అన్వేషించండి

Virosh Wedding First Pics: విజయ్ దేవరకొండను భర్తగా పరిచయం చేసిన రష్మిక... మరి రౌడీ బాయ్? వధూవరులు ఇద్దరి లుక్స్ సూపర్...

The Wedding Of Virosh First Photo: విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంట తమ వివాహ బంధాన్ని అధికారికంగా వెల్లడించింది. పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

Vijay Deverakonda - Rashmika Mandanna Wedding First Photos: విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంట వివాహ బంధంతో ఒక్కటైంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ అందుకు వేదిక అయ్యింది. ఈ రోజు (ఫిబ్రవరి 26వ తేదీ, గురువారం) ఉదయం 10.10 గంటలకు రష్మిక మెడలో మూడు ముళ్ళు వేశారు విజయ్ దేవరకొండ. తొలుత తెలుగు, ఆ తర్వాత కడువ సంప్రదాయాల్లో వివాహ క్రతువు నిర్వహించినట్లు సమాచారం. సాయంత్రం తమ వివాహ బంధాన్ని ఇద్దరూ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు.

నా భర్త విజయ్ దేవరకొండ - రష్మిక పోస్ట్ చదివారా?
విజయ్ దేవరకొండను తన భర్తగా పరిచయం చేస్తూ రష్మికా మందన్నా సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు షేర్ చేశారు. ''నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పించిన వ్యక్తి, ప్రశాంతంగా ఉండటం ఎలా ఉంటుందో నాకు చూపించిన వ్యక్తి, ప్రతిరోజూ పెద్ద కలలు కనడం కచ్చితంగా సరేనదేనని, నా ఊహలకు అందని విధంగా నేను ఏదైనా సాధించగలనని ఎప్పుడూ చెప్పగలిగే వ్యక్తి, ఎవరూ చూడనట్లు నృత్యం చేయకుండా నన్ను ఎప్పుడూ ఆపని వ్యక్తి, స్నేహితులతో ప్రయాణించడం ఎంత సరదాగా ఉంటుందో నాకు చూపించిన వ్యక్తి... ఈ వ్యక్తి గురించి ఒక పుస్తకం రాయగలను'' అని రష్మిక చెప్పారు. 

Also Read: Virosh Wedding Photos: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ఫోటోలు వచ్చేశాయ్... కొత్త జంట ఎంత చూడముచ్చటగా ఉందో చూశారా?

విజ్జు (విజయ్ దేవరకొండ) పట్ల తనకు ఉన్న భావాలను వర్ణించడానికి ఎప్పుడూ మాటలు లేవని రష్మిక తెలిపారు. ఇప్పుడు తన జీవితంలో అతను ఓ భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ భార్యగా మారడానికి చాలా ఉత్సాహంగా ఉన్నానని, ఎప్పుడూ లేనంత ఉత్తమ జీవితాన్ని గడుపుతామని, విజయ్ దేవరకొండను ప్రేమిస్తున్నానని రష్మిక స్పష్టం చేశారు. 

Also Read: Virosh Wedding: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి వేడుక... 'విరోష్ వెడ్డింగ్' పురోహితులు ఎవరో తెలుసా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

రష్మికను భార్యగా పరిచయం చేసిన విజయ్ దేవరకొండ
రష్మికా మందన్నాను తన భార్యగా విజయ్ దేవరకొండ పరిచయం చేశారు. ''ఒక రోజు తనను మిస్ అయ్యాను. తన నా పక్కన ఉంటే జీవితం బావుంటుందని అనేంతగా మిస్ అయ్యాను'' అని ఆయన పేర్కొన్నారు. తన బెస్ట్ ఫ్రెండును తన భార్యగా చేసుకున్నట్టు విజయ్ దేవరకొండ తెలిపారు. 

Also ReadVirosh Wedding: విజయ్ - రష్మిక పెళ్లికి ఈషా రెబ్బా... ఆవిణ్ణి ఎందుకు పిలిచారు? ఎవరి కోటాలో వెళ్లారో తెలుసా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

విజయ్ దేవరకొండ, రష్మిక వివాహానికి హీరోయిన్లు కల్యాణీ ప్రియదర్శన్, ఆషికా రంగనాథ్, ఈషా రెబ్బా, దర్శకుడు - నటుడు తరుణ్ భాస్కర్, స్టైలిస్ట్ & నిర్మాత శ్రావ్య వర్మ తదితరులు హాజరయ్యారు.

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Balakrishna Koratala Siva Movie: కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Embed widget