Samantha: సమంతకు అండగా రంగంలోకి దిగిన ఫ్రెండ్... భావోద్వేగ పోస్టు
విడాకుల వివాదం తరువాత సమంత చాలా ట్రోల్ అవుతోంది.
సమంతకు 2021 మరిచిపోలేని ఏడాది. సినిమాలపరంగా విజయాలు అందుకున్నా, వ్యక్తిగతంగా చాలా నష్టపోయింది. భర్తతో విడాకుల వివాదంతో ట్రోలింగ్ బారిన పడింది. కొన్ని రోజులు ట్రోలింగ్ ఆగినా పుష్ప సినిమాలో ‘ఊ అంటావా’ పాటతో మళ్లీ ఆన్‌లైన్లో ట్రోలింగ్ కు గురైంది. ఒక వ్యక్తి ‘సెకండ్ హ్యాండ్ ఐటెమ్’అని కామెంట్ చేశాడు. అంతేకాదు ‘ఒక జెంటిల్మెన్ నుంచి రూ.50 కోట్లు తీసుకుంది’అంటూ ట్రోల్ చేశాడు. అంటే నాగచైతన్య నుంచి విడాకుల పేరుతో రూ.50 కోట్లు తీసుకుందనే అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. దీనిపై సమంత చాలా కూల్ గా స్పందించింది. ‘గాడ్ బ్లెస్ యువర్ సోల్’అంటూ రిప్లయ్ ఇచ్చింది. సమంతపై ఈ ట్రోలింగ్ ను చూసి తట్టుకోలేకపోయింది ఆమె ఫ్రెండ్ చిన్మయి. సామ్‌కు అండగా నిలబడి ఆమెను పొగుడుతూ పోస్టులు పెట్టింది.
భావోద్వేగ పోస్టు...
చిన్మయి శ్రీపాద మంచి గాయని. సామ్ తొలిసినిమా ‘ఏ మాయ చేశావే’లో జెస్సీ పాత్రకు గాత్రదానం చేసింది. అప్పట్నించి వారిద్దరూ మంచి స్నేహితులైపోయారు. సమంతపై ప్రస్తుతం వస్తున్న ట్రోల్స్ చూసి తట్టుకోలేకపోయినా చిన్మయి ఇన్ స్టా స్టేటస్ లో పెద్ద పోస్టు పెట్టింది. భావోద్వేగాలతో లేఖ రాసింది. పరిశ్రమలో మహిళలపై వేధింపుల స్థాయిని వివరించింది....‘మహిళలు రోజూ అనేక రకాల వేధింపులకు గురవుతున్నారు. వారి గుండెలు బద్దలయ్యేలా మాటలతో హింసిస్తున్నారు. బాడీ షేమింగ్ చేయడం, సరిపడని బాయ్ ఫ్రెండ్‌ని వదిలిపెడితే నిందించడం వంటివి పెరిగిపోతున్నాయి. యాసిడ్ దాడులు, లైంగిక హింస, గృహ హింసను సమర్థించే దృశ్యాలు ఎక్కువవుతున్నాయి. వాటి గురించి నిలదీసినప్పుడు తిరిగి మమ్మల్నే నిందిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో నటీమణులపై ఇటువంటి తీరు ఎక్కువైపోయింది’ అని రాసుకొచ్చింది. తన స్నేహితురాలు సమంతకు తాను అండగా ఉంటానని, ఆమెనే సమర్థిస్తానని చెప్పుకొచ్చింది. ‘ఆమె తనను తిడుతున్నా కూడా నిశ్శబ్దంగా ఉంది. అందుకే ఆమె క్వీన్. ఆమె మరింత శక్తివంతంగా మారుతోంది. సామ్ అభిమానుల్లో నేనూ ఒకదాన్ని. ఆమె విజయం సాధిస్తే నేనూ ఆనందిస్తాను’ అని తెలిపింది.
సమంత, నాగచైతన్య ఈ ఏడాది అక్టోబర్ విడిపోతున్నట్టు ప్రకటించారు. వీరిద్దరూ 2017 అక్టోబర్లో పెళ్లి చేసుకున్నారు. ఫ్యామిలీమేన్లో సమంత చేసిన ఓ బోల్డ్ సీన్ వల్ల అక్కినేని కుటుంబానికి సమంతకు దూరం పెరిగినట్టు సమాచారం. నాగచైతన్య కూడా ఆ మధ్య ‘కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చే సీన్లు చేయను’ అని చెప్పుకొచ్చారు.
Also Read: నానికి టికెట్ రేట్స్, కలెక్షన్స్ గురించి ఐడియా ఉందా? - ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా నిర్మాత నట్టి
Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
Also Read: అది నా ఇష్టం! మీ క్యారెక్టర్ సంగతేంటి?... సైలెంట్‌గా క్లాస్ పీకిన అనసూయ!
Also Read: శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు... ఎంత పని చేశావ్ 'బిగ్ బాస్'!
Also Read: కొమురం భీముడో... కొమురం భీముడో... ఎన్టీఆర్ సాంగ్ ప్రోమో వచ్చింది! చూశారా?
Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి