట్‌గా ఏమీ ట్రై చేయ‌లేదు. 'శ్యామ్ సింగ రాయ్'లో మా క్యారెక్టర్స్ వేరేలా ఉన్నాయి. లవ్ సీన్స్ డీప్‌గా ఉన్నాయి. అప్పుడూ, ఇప్పుడూ సేమ్ కంఫర్ట్. ఈ క్యారెక్టర్స్ కోసం మా మధ్య ఎక్కువ డిస్కషన్స్ ఉన్నాయి.
మీకు యాక్టింగ్, డాన్స్, మెడిసిన్ అంటే ప్యాషన్ అని తెలుసు. అదే విధంగా ఇంకో అంశం ఏదైనా ఉందా? ఎందులో ప్యాషన్ ఉంది?
నాకు నా గురించి తెలుసుకోవాలని ఉంటుంది. యాక్టింగ్, డాన్స్, మెడిసిన్ కాకుండా మెడిటేషన్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే... నా గురించి, పరిస్థితుల గురించి లోతుగా ఆలోచించాలని అనుకుంటున్నాను. నా గురించి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను.
రాహుల్ డైరెక్షన్ గురించి...
చాలా క్లారిటీతో సినిమా తీశారు. నాని, నేను షూటింగ్ చేసిన ఫస్ట్ సీన్... సినిమాలో మా ఇద్దరి మధ్య లాస్ట్ సీన్. ఎలా చేయాలో మాకు తెలియలేదు. తను చెప్పింది మా ఫాలో అయ్యాం.
సాయి పల్లవి సినిమాలో ఉన్నారంటే... కథ, క్యారెక్టర్ మీద అంచనాలు ఉంటాయ్
(నవ్వుతూ...) నన్ను భయపెడుతున్నారు... ఇలా చెప్పి! సినిమా ఓకే చేసేటప్పుడు... నేను ఎలా ఒక మూవీ ఎంజాయ్ చేస్తానో, అలాగే ఒక మూవీ ఓకే చేస్తాను. మంచి పాత్రలో కనిపిస్తే చూడటానికి నాకు కూడా బావుంటుంది. ఏదైనా సినిమా చేస్తే ఓ ప్రయోజనం ఉండాలి. 'ఎంసీఏ' చేసిన తర్వాత ఆ సినిమా టీమ్ లో కొంత మంది 'పల్లవి అన్ కంఫర్టబుల్ ఫీల్ అయ్యింది' అని చెప్పారు. నేను ఓ క్యారెక్టర్ చేసి చూద్దామని ఆ సినిమా చేశా. 'ఎంసీఏ' షూటింగ్ చేసేటప్పుడే నాకు అర్థం అయ్యింది... నేను కంఫర్టబుల్ కాదని!
మీ నెక్స్ట్ సినిమాలు?
'విరాట పర్వం' వస్తుంది. తమిళంలో ఓ సినిమా చేశా. అది కూడా త్వరలో విడుదల అవుతుంది.

Also Read: పవర్ స్టార్ అభిమానులకు నిర్మాత సారీ... పవన్ చెప్పడం వల్లే!
Also Read: బాలయ్య దగ్గరకు అల్లు అర్జున్ వస్తున్నాడు... రవితేజ వెనక్కి వెళ్లాడు!
Also Read: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు స‌డ‌న్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన రాధే శ్యామ్ టీమ్‌... రెబల్ స్టార్ లుక్ రిలీజ్!
Also Read: అప్పుడు అనుష్కతో... ఇప్పుడు సమంతతో
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 21 Dec 2021 01:32 PM (IST) Tags: Sai Pallavi Shyam Singha Roy సాయి పల్లవి Sai Pallavi Interview Sai Pallavi about Devadasi system

సంబంధిత కథనాలు

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!

Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?

Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!