(Source: Poll of Polls)
Ram Charan: శంకర్-చరణ్ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. అదే ఫార్ములా..
దర్శకుడు శంకర్ ఎప్పటిలానే రామ్ చరణ్ తో తీస్తోన్న సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు శంకర్-రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేయగానే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. శంకర్ సినిమాలు ఎంత గ్రాండ్ గా ఉంటాయో తెలిసిందే. తన సినిమాలో ప్రతి సీన్ పెర్ఫెక్ట్ గా ఉండాలని చూస్తుంటారు శంకర్. అలాంటి దర్శకుడు రామ్ చరణ్ లాంటి మాస్ హీరోని ఎలా చూపిస్తాడా..? అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ ను పూణేలో పూర్తి చేశారు. త్వరలోనే కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టబోతున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో శంకర్ ఎప్పటిలానే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శంకర్ తీసిన చాలా సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది ఉంటుంది. 'జెంటిల్మెన్' సినిమాలో హీరో అర్జున్ కి ఫ్లాష్ బ్యాక్ పెట్టారు. దాని కారణంగానే అతడు దొంగగా మారినట్లు చూపిస్తారు. 'భారతీయుడు' సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది మొత్తం సినిమాకే హైలైట్ అని చెప్పారు. 'జీన్స్' సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారు. ఇవన్నీ కూడా కథను మలుపుతిప్పే ఎపిసోడ్లు.
ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకి కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడట శంకర్. ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు. ఉద్యోగ వ్యవస్థ తీరు తెన్నులు, ప్రజల హక్కుల గురించి ప్రధానంగా చర్చించే సినిమా ఇది. ఇందులో రామ్ చరణ్ కి బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. అది చాలా ఎమోషనల్ గా సాగుతుందని తెలుస్తోంది. ఆ ఎపిసోడ్ వలనే హీరో లక్ష్యం పూర్తిగా మారుతుందని.. కథ మలుపు తిరుగుతుందని ఇన్సైడ్ వర్గాల సమాచారం.
సినిమా కొత్త షెడ్యూల్ ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తోనే మొదలవుతుందని సమాచారం. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్, అంజలి కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదల కాబోతుంది. ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు రామ్ చరణ్. సినిమా విడుదలైన వెంటనే మళ్లీ శంకర్ సినిమా సెట్స్ పైకి వెళ్తారు.
Also Read:సముద్రఖని డైరెక్షన్.. త్రివిక్రమ్ ప్రొడక్షన్.. హీరోగా పవన్..
Also Read: అర్ధరాత్రి ఆ హీరో ఇంటి దగ్గర కెమెరా కంటికి చిక్కిన హీరోయిన్
Also Read: పెళ్లి ఒకడితో... ఫస్ట్ నైట్ ఇంకొకడితో టైప్ నా వల్ల అవ్వట్లేదు! - తమన్
Also Read: బాలకృష్ణ, రవితేజ మధ్య గొడవ ఏంటి? ఇదిగో తెలుసుకోండి!!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి