Snake On Head: వీడియో: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం
ఇంట్లో హెయిర్ బ్యాండ్ కనిపించలేదని.. ఆమె ఏకంగా పామునే తలకు కట్టేసుకుని వచ్చేసింది. ఆమెను చూసి అంతా హడలిపోయారు.
పామును జస్ట్ చూస్తే చాలు.. ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది ఆమె ఏకంగా పాముతో జుట్టును ముడివేసుకుంది. అంతటితో ఆగకుండా ఆ కొప్పుతోనే షాపింగ్ కూడా చేసింది. ఆమెను అలా చూసి అక్కడి జనం హడలిపోయారు. ఆమెకు ఇదేం పోయేకాలమంటూ తిట్టుకున్నారు. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది.
ఇన్‌స్టాగ్రామ్‌లోని Snake World అనే పేజ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఆమెకు ఇంట్లో హెయిర్ బ్యాండ్ కనిపించలేదో ఏమో. తన పెంపుడు పాముతో తలను కొప్పులా చుట్టుకుని షాపింగ్‌కు బయల్దేరింది. ఆమె మాల్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే.. అంతా అదేదో వెరైటీ హెయిర్ బ్యాండ్ అనుకున్నారు. అచ్చం పాములాగే ఉందనుకున్నారు. అయితే, అది అటూ ఇటూ తలాడిస్తూ.. నేను పామునే అని చెప్పడంతో కస్టమర్లు షాకయ్యారు. ఎంత హెయిర్ బ్యాండ్ కనిపించకపోతే మాత్రం నిజమైనా పాముతో అలా తలను ముడివేసుకుంటారా అంటూ ఆమెను తిట్టుకున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు సుమారు 15 వేల మంది వీక్షించారు.
View this post on Instagram
Read Also: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క
Read Also: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..
Read Also: ఈ ఏడాది మనదేశంలో ఎక్కువ మంది వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే
Read Also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి