Natti Kumar wants Nani Apology: నానికి టికెట్ రేట్స్, కలెక్షన్స్ గురించి ఐడియా ఉందా? - ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా నిర్మాత నట్టి
ఏపీ ప్రభుత్వానికి హీరో నాని క్షమాపణలు చెప్పాలని నిర్మాత నట్టి కుమార్ డిమాండ్ చేశారు. ఏపీలో టికెట్ రేట్స్ గురించి నాని మాట్లాడటంతో ఆయన స్పందించారు.
ఏపీలో టికెట్ రేట్లు తగ్గించి ప్రేక్షకులను ప్రభుత్వం అవమానించిందని, టికెట్ రేట్లు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని హీరో నాని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. థియేటర్ కంటే కిరాణా కొట్టు కలెక్షన్స్ ఎక్కువ ఉంటున్నాయని, థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్ అని ఆయన అన్నారు. నాని వ్యాఖ్యలను నిర్మాత నట్టి కుమార్ తప్పు పట్టారు. ఏపీ ప్రభుత్వానికి నాని క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
"నాని గారికి కలెక్షన్స్ గురించి, ఎంత షేర్ వస్తుంది? ఏమిటి? అనేది ఐడియా ఉందా? తెలుసా? ఐడియా ఉంటే మాట్లాడవచ్చు. ఇప్పుడు ఇదే రేట్స్ మీద పది లక్షల మంది సినిమా చూస్తే... పదహారు కోట్ల షేర్ వస్తోంది. నాని గత సినిమాలు విడుదల అయినప్పుడు వంద రూపాయల టికెట్ రేటు ఉంది. ఇప్పుడు 150, 200 రూపాయల రేట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే బి, సి సెంటర్లలో తక్కువ ఉన్నాయని మొదటి నుంచి అనుకుంటున్నాం. 35 రూపాయల టికెట్ రేటు ఉండటం అన్యాయం. ఐదు రూపాయలకు టీ రాదు. ఆ విషయంలో ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. సమస్య కోర్టులో ఉంది. ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. పెద్దలు మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే పండక్కి వచ్చే సినిమాలకు సమస్యలు వస్తాయి. రేట్ల గురించి తెలియకుండా నాని మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆయన ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలి" అని నట్టి కుమార్ మీడియాతో మాట్లాడారు. అదే సమయంలో ఆయన జీవో 35 అలాగే ఉండాలని ఆయన కోరుతున్నారు.
Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
నట్టి కుమార్ మాటలపై కొంత మంది విమర్శలు చేస్తున్నారు. "నట్టి కుమార్ గత దశాబ్ద కాలంగా ఏం సినిమాలు చేశారు? ఆయన సినిమాలు ఏవైనా థియేటర్లలో కోటి రూపాయల షేర్ చేశాయా? ఆయన కలెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు. నానికి కౌంటర్లు ఇస్తున్నారు. కర్మ కాకపోతే ఏంటిది? అన్ని ఏరియాల్లో లాభాలు వస్తున్న సినిమాలు... ఏపీలో టికెట్ రేట్స్ తక్కువ ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నాయి" అని 'టాక్సీవాలా' నిర్మాత ఎస్.కె.ఎన్. ట్వీట్ చేశారు.
Also Read: అది నా ఇష్టం! మీ క్యారెక్టర్ సంగతేంటి?... సైలెంట్‌గా క్లాస్ పీకిన అనసూయ!
Also Read: శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు... ఎంత పని చేశావ్ 'బిగ్ బాస్'!
Also Read: కొమురం భీముడో... కొమురం భీముడో... ఎన్టీఆర్ సాంగ్ ప్రోమో వచ్చింది! చూశారా?
Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!
Also Read: సంక్రాంతి కూడా అక్కడే ప్లాన్ చేసిన మహేష్ బాబు...
Also Read: 'ఢీ' నుంచి దర్శకేంద్రుడి దగ్గరకు... దీపికా పిల్లి గ్రాఫ్ ఓ రేంజ్‌లో ఉంది మరి!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి