News
News
X

Radhe Shyam Story: సొరంగంలో మాయమైన రైలు.. ఈ రియల్ మిస్టరీని ‘రాధేశ్యామ్’ ఛేదిస్తాడా? ఆ రైలు ఏమైంది?

106 మంది ప్రయాణికులు, సిబ్బందితో సొరంగ మార్గంలోకి వెళ్లిన ఆ రైలు అకస్మాత్తుగా మాయమైంది. అందులోని ప్రయాణికులు కూడా రైలుతోపాటు మాయమయ్యారు. మరి వారంతా ఏమయ్యారు? రాధేశ్యామ్ స్టోరీ కూడా ఇదేనా?

FOLLOW US: 
Share:

రోజు ఏమైందో ఏమో.. 106 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ రైలు అకస్మాత్తుగా మాయమైంది. ఆ తర్వాత దాని ఆచూకీ కూడా తెలియలేదు. అదేదో చిన్న వస్తువు అనుకుంటే కనిపించలేదని సరిపెట్టుకోవచ్చు. కానీ, అది ప్రయాణికులంతో నిండిన పెద్ద రైలు. దాన్ని ఎత్తుకెళ్లాలంటే.. పట్టాల మీద నుంచే తీసుకెళ్లాలి తప్పా మరే దారి లేదు. పైగా ఆ రైల్వే ట్రాక్ కనీసం రోడ్డు మార్గం కూడా లేని దట్టమైన అడవుల్లో ఉంది. రైలు పోతే పోయింది.. కానీ, అందులో ఉన్న ప్రయాణికులంతా ఏమయ్యారు? ఆ గుహలోకి వెళ్లగానే ఏం జరిగింది? అనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీయే. అయితే, గురువారం విడుదలైన ‘రాధేశ్యామ్’ చిత్రంలో ఈ రైలు నేపథ్యం ఉంటుందనేది సూచాయంగా తెలిసింది. ట్రైలర్‌లో కూడా రైలు సన్నివేశాలు ఉన్నాయి. దాని తర్వాత ఓ పెద్ద నౌక ప్రమాదానికి గురవ్వుతున్న సన్నివేశం కూడా ఉంది. అయితే, అందులోని రైలు సంఘటన మాత్రం 109 ఏళ్ల కిందట చోటు చేసుకున్న అంతుచిక్కని మిస్టరీ ఘటన. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుంది? ఆ రోజు ఏమైంది?

‘రాధేశ్యామ్’ చిత్రాన్ని ఇటలీలో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. చిత్రం ఏమిటంటే.. ఈ రైలు ఘటన చోటుచేసుకున్నది కూడా ఇటలీలోనే. రోమ్‌లోని జెన్నెట్ (Zanetti) అనే సంస్థ 1911లో ఓ రైలును తయారు చేసింది. ఈ సందర్భంగా తొలిసారి ఆ రైల్లో ప్రయాణించేవారికి టికెట్లు ఉచితమని ప్రకటించింది. జూన్ నెలలో 100 మంది ప్రయాణికులు, ఆరుగురు రైల్వే సిబ్బందితో ఆ రైలు బయల్దేరింది. అయితే, అది గమ్యానికి చేరుకోలేదు. గంటలు గడుస్తున్నా.. ఆ రైలు గురించి ఎలాంటి సమాచారం అందలేదు. లోకో పైలెట్, సిబ్బంది నుంచి కూడా స్పందన లేదు. ఆ తర్వాతి రైల్వే స్టేషన్‌‌కు రైలు చేరలేదు. దీంతో రైలు ప్రమాదానికి గురై ఉంటుందని భావించారు. రైల్వే ట్రాక్ మీదుగా ఆ రైలు గురించి అన్వేషించారు. చిత్రం ఏమిటంటే.. ఎక్కడా రైలు ప్రమాదం జరిగిన ఆనవాళ్లు లేవు. అలాగే రైలు ఆ ట్రాక్ మీదుగా ప్రయాణించిన ఆధారాలు లభించలేదు. రైలు ఏమైందో తెలియక జుట్టు పీక్కుంటున్న సమయంలో అధికారులకు ఓ సమాచారం అందింది. ఆ రైలులో ప్రయాణించిన ఇద్దరి ఆచూకీ లభించినట్లు తెలిసింది.

ఆ ప్రయాణికులిద్దరూ చాలా ఆందోళనగా ఉన్నట్లు కనిపించింది. మతిస్థిమితం కోల్పోయినవారిలా ప్రవర్తించారు. తమ కళ్ల ముందు జరిగిన ఆ సంఘటన తలచుకుంటూ భయపడిపోయారు. రైలు సరిగ్గా సొరంగం మార్గంలోకి ప్రవేశిస్తుండగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయని, ఆ తర్వాత తమ ముందు బోగీల్లో ఉన్న ప్రయాణికులు గట్టిగా కేకలు పెట్టడం వినిపించిందని తెలిపారు. దీంతో భయమేసి రైలు నుంచి కిందకి దూకేశామని చెప్పారు. ఆ తర్వాత రైలు కనిపించలేదని చెప్పారు. వారి మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో అధికారులు మరోసారి సొరంగ మార్గంలో రైలు గురించి అన్వేషించారు. సుమారు కిలోమీటరు పొడవున్న ఆ సొరంగం నుంచి నడుచుకుంటూ వెళ్లారు. పెద్ద లైట్లను వెంట తీసుకెళ్లి.. ఆధారాలను సేకరించేందుకు ప్రయత్నించారు. కానీ, ఫలితం లేకపోయింది. దీంతో ఆ ఇద్దరు చెప్పింది నిజమేనని అధికారులు నమ్మారు. ఆ వెంటనే సొరంగ మార్గాన్ని పూర్తిగా మూసేస్తున్నట్లు ప్రకటించారు. 

టైమ్ ట్రావెల్ చేశారా??: ఈ రైలు గురించి అంతా మరిచిపోతున్న సమయంలో 1926లో ఓ పత్రికలో వచ్చిన సమాచారం ఉలిక్కిపడేలా చేసింది. ఆ రైలు టైమ్ ట్రావెల్‌ జోన్‌లోకి ప్రవేశించిందని, ఫలితంగా ప్రయాణికులతో సహా ఆ రైలు మరో కాలంలోకి వెళ్లిపోయిందనేది ఆ కథనం. దాని ప్రకారం.. 1845 సంవత్సరంలో మెక్సికోలో 104 మంది గుర్తుతెలియని వ్యక్తులను మానసిక వైద్యశాలలో చేరారు. వారంతా ఎక్కడి నుంచి వచ్చారనేది మెక్సికో అధికారులు తెలుసుకోలేకపోయారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న వారి నుంచి వివరాలను రాబట్టుకోవడంలో విఫలమయ్యారు. విచారణలో వారంతా ఇటలీ నుంచి వచ్చారని తెలిసింది. దీంతో ఇటలీ రైలులో మిస్సయిన ఆ 104 మందే.. టైమ్ ట్రావెల్ ద్వారా కొన్నాళ్లు వెనక్కి ప్రయాణించి.. 1845కు చేరుకున్నారని తెలిసింది. పైగా వారిలో కొందరు తాము జెనెట్టీ రైల్లో వచ్చామని వారికి చెప్పారు. అయితే, ఇటలీకి దాదాపు 10వేల కిమీల దూరంలో ఉన్న మెక్సికోకు రైలు మార్గంలో చేరడం అసాధ్యం. అక్కడికి చేరాలంటే విమానంలో లేదా నౌకలో మాత్రమే చేరగలరు. ఈ నేపథ్యంలో వారంతా ఇటలీ నుంచి రైలు వచ్చామని చెప్పడాన్ని మెక్సికో అధికారులు నమ్మలేదు. దీంతో వారిని పిచ్చివాళ్లుగా భావించి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత వారంత ఏమయ్యారనేది తెలియరాలేదు. ఈ ఘటనపై ఇటలీ అధికారులు మెక్సికోను సంప్రదించారు. కానీ, 1845లో చోటుచేసుకున్న ఘటన కావడం వల్ల ఆ ఆధారాలేవీ తమ వద్ద లేవని చేతులెత్తేశారు.

Also Read: ఓ మై గాడ్.. గాలిపటంతోపాటు గాల్లోకి ఎగిరిపోయాడు, చివరికి..

ఆ రైలు ఏమైంది?: ఆ రైలు మెక్సికోలో కూడా కనిపించలేదు. అయితే.. అది ఘోస్ట్ రైలుగా.. ప్రపంచమంతా చక్కర్లు కొడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఎందుకంటే.. ఈ రైలు మన ఇండియాలో కూడా ట్రావెల్ చేసిందట. ఇటలీలో ఇప్పటికీ ఆ రైలు మార్గం సమీపం నుంచి వెళ్లేవారికి.. రైలు రూపంలో ఓ కాంతి కనిపిస్తుందని చెబుతుంటారు. అలాగే, జర్మనీ, రోమానియా, రష్యా, ఉక్రేయిన్‌లో కూడా ఈ రైలును కొంతమంది చూశారట. ఈ ఘటనను కట్టుకథ అని కొట్టిపడేయలేం. ఎందుకంటే.. రైలు మాయమైనట్లు అధికారులే స్వయంగా చెప్పారు. మరీ, ఈ మిస్టరీని ‘రాధేశ్యామ్’లో ప్రభాస్ ఛేదిస్తాడో లేదో.. ‘‘I know what happened, But.. I can't tell’’ అని దాటవేస్తాడో చూడాలి.

Note: ఇది ‘ఏబీపీ దేశం’ ఒరిజినల్ కంటెంట్. కాపీరైట్స్ కింద చర్యలు తీసుకోబడతాయి. 

Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్

Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!

Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)

Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..

Published at : 24 Dec 2021 05:10 PM (IST) Tags: Radhe Shyam Italy's mysterious train Italy Missing Train Missing Train Mystery Zanetti Train ఇటలీ ట్రైన్ Radhe Shyam Story

సంబంధిత కథనాలు

Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్

Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్

Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ

Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్

Dasara Movie Controversy : వివాదంలో ‘దసరా’ మూవీ, ఆ సీన్లు తొలగించాలంటూ అంగన్ వాడీల ఆందోళన

Dasara Movie Controversy : వివాదంలో ‘దసరా’ మూవీ, ఆ సీన్లు తొలగించాలంటూ అంగన్ వాడీల ఆందోళన

Sai Dharam Tej On Accident : మాట విలువ తెలిసింది... ప్రమాదం ఓ పీడకల కాదు, అదొక స్వీట్ మెమరీ - సాయి ధరమ్ తేజ్

Sai Dharam Tej On Accident : మాట విలువ తెలిసింది... ప్రమాదం ఓ పీడకల కాదు, అదొక స్వీట్ మెమరీ - సాయి ధరమ్ తేజ్

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు