ఓ మై గాడ్.. గాలిపటంతోపాటు గాల్లోకి ఎగిరిపోయాడు, చివరికి..
ఓ వ్యక్తి గాలిపటంతో సహా గాల్లోకి ఎగిరిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.
గాలి పటాలు ఎగరేస్తున్నారా? అయితే జాగ్రత్త.. ఆ గాలిపటంతో మీరు కూడా ఎగిరిపోవచ్చు. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే, ఈ వీడియో చూడాల్సిందే. శ్రీలంకలోని ఓ వ్యక్తి గాలిపటంతోపాటు గాల్లోకి ఎగిరిపోయాడు. సుమారు 30 అడుగులు పైకి ఎగిరిపోవడంతో.. అతడు కిందికి దిగలేని పరిస్థితి ఏర్పడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శ్రీలంకలో పొంగల్ సందర్భంగా గాలిపటాలు ఎగరవేస్తుంటారు. రంగు రంగుల గాలిపటాలను తయారు చేసి ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు. మన దేశంలో దక్షిణాది రాష్ట్రాల తరహాలోనే శ్రీలంకలో కూడా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో జఫ్నాలోని పెడ్రోలో నదరశ మనోహరన్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి గాలిపటాలను ఎగరేయడానికి వెళ్లాడు. అయితే, అది చాలా పెద్ద గాలిపటం కావడంతో ఆరుగురు తాడును పుట్టకోవలసి వచ్చింది. ఈ సందర్భంగా మనోహరన్ కాస్త ముందుకెళ్లి గాలి పటం తాడును పట్టుకున్నాడు. గాలిపటం ఒక్కసారే గాల్లోకి లేవడంతో మనోహరన్ కూడా గాల్లోకి లేచాడు. దాదాపు 30 అడుగుల ఎత్తుకు ఎగిరిపోయాడు.
ఆ తర్వాత మనోహార్‌కు అతడికి స్నేహితులకు ఏం చేయాలో అర్థం కాలేదు. గాలిపటాన్ని వదిలేస్తే అతడు కూడా నింగిలోకి ఎగిరిపోయే ప్రమాదం ఉంది. ఒక వేళ దాన్ని మనోహర్ భయంతో కట్ చేస్తే.. 30 అడుగుల ఎత్తు నుంచి కిందపడతాడు. దీంతో అతడి స్నేహితులు మనోహరన్‌కు కంగారుపడొద్దని చెప్పారు. అయితే, మనోహర్.. గాలి పటం తాడును పట్టుకుని నెమ్మదిగా కిందకు వచ్చాడు. కొన్ని అడుగుల ఎత్తులో ఉండగానే మనోహర్ కిందకి దూకేశాడు. ఈ ఘటనలో అతడికి ఎలాంటి గాయాలు కాలేదు.
2020లో కూడా ఇండోనేసియాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలుడు పెద్ద గాలిపటాన్ని పట్టుకుని 30 అడుగుల ఎత్తుకు ఎగిరిపోయాడు. అంత ఎత్తు నుంచి కిందపడటంతో ఆ బాలుడికి చేయి విరిగింది. ఆరో చోట్ల ఎముక చిట్లింది. కాబట్టి.. ఇకపై మీరు గాలిపటాలు ఎగరేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
Read Also: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క
Read Also: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..
Read Also: ఈ ఏడాది మనదేశంలో ఎక్కువ మంది వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే
Read Also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి