Actress Suicide: ఆ కేసులో ఇరికిస్తారనే భయంతో యువనటి ఆత్మహత్య.. అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంతో దారుణం.. చివర్లో ట్విస్ట్
Mumbai Actress Suicide: పార్టీకి వెళ్లడమే యువనటి పాలిట శాపంగా మారింది. అధికారులు ఆమెను కలిసి డబ్బులు డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని బెదిరించడంతో ఆత్మహత్య చేసుకుంది.
గత కొన్నేళ్లుగా టాలీవుడ్, బాలీవుడ్, శాండల్‌వుడ్, కోలీవుడ్ ఇతర సినీ పరిశ్రమలను వేధిస్తున్న సమస్య మాదక ద్రవ్యాలు (డ్రగ్స్). ప్రస్తుతం మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (NCB), ముంబై పోలీసులు డ్రగ్స్ కేసు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఓ యువనటి ప్రాణాలు కోల్పోయింది. అది కూడా నకిలీ అధికారుల వేధింపులే ఆమె ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
బాలీవుడ్‌లో సుఖేష్ చంద్రశేఖర్ కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను సైతం విచారించారు. మరికొందరు నటీనటులకు నోటీసులు జారీ అయ్యాయి. ఇదే ఛాన్స్ అనుకుని కొందరు వ్యక్తులు ఎన్సీబీ అధికారులమని చెప్పుకుని ముంబైకి చెందిన 28 ఏళ్ల నటిని సంప్రదించారు. డిసెంబర్ 20వ తేదీన ఆ నటి తన ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి ఫైవ్ స్టార్ హోటల్‌లో హుక్కా పార్లర్ పార్టీకి వెళ్లింది. అదే ఆమె పాలిట శాపంగా మారుతుందని ఊహించలేకపోయింది. పార్టీకి హాజరైన ఇద్దరు నకిలీ అధికారులు సూరజ్ పర్దేశి, ప్రవీణ్ వాలింబే నటిని సంప్రదించి.. డబ్బులు డిమాండ్ చేశారు. మాదకద్రవ్యాల కేసులో ఆమె పేరు లేకుండా చేయాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని ఇద్దరు నకిలీ అధికారులు నటిని బెదిరించారు.
నటిని నేరుగా కలిసిన తరువాత డబ్బులు ఇస్తావా లేక డ్రగ్స్ కేసులో పేరు చేర్చాలా అని ఫోన్ చేసి వేధించారు. డబ్బులు సర్దుబాటు కాక, మరోవైపు డ్రగ్స్ కేసులో తనను ఇరికిస్తారేమోనని భయాందోళనకు గురైన నటి బలవన్మరణం చెందింది. వాళ్లు నికిలీ అధికారులు అని తెలియక.. డబ్బు కోసం వాళ్లు చేస్తున్న ఫోన్ కాల్స్, డ్రగ్స్ కేసులో ఇరికిస్తామనే బెదిరింపులు తట్టుకోలేక నటి గురువారం నాడు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా థానేలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని.. వారిపై సెక్షన్ 306, 170, 388, 384, 506, 120బి కింద కేసులు నమోదు చేసినట్లు డీసీపీ మంజునాథ్ సింఘే తెలిపారు.
నిందితులు నటిని సంప్రదించి తొలుత భారీ మొత్తంలో డిమాండ్ చేశారని తెలుస్తోంది. నార్కోటిక్స్ కేసులో ఆమె పేరు చేర్చకుండా ఉండాలంటే రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని.. ఆపై రూ.20 లక్షలకు ఫైనల్ చేసుకున్నారు. డబ్బు సర్దుబాటు చేయాలన్న ఇబ్బంది ఒకవైపు, డ్రగ్స్ కేసులో తనను అన్యాయంగా ఇరికిస్తున్నారని ఆందోళనకు గురైన నటి ముంబైలో అద్దెకు ఉంటున్న గదిలో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వివరించారు.
నటి ఆత్మహత్య ఘటనపై మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్ మాలిక్ స్పందించారు. ప్రైవేట్ వ్యక్తులతో చేతులు కలిపి ఎన్‌సీబీ ఇలా సెలబ్రిటీలను బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తుందని ఆరోపించారు. నటి బలవన్మరణంవ చెందడం చాలా బాధాకరమన్నారు. ఎన్‌సీబీ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సెలబ్రిటీలను డబ్బులు డిమాండ్ చేస్తుందనే అభియోగాలపై సైతం దర్యాప్తు చేపట్టాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇదివరకే కొందరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారని నవాబ్ మాలిక్ పేర్కొన్నారు.
Also Read: Shanmukh: 'ఫాలో.. అన్‌ఫాలో కాదు.. నేనే గ్యాప్ ఇచ్చా..' దీప్తితో పెళ్లిపై షణ్ముఖ్ క్లారిటీ..
Also Read:టాలీవుడ్ లో యూనిటీ లేదు.. వైరల్ అవుతోన్న నాని వ్యాఖ్యలు
Also Read: Year Ender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం