Sunny: సన్నీకి మాధవీలత వార్నింగ్.. అతడు కనిపిస్తే చెంప పగలగొడతా అంటూ ఫైర్..
బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీకి ఓట్లు వేయమని చెప్పిన మాధవీలత.. ఇప్పుడు అతడిని తిట్టిపోసింది.
ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 5 ముగిసింది. కానీ ఇప్పటికీ కంటెస్టెంట్ల హడావిడి మాత్రం కొనసాగుతూనే ఉంది. టాప్ 5 కంటెస్టెంట్స్ వరుసగా టీవీ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారారు. అయితే సన్నీ మాత్రం తనకు అందంగా నిలబడ్డ ఫ్యాన్స్ ను కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు మొదలయ్యాయి. అతడి విజయంలో కీలకపాత్ర పోషించిన ఫ్యాన్ పేజీలు, కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వంక ఆయన అసలు చూడడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
కేవలం కొన్ని టీవీ ఛానెల్స్ కి మాత్రం ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ హడావిడి చేస్తున్నాడని.. తన సక్సెస్ కోసం పోరాడిన ఫ్యాన్ పేజీలకు కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదట. ఈ విషయం నటి మాధవీలతకు తెలియడంతో ఆమె ఫైర్ అయింది. సన్నీకి ఓట్లు వేయమని చెప్పిన ఆమె.. ఇప్పుడు అతడిని తిట్టిపోసింది.
సన్నీ కోసం సపోర్ట్ చేసిన ఫ్యాన్ పేజీలను వదిలేసి, ఓట్లు వేయడానికి వాళ్లు పడ్డ కష్టాన్ని వదిలేసి.. బడా టీవీ ఛానెల్స్ కి, ఎక్కువ ఫాలోవర్లు ఉన్న యూట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడని.. ఈ విషయంలో సన్నీ తప్పు చేస్తున్నాడని చెప్పింది మాధవీలత. బిగ్ బాస్ షోలో సన్నీ నిజాయితీ మెచ్చి ఎంత ప్రమోట్ చేశానో.. ఇప్పుడు తను చేస్తున్న తప్పుని కూడా ఎత్తి చూపిస్తానని తెలిపింది. కృతజ్ఞతాభావం లేని వాళ్లంటే తనకు చిరాకని మండిపడింది.
'నీకోసం పర్సనల్ పీఆర్‌లా పనిచేసిన వాళ్లకు లైవ్ అడిగితే దొరక్కుండా.. పెద్ద ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నావ్. నీ ఫ్యాన్ పేజెస్ ను మెయింటైన్ చేసినవాళ్లను ముందు కలవాలి. నీ పీఆర్ ఫ్రెండ్ కనిపిస్తే చెంప పగలగొడతాను. సాధారణ జనాలకు విలువ ఇవ్వకపోతే అక్కడే ఆగిపోతావు గుర్తుపెట్టుకో.. వారం రోజులవుతున్నా ఇంకా టాప్ ఛానెల్స్ తోనే బిజీగా ఉండడం తప్పు. నాకు నచ్చట్లేదు. నాకు కోపం వస్తే అదే మీడియాలో నిలబెట్టి కడిగేస్తా. నచ్చితే నెత్తిన పెట్టుకుంటా.. తిక్కలేస్తే తాటతీసి ఆరేస్తా' అంటూ వార్నింగ్ ఇచ్చింది మాధవీలత. మరి దీనిపై సన్నీ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి!
Also Read:అవమానకర రీతిలో డాన్స్.. సన్నీలియోన్ ను ఇండియా నుంచి తరిమేయమంటూ ఫైర్..
Also Read:పవన్ కి సపోర్ట్ చేసి ఉంటే.. పరిస్థితి ఇలా ఉండేదా..?
Also Read:'ఆర్ఆర్ఆర్'కి పెద్ద దెబ్బే.. కలెక్షన్స్ పై ఎఫెక్ట్ తప్పదు..
Also Read:స్టార్ కమెడియన్ కి ఒమిక్రాన్..? హాస్పిటల్ లో ట్రీట్మెంట్..
Also Read:హీరోయిన్ తో ఆమిర్ ఖాన్ సీక్రెట్ మ్యారేజ్.. అసలు నిజమిదే..
Also Read: పవన్ కల్యాణ్ వెనుక వరుణ్ తేజ్... 'గని' రిలీజ్ డేట్ ఫిక్స్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి