Nani: టాలీవుడ్ లో యూనిటీ లేదు.. వైరల్ అవుతోన్న నాని వ్యాఖ్యలు
'శ్యామ్ సింగరాయ్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏపీలో టికెట్ రేట్ ఇష్యూ గురించి మాట్లాడారు నాని.

నేచురల్ స్టార్ నానికి జనాల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ ఇలా అందరూ నానికి అభిమానులే. అతడి సినిమాలు జనాలకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటాయి. రీసెంట్ గా ఈ హీరో నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమా విడుదల కాగా.. దానికి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. వీకెండ్ లో ఈ సినిమా మరిన్ని వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. 'శ్యామ్ సింగరాయ్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏపీలో టికెట్ రేట్ ఇష్యూ గురించి మాట్లాడారు నాని. థియేటర్లో కలెక్షన్స్ కంటే.. కిరాణా షాప్ లో మంచి కలెక్షన్స్ వస్తున్నాయంటూ కామెంట్స్ చేశారు. ఈ విషయంలో చాలా మంది నానిని సపోర్ట్ చేయగా.. ఏపీ మంత్రులు మాత్రం నానిని విమర్శించారు. తాజాగా మరోసారి ఈ విషయంపై మాట్లాడారు నాని. తన అభిప్రాయం చెబితే.. దాన్ని చీల్చి పెద్ద ఇష్యూ చేశారని అన్నారు నాని.
సమస్య అనేది నిజమని.. అది వచ్చినప్పుడు అందరూ ఒకటికావాల్సిన అవసరం ఉందని.. కానీ టాలీవుడ్ లో అలాంటి పరిస్థితి లేదని అన్నారు నాని. తన మాటలు తప్పయితే తనకు ఆనందమే అని.. కానీ టాలీవుడ్ లో మాత్రం యూనిటీ లేదని చెప్పారు. ఎవరినీ అవమానించడానికి ఈ మాటలు అనడం లేదని తెలిపారు. 'వకీల్ సాబ్' సినిమా సమయంలో ఈ సమస్య మొదలైనప్పుడు అందరూ అప్పుడే ఒక పేజ్ లోకి వచ్చి.. సమస్యను డీల్ చేసి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చి ఉండేవి కావని.. తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టాలీవుడ్ వాళ్లకు ఐక్యత లేదంటూ నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై మన స్టార్స్ ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం!
Also Read:యూవీ క్రియేషన్స్ లో నవీన్ పోలిశెట్టి.. అనుష్కకు జంటగా..
Also Read: 'మా రెండు కుటుంబాల మధ్య 35 ఏళ్ల పోరు..' మెగా,నందమూరి ఫ్యామిలీలపై ఎన్టీఆర్ కామెంట్స్..
Also Read:సల్మాన్ కి 'నాటు' స్టెప్స్ నేర్పించిన ఎన్టీఆర్, చరణ్..
Also Read:అవమానకర రీతిలో డాన్స్.. సన్నీలియోన్ ను ఇండియా నుంచి తరిమేయమంటూ ఫైర్..
Also Read:పవన్ కి సపోర్ట్ చేసి ఉంటే.. పరిస్థితి ఇలా ఉండేదా..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















