News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

NBK Unstoppable: బాలకృష్ణ, రవితేజ మధ్య గొడవ ఏంటి? ఇదిగో తెలుసుకోండి!!

బాలకృష్ణకు, రవితేజకు మధ్య గొడవలు ఉన్నాయా? గొడవల గురించి తొలిసారి ఇద్దరూ స్పందించారు. 

FOLLOW US: 
Share:

'మొదలుపెట్టే ముందు బాసూ... మనకి ఒక క్లారిటీ తీసుకోవాలి' -  బాలకృష్ణ
'ఏంటో చెప్పండి?' - రవితేజ అడిగారు. చేతులు కట్టుకుని!
'నీకు... నాకు పెద్ద గొడవ అయ్యిందంటగా!' - బాలకృష్ణ నెక్స్ట్ డైలాగ్.
ఒక్కసారిగా రవితేజ నవ్వేశారు. కట్టుకున్న చేతులు పక్కన పెట్టి కొంచెం పక్కకి జరిగారు.
'పని పాట లేని డాష్ నా డాష్ గాళ్లకు ఇదే పని' అని రవితేజ అన్నారు. అక్కడితో మేటర్ క్లోజ్. ఇద్దరి మధ్య ఏం లేదని క్లారిటీ వచ్చింది.

నట సింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్‌స్టాప‌బుల్‌'. దీనికి మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని వచ్చిన సంగతి తెలిసిందే. తొలుత ఈ ఎపిసోడ్ డిసెంబర్ 24న విడుదల చేయాలని అనుకున్నా... ఆ తర్వాత డిసెంబర్ 31న రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. లేటెస్టుగా ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు.
రవితేజ ఎప్పుడూ హుషారుగా ఉంటారు. బాలకృష్ణ ఎంత సరదాగా ఉంటారనేది ఈ షో ద్వారా జనాలకు తెలిసింది. వీళ్లిద్దరూ కలిసి ఒక రేంజ్ లో సందడి చేసినట్టు ప్రోమో చూస్తే తెలుస్తోంది. 'నీకు కోపం వచ్చినప్పుడు వాడే ఓ నాలుగు బూతులు చెప్పు బాసూ' అని బాలకృష్ణ అడిగితే... 'నేను బూతులు మొదలు పెడితే చస్తారు గానీ' అని రవితేజ అన్నారు. రవితేజ అమ్మాయిలకు లైన్ వేసిన విషయాలు కూడా బాలకృష్ణ అడిగారు. డ్రగ్స్ కేసు విషయం కూడా బాలకృష్ణ ప్రస్తావించారు. ఆ కేసు గురించి తెలిసి తొలుత తనకు ఆశ్చ కలిగిందని రవితేజ చెప్పుకొచ్చారు. తనకు ఏ విషయంలో బాధ కలిగిందనేది కూడా రవితేజ చెప్పినట్టు తెలిసింది. అదేంటో షోలో చూడాలి. 'జై బాలయ్య' పాటకు రవితేజ స్టెప్పులు వేయడం ప్రోమోలో హైలైట్.
'అఖండ' విజయం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ సినిమాకు ముందు ఆయన రవితేజ హీరోగా 'క్రాక్' సినిమాకు దర్శకత్వం వహించారు. ఆయన కూడా టాక్ షోకు వచ్చారు. నెక్స్ట్ తనకు బ్లాక్ బస్టర్ ఇవ్వకపోతే కొడతాను అన్నట్టు బాలకృష్ణ సరదాగా అన్నారు.
Here's the Unstoppable Episode promo... featuring Ravi Teja, Gopichand Malineni:

Also Read: అనసూయను తీసేయండి... రష్మీని తీసుకు రండి!
Also Read: పవన్ కల్యాణ్... మహేష్ బాబుతో పాటు వాళ్లకూ రాజమౌళి థాంక్స్! ఎందుకంటే...
Also Read: అసభ్యకర సందేశాలు.. ఇంటికి వచ్చి మరీ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్..
Also Read: అమ్మో... అప్పుడు చాలా భయపడ్డాను! - సాయి పల్లవి ఇంటర్వ్యూ
Also Read: పవర్ స్టార్ అభిమానులకు నిర్మాత సారీ... పవన్ చెప్పడం వల్లే!
Also Read: బాలయ్య దగ్గరకు అల్లు అర్జున్ వస్తున్నాడు... రవితేజ వెనక్కి వెళ్లాడు!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 21 Dec 2021 07:02 PM (IST) Tags: raviteja Nandamuri Balakrishna Balakrishna Gopichand Malineni Drug Case NBK NBK Unstoppable Unstoppable Latest Promo Unstoppable episode with Raviteja

ఇవి కూడా చూడండి

Siddharth: ఎట్టకేలకు నోరు విప్పిన సిద్ధార్థ్, బెంగళూరు అవమానంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Siddharth: ఎట్టకేలకు నోరు విప్పిన సిద్ధార్థ్, బెంగళూరు అవమానంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ram Charan 16 Heroine : రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ - నిర్మాత కుమార్తె?

Ram Charan 16 Heroine : రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ - నిర్మాత కుమార్తె?

Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా

Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా

Game Changer: 2 రోజుల్లో రిలీజ్ డేట్ చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటా, ‘గేమ్ ఛేంజర్‘ టీమ్ కు చెర్రీ ఫ్యాన్ వార్నింగ్

Game Changer: 2 రోజుల్లో రిలీజ్ డేట్ చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటా, ‘గేమ్ ఛేంజర్‘ టీమ్ కు చెర్రీ ఫ్యాన్ వార్నింగ్

Miss Shetty Mr Polishetty OTT : ఈ వారమే ఓటీటీలో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' - నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ ఎప్పుడంటే?

Miss Shetty Mr Polishetty OTT : ఈ వారమే ఓటీటీలో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' - నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Tamilsai : ఎంత అవమానించినా వెనక్కి తగ్గను -గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు !

Tamilsai : ఎంత అవమానించినా వెనక్కి తగ్గను -గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు !

మేనిఫెస్టోతో మ్యాజిక్ చేయనున్న బీఆర్‌ఎస్‌- హింట్ ఇచ్చిన హరీష్

మేనిఫెస్టోతో మ్యాజిక్ చేయనున్న బీఆర్‌ఎస్‌- హింట్ ఇచ్చిన హరీష్

బీజేపీ వైఖరి నచ్చకే NDA నుంచి బయటకు వచ్చేశాం, AIDMK నేత కీలక వ్యాఖ్యలు

బీజేపీ వైఖరి నచ్చకే NDA నుంచి బయటకు వచ్చేశాం, AIDMK నేత కీలక వ్యాఖ్యలు

Shri Lakshmi Satish Photos: RGV కంట్లో పడిన బ్యూటిఫుల్ లేడీ ఎవరో తెలుసా!

Shri Lakshmi Satish Photos: RGV కంట్లో పడిన బ్యూటిఫుల్ లేడీ ఎవరో తెలుసా!