By: ABP Desam | Updated at : 21 Dec 2021 08:25 PM (IST)
సంగీత దర్శకుడు తమన్
ఇప్పుడు తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అనే ప్రశ్న ఎదురైతే... తమన్ పేరు తప్పకుండా తొలి రెండు మూడు స్థానాల్లో వినిపిస్తుంది. అతడే టాప్ అనేది కొందరు చెప్పే మాట. మరి, అతడికి హిందీ సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశాలు రావడం లేదా? అంటే... వస్తున్నాయి. 'గోల్ మాల్', 'సింబా', 'సూర్యవన్షీ' సినిమాలు చేశారు. మూడు రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన సినిమాలే. అయితే... మూడు సినిమాలకు తమన్ ఒక్కరే సంగీతం చేయలేదు. ఓ సినిమాలో కొన్ని పాటలు, నేపథ్య సంగీతం చేస్తే... మరొక సినిమాకు నేపథ్య సంగీతం మాత్రమే చేశారు. అలా చేయడం తన వల్ల కాక అక్కడ నుంచి వచ్చేశానని తమన్ అన్నారు.
'హిందీలో ఎందుకు సెటిల్ కాలేదు?' అని తమన్‌ను ఆలీ ప్రశ్నించారు. "ఆరు మంది ఎలా మ్యూజిక్ (ఓ సినిమాకు) చేస్తున్నారో అర్థం కావడం లేదు. 'ఒక రీల్ ఆర్ఆర్ (రీ రికార్డింగ్) చేయండి. ఒక పాట చేస్తే చాలు' అంటే... నా వల్ల అవ్వడం లేదు. పెళ్లి ఒకడితో ఫస్ట్ నైట్ ఇంకొకడితో లాగా అయిపోతుంది" అని తమన్ సమాధానం ఇచ్చారు.
ఇంతకు ముందు ఆయన పేరులో రెండు 'ఎస్'లు ఉండేవి. ఎస్.ఎస్. తమన్ అని రాసుకునేవారు. ఇప్పుడు తమన్ .ఎస్ లేదా తమన్ అని మాత్రమే టైటిల్స్ లో పడుతోంది. ఎందుకు అలా అనే అంశంలోనూ 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో తమన్ వివరించారు. తమన్ అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్. చిన్నప్పుడు అందరూ అతడిని సాయి అనేవారు. సాయితో పాటు తండ్రి శివకుమార్ పేరు వచ్చేలా ఎస్.ఎస్. తమన్ అని పెట్టుకున్నారు. ఎక్కువ అవుతుందని తమన్ అని మార్చుకున్నట్టు తెలిపారు. ఇంట్లో తన భార్య శ్రీ వర్ధిని చేసే ట్రోలింగ్ ముందు బయట చేసే ట్రోలింగ్ చాలా తక్కువ అని అన్నారు. ఎవరూ ప్లాప్ సాంగ్స్ ఇవ్వమని రారని చెప్పుకొచ్చారు.
తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు తమన్. ఢిల్లీ నుంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్నప్పుడు తండ్రికి మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని, మధ్యలో ఎక్కడా ఆపడానికి లేకుండా పోయిందని, గమ్యం చేరుకున్న తర్వాత ఆస్పత్రికి తీసుకువెళ్లినా బతికేవారని, కానీ అలా జరగలేదని తమన్ తెలిపారు.
Also Read: బాలకృష్ణ, రవితేజ మధ్య గొడవ ఏంటి? ఇదిగో తెలుసుకోండి!!
Also Read: అనసూయను తీసేయండి... రష్మీని తీసుకు రండి!
Also Read: పవన్ కల్యాణ్... మహేష్ బాబుతో పాటు వాళ్లకూ రాజమౌళి థాంక్స్! ఎందుకంటే...
Also Read: అసభ్యకర సందేశాలు.. ఇంటికి వచ్చి మరీ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్..
Also Read: అమ్మో... అప్పుడు చాలా భయపడ్డాను! - సాయి పల్లవి ఇంటర్వ్యూ
Also Read: పవర్ స్టార్ అభిమానులకు నిర్మాత సారీ... పవన్ చెప్పడం వల్లే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ
Urfi Javed: ఉర్ఫీ జావెద్‌కు లైంగిక వేధింపులు - అతడి ఫొటో, వాట్సాప్ చాట్ బయటపెట్టిన బ్యూటీ
Karthika Deepam Serial Doctor Babu Re-entry : తలకు కట్టు, ఎల్లో టీషర్టు 'కార్తీకదీపం' సెట్లోకి డాక్టర్ బాబు రీఎంట్రీ
Salman Khan: అభిమానులకు సల్మాన్ ఖాన్ గుడ్ న్యూస్, ఆ సినిమాకు మరో సీక్వెల్ - రిలీజ్ డేట్ ఇదే
Vijay Devarakonda : దర్శకత్వ శాఖలో పనిచేసిన విజయ్ దేవరకొండ - ఎవరి దగ్గరో తెలుసా?
Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి
Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల
Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!
Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!