Peddi Second Single : 'పెద్ది' రెండో సాంగ్ రెడీ - 'చికిరి చికిరి' ట్రెండ్‌ను దాటేస్తుందా?... క్రేజీ సర్‌ప్రైజ్ ఎప్పుడంటే?
Peddi Second Song : రామ్ చరణ్ 'పెద్ది' నుంచి రెండో సాంగ్ వచ్చేస్తోంది. ఇప్పటికే వచ్చిన చికిరి చికిరి సాంగ్ ట్రెండ్ క్రియేట్ చేస్తుండగా... రెండో సాంగ్ అంతకు మించి ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Ram Charan's Peddi Second Single Release Date : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు కాంబో 'పెద్ది' నుంచి ఇప్పటికే 'చికిరి చికిరి' సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మూవీ నుంచి రెండో సాంగ్ కోసం మెగా అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనిపై మూవీ టీం బిగ్ సర్పైజ్ ఇచ్చింది.
సాంగ్ ఎప్పుడంటే?
ఈ మూవీ నుంచి రెండో సాంగ్ మార్చి 2 రిలీజ్ చేయనున్నారు. 'రయ్ రయ్ రా రా' అంటూ సాగే పాటను ఆ రోజున రిలీజ్ చేస్తామని మూవీ టీం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఈ మేరకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సాంగ్ రిలీజ్‌పై పోస్ట్ పెట్టారు. 'ఈ పాట మిమ్మల్ని మరింత ఉత్తేజితం చేస్తుంది' అంటూ X వేదికగా రాసుకొచ్చారు.
హీరో రోల్ ఇంట్రడ్యూస్ చేసే సాంగ్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా... 'చికిరి చికిరి' చార్ట్ బస్టర్‌గా నిలిచింది. రిలీజ్ చేసిన ఒక్క రోజులోనే 46 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. 100 మిలియన్లను పైగా వ్యూస్‌తో హిస్టరీ క్రియేట్ చేసింది. బ్యాట్ పట్టుకుని చికిరి చికిరి అంటూ చరణ్ వేసిన హుక్ స్టెప్‌ను దాదాపు లక్షల్లో సోషల్ మీడియాలో రీక్రియేట్ చేశారు. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో రెండో సాంగ్ ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది.
This song fuels the fire within 🔥🔥#Peddi second single #RaiRaiRaaRaa will be a blast 💥💥
— Ram Charan (@AlwaysRamCharan) February 26, 2026
Full Song on 2nd March.#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026@NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani… pic.twitter.com/dXANh0eXjQ
రిలీజ్ వాయిదా
మార్చి 27నే మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా... షూటింగ్ పెండింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాకపోవడం వంటి కారణాలతో రిలీజ్ వాయిదా పడింది. వరల్డ్ వైడ్‌గా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుకున్న టైంకు మూవీ రిలీజ్ చేసేందుకు మూవీ టీం తీవ్రంగా శ్రమిస్తోంది.
Also Read : వెడ్డింగ్ ఆఫ్ విరోష్ - విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి జరిగేది ఇక్కడే... స్పెషాలిటీస్, కాస్ట్ ఎంతో తెలుసా?
మూవీలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, జగపతి బాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఉత్తరాంధ్ర గ్రామీణ స్పోర్ట్స్ నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా మూవీ రూపొందుతోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో మూవీ రిలీజ్ కానుంది.
























