RRR: సల్మాన్ కి 'నాటు' స్టెప్స్ నేర్పించిన ఎన్టీఆర్, చరణ్..
రీసెంట్ గా హిందీ బిగ్ బాస్ షోలో రాజమౌళితో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియాభట్ సందడి చేశారు. సల్మాన్ హోస్ట్ చేస్తోన్న ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్రోమోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సాధిస్తూ.. రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం 'ఆర్ఆర్ఆర్' టీమ్ ముంబై, చెన్నై, బెంగుళూరు ఇలా చాలా ప్రాంతాలకు తిరుగుతోంది.
ముఖ్యంగా ముంబైలో ఈ సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే కపిల్ శర్మ కామెడీ షోలో 'ఆర్ఆర్ఆర్' టీమ్ కనిపించి అల్లరి చేసింది. రీసెంట్ గా హిందీ బిగ్ బాస్ షోలో రాజమౌళితో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియాభట్ సందడి చేశారు. సల్మాన్ హోస్ట్ చేస్తోన్న ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్రోమోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
హోస్ట్ సల్మాన్ తో కలిసి తారక్, రామ్ చరణ్, అలియాభట్ 'నాచో నాచో'(తెలుగులో నాటు నాటు)సాంగ్ కి డాన్స్ చేశారు. సల్మాన్ ఖాన్ కి స్టెప్స్ ఎలా వేయాలో ఈ ఇద్దరు హీరోలు నేర్పించారు. ఎప్పటికైనా.. ఎన్టీఆర్, చరణ్ ల డాన్స్ చేస్తానని అలియాకు ప్రామిస్ చేశారు సల్మాన్. కాసేపటికి రాజమౌళితో కూడా ఈ పాటకి స్టెప్స్ వేయించారు. తారక్, చరణ్, రాజమౌళి, సల్మాన్ కలిసి డాన్స్ చేసి ఫ్యాన్స్ ను అలరించారు. ఇదే ఎపిసోడ్ లో సల్మాన్ ఖాన్ పుట్టినరోజు వేడుకలకు కూడా నిర్వహించారు.
View this post on Instagram
Also Read:అవమానకర రీతిలో డాన్స్.. సన్నీలియోన్ ను ఇండియా నుంచి తరిమేయమంటూ ఫైర్..
Also Read:పవన్ కి సపోర్ట్ చేసి ఉంటే.. పరిస్థితి ఇలా ఉండేదా..?
Also Read:'ఆర్ఆర్ఆర్'కి పెద్ద దెబ్బే.. కలెక్షన్స్ పై ఎఫెక్ట్ తప్పదు..
Also Read:స్టార్ కమెడియన్ కి ఒమిక్రాన్..? హాస్పిటల్ లో ట్రీట్మెంట్..
Also Read:హీరోయిన్ తో ఆమిర్ ఖాన్ సీక్రెట్ మ్యారేజ్.. అసలు నిజమిదే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి