Pawan Kalyan: సముద్రఖని డైరెక్షన్.. త్రివిక్రమ్ ప్రొడక్షన్.. హీరోగా పవన్..
త్రివిక్రమ్ నిర్మాతగా పవన్ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నారు. చాలా రోజులుగా పవన్ కళ్యాణ్ ఓ రీమేక్ లో నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ స్నేహితులనే సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. పవన్ కి సంబంధించిన అన్ని విషయాల్లో త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తోన్న 'భీమ్లానాయక్' సినిమాకి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా వెనక్కి తగ్గింది. ఫిబ్రవరి 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ నిర్మాతగా పవన్ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నారు. చాలా రోజులుగా పవన్ కళ్యాణ్ ఓ రీమేక్ లో నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన 'వినోదయ సీతం' అనే సినిమాను ఇప్పుడు తెలుగులో పవన్ హీరోగా రీమేక్ చేయాలనుకుంటున్నారు. తమిళంలో సముద్రఖని ఈ సినిమాలో నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. ఇప్పుడు తెలుగు రీమేక్ ని కూడా సముద్రఖని డైరెక్ట్ చేయబోతున్నారట.
త్రివిక్రమ్ తన హోమ్ బ్యానర్ ఫార్చ్యూన్ ఫోర్ పై, రామ్ తాల్లూరితో కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న 'హరిహర వీరమల్లు' షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. నిజానికి హరీష్ శంకర్ సినిమా మొదలుకావాలి కానీ ప్రస్తుతానికి ఆ సినిమాను కొన్నాళ్లపాటు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే తమిళ రీమేక్ ని మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో పవన్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందని సమాచారం.
Also Read: అర్ధరాత్రి ఆ హీరో ఇంటి దగ్గర కెమెరా కంటికి చిక్కిన హీరోయిన్
Also Read: వసుధారని ఇంట్లోంచి పంపించేయాలని జగతికి షాకిచ్చిన రిషి.. గుప్పెడంత మనసు డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్
Also Read: పెళ్లి ఒకడితో... ఫస్ట్ నైట్ ఇంకొకడితో టైప్ నా వల్ల అవ్వట్లేదు! - తమన్
Also Read: బాలకృష్ణ, రవితేజ మధ్య గొడవ ఏంటి? ఇదిగో తెలుసుకోండి!!
Also Read: పవన్ కల్యాణ్... మహేష్ బాబుతో పాటు వాళ్లకూ రాజమౌళి థాంక్స్! ఎందుకంటే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి