Naveen Polishetty: త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ లో నవీన్.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..
ఈరోజు నవీన్ పుట్టినరోజు కానుకగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి విషెస్ చెప్పింది సితార ఎంటర్టైన్మెంట్స్.
అప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు ఈ కుర్ర హీరో. ఆ తరువాత 'జాతిరత్నాలు' అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాండమిక్ లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. నవీన్ కామెడీ టైమింగ్, పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
దీంతో అతడికి టాలీవుడ్ లో అవకాశాలు పెరిగిపోయాయి. ఒక్కో సినిమాను అనౌన్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈరోజు అతడి పుట్టినరోజు కావడంతో యూవీ క్రియేషన్స్ సంస్థ బర్త్ డే విషెస్ చెబుతూ.. తమ ప్రొడక్షన్ లో నవీన్ పోలిశెట్టి సినిమా చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ లో అనుష్క శెట్టితో కలిసి నటించబోతున్నాడు నవీన్.
ఇదిలా ఉండగా.. కొన్నిరోజుల క్రితమే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నవీన్ ఓ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. ఈ సినిమాపై త్రివిక్రమ్ కూడా పెట్టుబడి పెట్టబోతున్నారు. ఆయన భార్య పేరుని నిర్మాతగా వేశారు. ఈ సినిమాతో కళ్యాణ్ శంకర్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు.
అయితే ఈరోజు నవీన్ పుట్టినరోజు కానుకగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి విషెస్ చెప్పింది సితార ఎంటర్టైన్మెంట్స్. సింహాసనంపై పంచె కట్టుకొని స్టైలిష్ గా పోజిచ్చాడు నవీన్. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా దీన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో నవీన్ పోలిశెట్టి కామెడీ ఓ రేంజ్ లో ఉండబోతుందని టాక్. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయబోతున్నట్లు ప్రకటించారు దర్శకనిర్మాతలు.
The Entertainer is coming back to deliver the entertainment royale 👑😍
— Sithara Entertainments (@SitharaEnts) December 26, 2021
Wishing a very Happy Birthday to the young sensation @naveenpolishety ❤️
Title out soon! 🤩#HBDNaveenpolishetty #NaveenPolishetty4 @kalyanshankar23 @vamsi84 #SaiSoujanya @Fortune4Cinemas pic.twitter.com/1fXTs66Bam
Also Read: ఏపీలో థియేటర్లు క్లోజ్.. నిఖిల్ ఎమోషనల్ పోస్ట్..
Also Read:సల్మాన్ ఖాన్ కి పాముకాటు.. హాస్పిటల్ లో ట్రీట్మెంట్..
Also Read:టాలీవుడ్ లో యూనిటీ లేదు.. వైరల్ అవుతోన్న నాని వ్యాఖ్యలు
Also Read:యూవీ క్రియేషన్స్ లో నవీన్ పోలిశెట్టి.. అనుష్కకు జంటగా..
Also Read: 'మా రెండు కుటుంబాల మధ్య 35 ఏళ్ల పోరు..' మెగా,నందమూరి ఫ్యామిలీలపై ఎన్టీఆర్ కామెంట్స్..
Also Read:సల్మాన్ కి 'నాటు' స్టెప్స్ నేర్పించిన ఎన్టీఆర్, చరణ్..t
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి