Mahesh Babu: సంక్రాంతి కూడా అక్కడే ప్లాన్ చేసిన మహేష్ బాబు...
సంక్రాంతి వరకూ మహేష్ బాబు షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. న్యూ ఇయర్‌తో పాటు సంక్రాంతి సెలబ్రేషన్స్ కూడా ప్లాన్ చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు దుబాయ్‌లో ఉన్నారిప్పుడు! స్పెయిన్‌లో మోకాలికి సర్జరీ చేయించుకున్న తర్వాత... అక్కడ నుంచి ఆయన దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. మహేష్ బాబు వెంట ఆయన భార్య నమ్రతా శిరోద్కర్‌తో పాటు పిల్లలు గౌతమ్, సితార కూడా ఉన్నారు. దుబాయ్‌లో కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పాలని, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవాలని సూపర్ స్టార్ ఫ్యామిలీ డిసైడ్ అయ్యింది. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... న్యూ ఇయర్ మాత్రమే కాదు, సంక్రాంతి కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకోవాలని మహేష్ బాబు ప్లాన్ చేశారట. సంక్రాంతి తర్వాతే ఆయన ఇండియాకు రానున్నారని సమాచారం.
మహేష్ బాబుకు సర్జరీ కావడంతో... ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చారు. మహేష్ తిరిగి వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మధ్యలో మహేష్ అవసరం లేని సీన్స్ కొన్ని తీయడానికి దర్శకుడు పరశురామ్ ప్లాన్ చేశారట. మరో నెల రోజులు 'సర్కారు వారి పాట' షూటింగ్ చేయాలని టాక్. మహేష్ బాబు సరసన కీర్తీ సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
'సర్కారు వారి పాట' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేయనున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్ డిస్కషన్స్ కంప్లీట్ అయ్యాయని, స్టోరీ మీద హీరో, దర్శకుడు ఓ ఐడియాకు వచ్చారని సమాచారం. మరోవైపు రాజమౌళి కూడా మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. 'ఆర్ఆర్ఆర్" రౌద్రం రణం రుధిరం' తర్వాత మహేష్‌తో సినిమా చేయనున్నట్టు దర్శక ధీరుడు స్పష్టం చేశారు.
Also Read: 'ఢీ' నుంచి దర్శకేంద్రుడి దగ్గరకు... దీపికా పిల్లి గ్రాఫ్ ఓ రేంజ్‌లో ఉంది మరి!
Also Read: 'భీమ్లా నాయక్' బ్యూటీకి మరో క్రేజీ సినిమాలో ఛాన్స్!
Also Read: 'కనీసం నీకు నువ్వైనా సమాధానం చెప్పుకో'.. దీప్తి స్టేటస్ షణ్ముఖ్ ని ఉద్దేశించేనా..?
Also Read: 'విక్రమార్కుడు' సినిమాకి సీక్వెల్.. కానీ మేటర్ ఏంటంటే..?
Also Read: హీరోయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఈ నొప్పిని భరించాల్సిందే.. రష్మిక స్వీట్ వార్నింగ్
Also Read: నాది అంత కంఫర్టబుల్ కాదు... ఒరిజినల్ స్ట్రగుల్స్ వేరే ఉన్నాయ్! - నాని ఇంటర్వ్యూ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి