Deepthi Sunaina: 'కనీసం నీకు నువ్వైనా సమాధానం చెప్పుకో'.. దీప్తి స్టేటస్ షణ్ముఖ్ ని ఉద్దేశించేనా..?
షణ్ముఖ్ ప్రవర్తనతో దీప్తి హర్ట్ అయినట్లుగా ఉంది. ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్న పోస్ట్ లు నెటిజన్లలో పలు సందేహాలు కలిగిస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు. హౌస్ లో ఉన్నంతకాలం ఇతరుల ఆలోచనలను అంచనా వేస్తూ.. బ్రహ్మ అని పేరు సంపాదించుకున్నాడు. కొన్ని వారాల గేమ్ బాగానే ఆడిన షణ్ముఖ్.. ఆ తరువాత ఎక్కువగా ఆలోచించి బాగా ఎఫెక్ట్ అయ్యాడు. సిరితో స్నేహం కూడా మైనస్ అయింది. ఐదేళ్లుగా దీప్తి సునైనాతో రిలేషన్ లో ఉన్న షణ్ముఖ్ హౌస్ లోకి వచ్చిన తరువాత సిరితో బాగా కనెక్ట్ అయ్యాడు. 'నేను సిరికి అడిక్ట్ అయిపోతున్నా' అంటూ ఒకసారి శ్రీరామ్ తో అన్నాడు షణ్ముఖ్.
సిరి కూడా తప్పని తెలిసినా.. షణ్ముఖ్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతున్నా అంటూ ఓపెన్ గా చెప్పింది. హౌస్ లోకి సిరి వాళ్ల మదర్ వచ్చి షణ్ముఖ్ తో హగ్గులు ఎక్కువైపోతున్నాయని అందరి ముందే అనేశారు. అయినా.. షణ్ముఖ్-సిరి తమ బిహేవియర్ మార్చుకోలేదు. ఫ్రెండ్షిప్ హగ్ అంటూ జనాలను మరింత విసిగించారు. దీంతో వీరిపై ఒకరకమైన నెగెటివిటీ క్రియేట్ అయింది.
హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత సిరితో రిలేషన్ పై క్లారిటీ ఇచ్చాడు షణ్ముఖ్. సిరి బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని.. ఆమె కోసం దీప్తితో రిలేషన్ పాడుచేసుకోనని కూడా చెప్పాడు. కానీ షణ్ముఖ్ ప్రవర్తనతో దీప్తి హర్ట్ అయినట్లుగా ఉంది. ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్న పోస్ట్ లు నెటిజన్లలో పలు సందేహాలు కలిగిస్తున్నాయి.
'కనీసం నీకు నువ్వైనా సమాధానం చెప్పుకునేలా ఉండు..', 'నా చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా', 'ఈ ఏడాది నాకు బాగా అనిపించలేదు.. కానీ చాలా నేర్చుకున్నాను' అంటూ వరుసగా పోస్ట్ లు పెడుతోంది. ఇది చూసిన నెటిజన్లు షణ్ముఖ్ గురించేనా ఈ పోస్ట్ లు అంటూ.. ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో.. దీప్తి-షణ్ముఖ్ లకి బ్రేకప్ అయిందని ఫిక్సయిపోయారు. మరి దీనిపై ఈ జంట స్పందిస్తుందేమో చూడాలి!
View this post on Instagram
Also Read: నాగార్జున వస్తే.. పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా..?
Also Read: 'ఆర్ఆర్ఆర్' ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్ట్ లుగా చిరంజీవి, బాలకృష్ణ..?
Also Read:సూపర్ స్టార్ రజినీకాంత్.. నానికి ఛాన్స్ ఇస్తారా..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి