అన్వేషించండి

Yearender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం

కొత్త సంవత్సరం రాబోతోంది. ఏదేమైనా 2021 ఏడాదిలో భారత రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయి. ప్రధాని నరేంద్రమోదీ సంచలన నిర్ణయాలతో ఆశ్చర్యపరిచారు. అందులో ఐదు ప్రకటనలు ఊహించనవి. అవే..!

మరికొన్ని రోజుల్లో 2021 ముగిసిపోతుంది. కొత్త సంవత్సరం రాబోతోంది. ఏదేమైనా 2021 ఏడాదిలో భారత రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయి. ప్రధాని నరేంద్రమోదీ సంచలన నిర్ణయాలతో ఆశ్చర్యపరిచారు. అందులో ఐదు ప్రకటనలు ఊహించనవి. అవే..!

1. National Hydrogen Mission - హైడ్రోజన్‌ మిషన్‌
ఈ ఏడాది స్వాత్రంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని నరేంద్రమోదీ జాతీయ హైడ్రోజన్‌ మిషన్‌ను ఆరంభించారు. దేశంలో వాతావరణ సంక్షోభం రాకుండా అడ్డుకొనేందుకు గ్రీన్‌ హైడ్రోజన్‌ ఎలా సాయపడుతోందో ఆయన వివరించారు. ప్రపంచంలోనే అత్యధిక గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి హబ్‌గా భారత్‌ను మార్చాలని, ఎక్కువ ఉద్యోగాలు సృష్టించాలన్నది ఈ మిషన్‌ లక్ష్యం.

2. Repeal of farm laws - వ్యవసాయ చట్టాల రద్దు
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటుందని ఎవ్వరూ భావించలేదు. అలాంటి సమయంలో హఠాత్తుగా ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ప్రజలు, రైతులకు క్షమాపణలు చెప్పారు. ఈ చట్టాల ప్రయోజనాలను రైతులకు సరిగ్గా వివరించలేక పోయామని, వారిని ఒప్పించడంలో విఫలమయ్యామని వెల్లడించారు.

Yearender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం

3. Sainik schools for girls - బాలికలకు సైనిక్‌ పాఠశాలలు
తల్లిదండ్రులు తమ కుమారులను సైనిక్‌ పాఠశాలల్లో చేర్పించేందుకు ఎంత ఆరాట పడతారో తెలియని కాదు. ఇందులో కేవలం బాలురకే ప్రవేశం. అలాంటిది 2021-22 సెషన్‌ నుంచి బాలికలకు సైనిక్‌ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తూ మోదీ నిర్ణయం తీసుకున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో 33 సైనిక్‌ పాఠశాలలు ఉన్నాయి. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, ఇండియన్‌ నావల్‌ అకాడమీలో ప్రవేశాలకు యువతను సిద్ధం చేయడమే వీటి లక్ష్యం.

4. Gati Shakti - National Master Plan - గతి శక్తి యోజన
ప్రధాని మోదీ ప్రకటించిన మరో భారీ ప్రాజెక్ట్‌ 'గతి శక్తి యోజన'. స్థానిక వ్యాపారులను అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేసేందుకు రూ.100 కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రకటించారు. అన్ని రకాల అవాంతరాలను అధిగమించి ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే ఈ ప్రణాళిక ఉద్దేశం.

5. 75 Vande Bharat Trains - వందే భారత్‌ రైళ్లు
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 75 వందే భారత్‌ రైళ్లను ప్రకటించారు. స్వాత్రంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తైన సందర్భంగా 75 రైళ్లను ప్రకటించారు. దేశంలోని మూలమూలలను కలపడమే ఈ రైళ్ల ఉద్దేశం.

Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్‌ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్‌!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HCU Controversy: ఫ్యూచర్ సిటీకి HCU తరలింపు - కంచ గచ్చిబౌలి, వర్శిటీ స్థలాల్లో అతి పెద్ద ఎకోపార్క్ - రేవంత్ సంచలనం
ఫ్యూచర్ సిటీకి HCU తరలింపు - కంచ గచ్చిబౌలి, వర్శిటీ స్థలాల్లో అతి పెద్ద ఎకోపార్క్ - రేవంత్ సంచలనం
Nagababu Pithapuram Tour: పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
Tirumala News: శ్రీవారి సేవల్లో పాల్గొనేందుకు మరో స్కీమ్ తెచ్చిన టీటీడీ - ఆ పనిచేస్తే సుప్రభాత సేవ నుంచి వేద ఆశీర్వచనం వరకూ
శ్రీవారి సేవల్లో పాల్గొనేందుకు మరో స్కీమ్ తెచ్చిన టీటీడీ - ఆ పనిచేస్తే సుప్రభాత సేవ నుంచి వేద ఆశీర్వచనం వరకూ
NTR: 'ఆయన ఓ గొప్ప నటుడు, మంచి టీమ్ మేట్' - ఎన్టీఆర్‌‌తో 'వార్ 2'పై బాలీవుడ్ హీరో హృతిక్ ఏమన్నారంటే?
'ఆయన ఓ గొప్ప నటుడు, మంచి టీమ్ మేట్' - ఎన్టీఆర్‌‌తో 'వార్ 2'పై బాలీవుడ్ హీరో హృతిక్ ఏమన్నారంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni May Lead CSK vs DC IPL 2025 | కెప్టెన్ రుతురాజ్ కు గాయం..ఢిల్లీతో మ్యాచ్ కు దూరం..?Rishabh Pant Failures in IPL 2025 |  LSG vs MI మ్యాచులోనూ చెత్తగా అవుటైన పంత్Hardik Pandya vs LSG IPL 2025 |  LSG తో మ్యాచ్ లో పాండ్యా ఏం చేసినా గెలవలేదుTilak Varma Retired out | LSG vs MI మ్యాచ్ లో అతి చెత్త నిర్ణయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HCU Controversy: ఫ్యూచర్ సిటీకి HCU తరలింపు - కంచ గచ్చిబౌలి, వర్శిటీ స్థలాల్లో అతి పెద్ద ఎకోపార్క్ - రేవంత్ సంచలనం
ఫ్యూచర్ సిటీకి HCU తరలింపు - కంచ గచ్చిబౌలి, వర్శిటీ స్థలాల్లో అతి పెద్ద ఎకోపార్క్ - రేవంత్ సంచలనం
Nagababu Pithapuram Tour: పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
Tirumala News: శ్రీవారి సేవల్లో పాల్గొనేందుకు మరో స్కీమ్ తెచ్చిన టీటీడీ - ఆ పనిచేస్తే సుప్రభాత సేవ నుంచి వేద ఆశీర్వచనం వరకూ
శ్రీవారి సేవల్లో పాల్గొనేందుకు మరో స్కీమ్ తెచ్చిన టీటీడీ - ఆ పనిచేస్తే సుప్రభాత సేవ నుంచి వేద ఆశీర్వచనం వరకూ
NTR: 'ఆయన ఓ గొప్ప నటుడు, మంచి టీమ్ మేట్' - ఎన్టీఆర్‌‌తో 'వార్ 2'పై బాలీవుడ్ హీరో హృతిక్ ఏమన్నారంటే?
'ఆయన ఓ గొప్ప నటుడు, మంచి టీమ్ మేట్' - ఎన్టీఆర్‌‌తో 'వార్ 2'పై బాలీవుడ్ హీరో హృతిక్ ఏమన్నారంటే?
Rishabh Pant Fine: లక్నో కెప్టెన్ పంత్, బౌలర్ దిగ్వేష్ సింగ్‌కు బీసీసీఐ షాక్- రూల్స్ ఉల్లంఘనతో జరిమానా
లక్నో కెప్టెన్ పంత్, బౌలర్ దిగ్వేష్ సింగ్‌కు బీసీసీఐ షాక్- రూల్స్ ఉల్లంఘనతో జరిమానా
Telangana VS Andhra Pradesh: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
Alekhya Chitti: తప్పు చేశా... తిట్టినోళ్లు అందరికీ సారీ - దీనంగా ఫేస్ పెట్టి క్షమాపణలు కోరిన అలేఖ్య చిట్టి
తప్పు చేశా... తిట్టినోళ్లు అందరికీ సారీ - దీనంగా ఫేస్ పెట్టి క్షమాపణలు కోరిన అలేఖ్య చిట్టి
Bandi sanjay Letter: టీటీడీ ఛైర్మన్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ, అందులో ఏముందంటే..
టీటీడీ ఛైర్మన్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ, అందులో ఏముందంటే..
Embed widget