Samantha: నాగచైతన్య నుంచి 50 కోట్లు తీసుకుందని ఆరోపిస్తే... స్పందించిన సమంత
విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య నుంచి సమంత రూ. 50 కోట్లు తీసుకున్నారా? తీసుకున్నారని ఒకరు ఆరోపించారు. దానిపై సమంత స్పందించారు.
అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులకు కారణం ఏంటనేది ఎవ్వరికీ తెలియదు. తామిద్దరం విడిపోతున్నామని ప్రకటించారు తప్ప... కారణాలు ఏమిటనేది ఇద్దరిలో ఎవ్వరూ చెప్పలేదు. అయితే... విడాకులు తీసుకున్న తర్వాత సమంతపై ఎక్కువ ఆరోపణలు వచ్చాయి. ఆమెకు మరొకరితో సంబంధం ఉందని, అబార్షన్ చేయించుకుందని, అవకాశవాది అని ఏవేవో విమర్శలు వచ్చాయి. అప్పట్లో ఓసారి సమంత స్పందించారు. తర్వాత జాతీయ మీడియాతో మాట్లాడుతూ విడాకుల తర్వాత చనిపోతానని అనుకున్నానని వ్యాఖ్యానించారు. తాజాగా అక్కినేని నాగచైతన్య నుంచి సమంత 50 కోట్లు తీసుకున్నదని ఒకరు ట్వీట్ చేశారు. దీనికి ఆమె రిప్లై ఇచ్చారు.
"విడాకులు తీసుకొని తన జీవితాన్ని పాడుచేసుకున్న ఒక సెకండ్ హ్యాండ్ ఐటమ్... జెంటిల్‌మన్ (అక్కినేని నాగ చైతన్య) నుంచి టాక్స్ కట్టాల్సిన అవసరం లేని డబ్బు రూ. 50 కోట్లు తీసుకుంది" అని కమరాలి దుకందర్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. అతడి ట్వీట్‌కు సమంత రిప్లై ఇచ్చారు. జస్ట్... 'గాడ్ బ్లెస్ యు' అని ఆమె పేర్కొన్నారు.
Kamarali Dukandar God bless your soul . https://t.co/IqA1feO9K1
— Samantha (@Samanthaprabhu2) December 21, 2021
"నాకు తెలుసు... చాలామంది బాధపడ్డారు (అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న విషయాన్ని ఉద్దేశిస్తూ). అయితే... వాళ్ల బాధను వ్యక్తం చేయడానికి ఓ పద్ధతి అంటూ ఉండాలి" అని సమంత గతంలో వ్యాఖ్యానించారు. ఆమె ప్రత్యేక గీతంలో నటించిన 'పుష్ప: ద రైజ్' ఇటీవల విడుదల అయ్యింది. ప్రస్తుతం తెలుగు సహా తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతోన్న 'యశోద' సినిమాలో ఆమె నటిస్తున్నారు. ఇది కాకుండా మరో తెలుగు, తమిళ సినిమా అంగీకరించారు. త్వరలో అది కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక, ఆమె చిత్రీకరణ పూర్తి చేసిన 'శాకుంతలం' సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కానుంది.
Also Read: 'పుష్ప' కథ ఎవరిది? సుకుమార్ దా? చిత్తూరు జిల్లా విలేకరి దా?
Also Read: పెళ్లి ఒకడితో... ఫస్ట్ నైట్ ఇంకొకడితో టైప్ నా వల్ల అవ్వట్లేదు! - తమన్
Also Read: బాలకృష్ణ, రవితేజ మధ్య గొడవ ఏంటి? ఇదిగో తెలుసుకోండి!!
Also Read: అనసూయను తీసేయండి... రష్మీని తీసుకు రండి!
Also Read: పవన్ కల్యాణ్... మహేష్ బాబుతో పాటు వాళ్లకూ రాజమౌళి థాంక్స్! ఎందుకంటే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి