Ghani Release date: పవన్ కల్యాణ్ వెనుక వరుణ్ తేజ్... 'గని' రిలీజ్ డేట్ ఫిక్స్!
బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా 'గని'. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త విడుదల తేదీ ఖరారు అయ్యింది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా నటించిన సినిమా 'గని' (Ghani Movie). తొలుత ఈ నెల (డిసెంబర్) 24న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే... ఆ రోజున వేరే సినిమాలు విడుదల అవుతుండటంతో మిగతా సినిమా వసూళ్లపై ప్రభావం పడకూడని వాయిదా వేశారు. ఓటీటీలో కాకుండా థియేటర్లలో మాత్రమే సినిమా విడుదల అవుతుందని స్పష్టం చేశారు. తాజాగా సినిమా విడుదల తేదీ (Ghani Movie Release Date) ఖరారు చేశారు. వచ్చే ఏడాది మార్చి 25న సినిమా విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది.
'బాలు' సినిమాలో పవన్ కల్యాణ్ క్యారెక్టర్ పేరు గని. వరుణ్ తేజ్ సినిమాకు ఆ పేరే పెట్టారు. సినిమా పేరులోనే కాదు... విడుదల విషయంలోనూ పవన్ కల్యాణ్ వెనుకే వరుణ్ తేజ్ వస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన 'భీమ్లా నాయక్' ఫిబ్రవరి 25కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. 'భీమ్లా నాయక్' వచ్చిన మూడు వారాల తర్వాత వరుణ్ తేజ్ 'గని' వస్తోంది.
Giving you my word...
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) December 25, 2021
It's worth the wait..🥊
Wishing you all a Merry Christmas.#Ghani #GhaniOnMarch18th pic.twitter.com/c517lHBAZj
#Ghani is ready to pack the knock-out punch 🥊
— Geetha Arts (@GeethaArts) December 25, 2021
Worldwide grand release in theaters on MARCH 18th 2022.🤩 #GhaniOnMarch18th @IAmVarunTej @IamJagguBhai @nimmaupendra @SunielVShetty @saieemmanjrekar @dir_kiran @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu @adityamusic pic.twitter.com/7cB879qPtr
కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ... అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ 'గని' నిర్మిస్తున్నారు. ఇందులో సయీ మంజ్రేకర్ కథానాయిక. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు నటించారు.
Also Read: తొడ కొట్టిన బాలయ్య... తగ్గేదే లే!
Also Read: భీమ్లా నాయక్... పవన్ కల్యాణ్ కోసం త్రివిక్రమ్ స్పెషల్ క్లైమాక్స్!
Also Read: '83' మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
Also Read: తల్లిదండ్రులకు ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టిస్తున్న 'చమ్మక్' చంద్ర...
Also Read: 'శ్యామ్ సింగ రాయ్' రివ్యూ: తిరగబడిన సంగ్రామమా? ఎగసిపడిన అలజడా?
Also Read: ఇక తెలుగులో 24 గంటల బిగ్‌బాస్.. నాన్‌స్టాప్ బాదుడే!
Also Read: 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు' రివ్యూ: సినిమా ఎలా ఉంది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి