Saving Money Tips: డబ్బు ఆదా చేయాలా..? ఈ 20 టిప్స్ పాటించి చూడండి.. మీ దశ తిరిగినట్టే..
డబ్బు ఎంత సంపాదించినా మిగలడం లేదని ఫీల్ అవుతున్నారా? డబ్బు ఆదా చేసుకునే మార్గాలేంటి? అని ఆలోచిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఈ 20 టిప్స్ పాటించి చూడండి..
డబ్బు ఎంత సంపాదించినా మిగలడం లేదని ఫీల్ అవుతున్నారా? డబ్బు ఆదా చేసుకునే మార్గాలేంటి? అని ఆలోచిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. డబ్బు ఎలా ఆదా చేసుకోవాలనే అంశానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు పలు సలహాలు అందించారు. అందులో ఒక బెస్ట్ 20 టిప్స్ మీకోసం..
1. టైమ్ లిమిట్ పెట్టుకోండి..
షాపింగ్ చేసేటప్పుడు క్రియేటివిటీ మన ఖర్చులను తగ్గించగలదని.. ఫార్చ్యూన్ 500 టెక్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ బెక్కా పవర్స్ సూచించారు. 'మనం ఏమేం కొనాలనుకుంటున్నామో ముందుగానే (టార్గెట్) నిర్ణయించుకోవాలి. దానికి తగినట్లే షాపింగ్ చేయాలి. మనం ఇంత సేపు షాపింగ్ చేయాలని సమయాన్ని కూడా నిర్దేశించుకోవాలి. ఈ టైమ్ లిమిట్‌లోనే మన షాపింగ్ పూర్తి చేసేయాలి. చాలా మంది ఒకటి లేదా రెండు వస్తువులు కొనడానికని వెళ్లి.. అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కాబట్టి మనకేం అవసరమై వాటిని టార్గెట్‌గా పెట్టుకుని, నిర్దేశించిన సమయంలో షాపింగ్ పూర్తి చేయాలి' అని బెక్కా సూచించారు.
2. ఇదో హాబీలా చేయకండి..
షాపింగ్ అనేది చాలా మందికి భావోద్వేగాలతో కూడుకున్న అంశమని ద స్కూల్ బెట్టీ వ్యవస్థాపకురాలు బ్రియానా ఫైర్ స్టోన్ తెలిపారు. చాలా మంది తమకు ఏమీ తోచడం లేదనే కారణంతో షాపింగ్ చేస్తుంటారని చెప్పారు. 'ప్రస్తుత బిజీ యుగంలో కొద్ది క్షణాలు ఖాళీ దొరికినా షాపింగ్ చేయాలని అనుకుంటున్నారు. ఇదో హాబీలా భావిస్తున్నారు. మనం షాపింగ్ చేయాలనుకునే ముందు మనకీ వస్తువు వల్ల నిజంగా ఉపయోగం ఉందా? లేక బోర్ కొట్టి దీనిని కొంటున్నామా? అని ఆలోచించుకోండి. షాపింగ్‌ను హాబీలా కాకుండా ఆలోచనతో చేసి చూడండి. ఇలా మీకు మీరే ఆలోచించుకోవడం వల్ల ఊహించని మార్పులను గమనిస్తారు' అని బ్రియానా తెలిపారు.
Also Read: Aadhaar Card Update: ఆధార్ కార్డ్‌లో వివరాలు అప్‌డేట్ చేస్తున్నారా.. ఈ కొత్త రూల్ తెలుసుకోండి
3. సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనండి..
డబ్బు ఆదా చేయడం ద్వారా పర్యావరణానికి కూడా మేలు చేసినవారవుతారని టీస్ (Tise) అనే సోషల్ మార్కెట్ ప్లేస్ సీఈవో ఎరిక్ రైమ్ తెలిపారు. 'సెకండ్ హ్యాండ్ వస్తువుల వల్ల పర్యావరణం కలుషితం అవుతోంది. ధర ఎక్కువన్న వస్తువులను కొనుగోలు చేయడం కన్నా సెకండ్ హ్యాండ్ వాటిని కొనడం ద్వారా డబ్బుని ఆదా చేయడంతో పాటు పర్యావరణానికి మేలు చేసినట్లు అవుతుంది' అని ఎరిక్ చెప్పారు.
4. బడ్జెట్‌కు కళ్లెం వేసే యాప్‌లు..
బడ్జెట్‌కు కళ్లెం వేసే యాప్‌లను ఉపయోగించడం ద్వారా డబ్బును ఆదా చేయగలమని ఫిండర్ డాట్ కామ్ కంపెనీకి చెందిన జాన్ ఆస్ట్రర్ పేర్కొన్నారు. వీటిని ఉపయోగించడం ద్వారా మనకు ఉన్న బడ్జెట్లోనే వస్తువులను కొనగలమని చెప్పారు. ఈ ధరను బట్టి వస్తువులను డీల్స్ లో కొంటామని.. క్రమంగా డబ్బు ఆదా అవుతుందని తెలిపారు.
5. ఫ్రీ లాన్స్ ఆప్షన్ ఎంచుకోండి..
డబ్బు ఆదా చేయడానికి ఫ్రీ లాన్స్ బెస్ట్ ఆప్షన్ అని బిజినెస్ బ్యాంకింగ్ యాప్ అమేజ్ సంస్థ యూకే ఎండీ స్టీవ్ తక్లా సింగ్ అన్నారు. 'బిజినెస్ బ్యాంకింగ్ యాప్‌ల వల్ల మనం ఎంత ఖర్చు చేశామనే వివరాలు తెలుస్తాయి. ఇవి జనరేట్ చేసే ఇన్ వాయిస్లతో మన ఖర్చులను అంచనా వేయవచ్చు. వీటిని బట్టి అనవసర ఖర్చు తగ్గించవచ్చు' అని స్టీవ్ చెప్పారు.
6. క్యాష్ బ్యాక్ షాపింగ్ పోర్టల్ ఎంచుకోండి..
ప్రస్తుత ఆన్ లైన్ యుగంలో చాలా పోర్టల్స్ వచ్చాయి. ఒక్కో సమయంలో ఒక్కోదాంట్లో ఆఫర్లు ఉంటున్నాయి. మనం ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలనుకున్నప్పుడు దానిపై ఏదైనా పోర్టల్ లో ఆఫర్లు ఉన్నాయేమో చూడండి. ఈ ఆఫర్లను వినియోగించడం ద్వారా డబ్బును మిగుల్చుకోవచ్చు.
7. సేవింగ్స్ ని నాన్ నెగోషిబుల్ బిల్లులాగా భావించండి..
మనం సేవ్ చేసుకున్న డబ్బును నాన్ నెగోషిబుల్ బిల్లులాగా భావించాలని మై మనీ మూవ్‌మెంట్ సంస్థకు చెందిన కింబెర్లీ ఉజ్జెల్ తెలిపారు. 'ప్రతి నెలా మనం కరెంట్ బిల్లు, సెల్ ఫోన్ పేమెంట్లు వంటి వాటిని కడుతుంటాం. ఇవి తప్పనిసరిగా చేస్తాం. మనం షాపింగ్‌లో ఆదా అయిన డబ్బులను కూడా అలానే పరిగణించండి. పైన చెప్పిన రెండు బిల్లులను ఎలాగైతే కచ్చితంగా కడుతున్నామో వీటిని కూడా అలాగే సేవ్ చేయాలని భావించండి' అని కింబెర్లీ పేర్కొన్నారు.
8. సెల్ ఫోన్ క్యారియర్లను ఎంచుకోండి.
మనం షాపింగ్ చేసేటప్పుడు వాటిని సంబంధించిన సలహాలు ఇవ్వడానికి సెల్ ఫోన్ క్యారియర్లు ఉపయోగపడతాయని ఆర్థిక నిపుణులు రాచెల్ క్రూజ్ తెలిపారు. మింట్ మొబైల్, టెల్లో, రెడ్ పాకెట్, అల్ట్రా మొబైల్, ఎయిర్ వాయిస్, యాహూ మొబైల్ వంటి కంపెనీలకు నెలకు కొంత మొత్తాన్ని చెల్లించడం ద్వారా ఈ సర్వీసులను వాడుకోవచ్చని చెప్పారు.
9. ప్రతి బిల్లును దాచుకోండి..
'మనం షాపింగ్ చేసే బిల్లులను ఎప్పటికప్పుడు పడేస్తుంటాం. అలా కాకుండా వీటిని ఒక రెండు నెలల పాటు దాయండి. ఈ మొత్తం బిల్లులను చెక్ చేస్తే.. మీరు ఏయే వస్తువులకు షాపింగ్ చేస్తున్నారనే విషయం అర్థమవుతుంది. అనవసరమైన షాపింగ్ ఏమేం చేశారు? వీటి వల్ల నష్టమెంత? అనే విషయాలను నోట్ చేసుకోండి. తర్వాతి నెలల్లో అలాంటి వస్తువులను కొనకండి. ఇలా కొన్నాళ్లు చేస్తే తప్పకుండా మీ డబ్బు ఆదా అవుతుంది' అని కార్ ఫైనాన్స్ 247 సంస్థ కో-సీఈఓ లూయిస్ రిక్స్ తెలిపారు.
10. బ్యాచ్ కుకింగ్
మనకు ఎంత కావాలో అంతే వండుకోవడం ద్వారా చాల డబ్బు ఆదా చేయవచ్చని కేసరన్ అకౌంటింగ్ కంపెనీ లీసా డిక్సన్ తెలిపారు. మనం ఎప్పుడైనా వంట చేయాల్సి వస్తే మనకు ఎంత కావాలో అంతే వండుకుంటామని.. అంతకు మించి వండబోమని చెప్పారు. సరిగ్గా ఇదే నియమాన్ని డబ్బు ఆదా విషయంలోనూ వర్తింపజేయాలని సూచించారు. మనకు ఏది అవసరమో అదే కొనుగొలు చేయాలని పేర్కొన్నారు.
11. ఫుడ్ వేస్ట్ విషయంలో 5 ఎస్ లు పాటించాలి..
పాపులర్ షేరింగ్ యాప్ ఓలియోకు చెందిన టెస్సా క్లార్క్.. డబ్బు ఆదా చేసే సమయంలో మీకు దోహదం చేసే ఐదు S కారకాలను పంచుకున్నారు. షాపింగ్ చేసేటప్పుడు మీకు అవసరం ఉన్న వస్తువుల జాబితాను ముందే సిద్ధం చేసుకోవాలి. అవసరమైతే వీక్లీ భోజనానికి సంబంధించిన సరుకుల వివరాలు మీతో రెడీగా ఉండాలి. మీ ఆహార పదార్థాలను సరైన తీరులో నిల్వ చేసుకోవాలి. టామోటా లాంటి వాటిని ఫ్రిడ్జ్‌లో ఉంచరాదు. బంగాళాదుంపలు, ఉల్లిగడ్డలను వేరువేరుగా ఉంచాలి. ప్రతి కూరగాయను సరైన ప్రదేశంలో భద్రపరచాలి.
ఆహారాన్ని తక్కువ మొత్తంలో తీసుకున్నా ఎక్కువ పోషక విలువలు మీకు అందేలా ప్లాన్ చేసుకోండి. తిన్న తరువాత మిగిలే కొన్ని పదార్థాలను పాడవేయకుండా ఉంచి.. మరుసటి రోజు ఉదయమే తినాలి. కొన్ని రుచిగానూ ఊంటాయి. మీ ఇంట్లో ఎక్కువగా ఉన్న పదార్ధాలను ఫొటోను ఓలియోలో అప్‌లోడ్ చేస్తే మీ చుట్టుపక్కల వారు వాటిని ఎంచక్కా తీసుకెళ్లవచ్చు.
Also Read: EPFO New Rules: ఈపీఎఫ్ఓ కొత్త రూల్ గురించి తెలుసా? అలా చేయకపోతే ఆ డబ్బులు హాంఫట్!
12. మీ చేతికి వచ్చే ముందు దాన్ని విభజించాలి
ఎన్‌వైటీ బెస్ట్‌సెల్లింగ్ రచయిత మరియు ద బడ్జెట్‌నిస్టా ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ టిఫానీ ఏమన్నారంటే.. వేతనాలను ఖర్చులకు ఒకేసారి చెల్లించడం ద్వారా కాలక్రమేణా మన డబ్బు ఆదా అవుతుంది.
ఒకవేళ మీ మొత్తం జీతం చెకింగ్ అకౌంట్‌కు డిపాజిట్ అవుతుందా.. అయితే మీ హెచ్ఆర్ లేదా అకౌంట్ డిపార్ట్‌మెంట్ వారిని జీతంలో కొంత మొత్తాన్ని సేవింగ్స్ అకౌంట్‌కు డిపాజిట్ చేయాలని కోరమని ఆమె సూచించారు. మీ చేతికి జీతం మొత్తం తీసుకోవడానికి బదులుగా దాన్ని డివైడ్ చేసుకుంటే సుదీర్ఘకాలంలో ప్రయోజనం పొందుతారు.
13. మీ డాలర్ బిల్లులను సేవ్ చేయాలి
మీరు మిగుల్చుకున్న నగదును ఖర్చు చేయడమంటే మీ విలువైన మొత్తాన్ని ఖర్చు చేసుకోవడమేనని ఫైనాన్స్ మార్కెట్ ప్లేస్, కార్ ఫైనాన్స్ 247 కో సీఈవో లూయిస్ రిక్స్ అభిప్రాయపడ్డారు. మీకు లభించిన అన్ని డాలర్ బిల్లులను మీరు సేవ్ చేసుకుంటే మీ వద్ద కొంత నగదు నిల్వ ఉంటుంది. బిల్లు చెల్లించిన ప్రతిసారి మిగిలిన మొత్తాన్ని సేవ్ చేయాలి. ప్రతిరోజూ అలా చేయడం ద్వారా దీర్ఘకాలంలో ఇది మీకు పెద్ద నగదు మొత్తంగా కనిపిస్తుంది.
14. ఆల్ ఆర్ నథింగ్ అనే వైఖరిని మార్చుకోవాలి
మీ ఆలోచనతీరు మారితే ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందో డర్హమ్ యూనివర్సిటీ బిహేవియరల్ సైకాలజిస్ట్ మేరియో వీక్ తెలిపారు. మీ ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవాలని యత్నిస్తున్నట్లయితే.. మీరు చల్లటి టర్కీకి వెళ్తున్నారని ఫీల్ అవుతారు. బడ్జెట్‌ను కొన్ని విభాగాలుగా విభజించుకుంటే మీకు ఆల్ ఆర్ నథింగ్ అనే విషయం అర్థమవుతుందని చెప్పారు.
మీరు చేస్తున్న ఖర్చులను పక్కనపెట్టి.. కొంత మొత్తం సేవ్ చేసుకుంటే అది గోల్డెన్ ఫార్ములాగా మారవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటే మీ సంతోషం సైతం రెట్టింపు అవుతుంది. ఈ ఏడాది బ్లాక్ ఫ్రైడేకు ముందే మీరు కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకోండి. మీరు వాటికి సంతోషంగా ఖర్చు పెట్టాలని భావిస్తేనే ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని మేరియో వీక్ సూచించారు.
క్రిస్మస్ గిఫ్ట్స్, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్, లేదా ఏదైనా కొత్త వస్తువు కోసం ఒక్కసారిగా కాకుండా కొంత కాలానికి ముందే సేవింగ్స్ చేయడం ఉత్తమని చెప్పారు.
15. కొత్త కారు కొనరాదు
అవార్డ్ నెగ్గిన మెంటార్ మ్యాట్ ఫిడ్డెస్ తెలిపిన దాని ప్రకారం.. కొత్త కారును ఎప్పుడూ కొనుగోలు చేయకూడదు. కనీసం ఆరు నెలలు వినియోగించిన కారును కొనుగోలు చేస్తే మీ డబ్బు చాలా మేరకు సేవ్ అవుతుందని చెప్పారు. కారు లోన్లు లాంటివి తీసుకుని కొత్త కార్లు తీసుకోవడానికి బదులుగా.. సెకండ్ హ్యాండ్ కారు కొనడం సరైన నిర్ణయమని సూచించారు.
16. కొనుగోలు చేసే వాటి జాబితాను రీచెక్ చేయండి
కొన్ని లాజిక్స్ ప్రకారం మనం కొనుగోళ్లు చేస్తే డబ్బు ఆదా అవుతుందని బ్రియన్న ఫైర్ స్టోర్ అభిప్రాయపడ్డారు. ఏవైనా బ్రాండ్ వస్తువులు కొనుగోలు చేయాలని భావిస్తే.. వాటి ధరతో పాటు డిస్కౌంట్ వివరాలు తెలుసుకోవాలి. కొన్ని ప్రత్యేక రోజులలో ధరలు అధికంగా ఉంటాయి. అలాంటి సందర్భాలలో షాపింగ్ చేయకూడదు. మీరు కొనుగోలు చేయాలని రాసుకున్న జాబితాలో అతి ముఖ్యమైనవి, మరియు అత్యవసరమైనవి మొదటగా కొనుగోలు చేస్తే అనవసర ఖర్చులకు కళ్లెం వేయవచ్చునని ఆమె సూచించారు.
17. అన్ సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి
షాపింగ్ మాల్స్, కంపెనీలు మీకు ఈమెయిల్ చేసి ఆఫర్లు అని ఆశపెడతాయని.. వీటి కోసం ప్రత్యేకంగా సమయాన్ని వెచ్చించాలని బెక్కా పవర్స్ చెప్పారు. ప్రమోషనల్ ఆఫర్స్ మెయిల్స్‌ను ఏదైనా ఒకరోజు సమయం కేటాయించి అన్‌సబ్‌స్క్రైబ్ చేయడం ద్వారా మీకు తెలియకుండానే అనవసర వస్తువులకు షాపింగ్ చేయడం మానేస్తారు. తద్వారా బోలెడంత డబ్బు మీ వద్ద అలాగే ఉండిపోతుందని ఆమె చిట్కాను సూచించారు.
18. పొదుపు చేయడానికి ఎలాంటి ప్రలోభాలకు లోను కావొద్దు
మీరు సేవ్ చేయాలనుకునే నగదు చిన్న మొత్తమా.. భారీ నగదా అనేది ఆలోచించకూడదని ఫైండర్ డాట్ కామ్‌కు చెందిన జాన్ ఓస్లర్ అభిప్రాయపడ్డారు. భారీ మొత్తంలో నగదు సేవ్ చేయాలని శక్తికి మించి ప్రయత్నించి ఇబ్బందులు పడకూడదు. కొందరు వ్యక్తులు, ఏజెంట్లు చెప్పే మాటలను నమ్మవద్దు. ఖర్చు చేయాలనే ఆలోచనను నియంత్రించుకోవాలంటే కచ్చితంగా సేవింగ్స్ ఖాతాలో కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసుకోవాలి. తక్షణమే నగదు విత్ డ్రా చేయడానికి అవకాశం లేని విధంగా సేవ్ చేయడం ద్వారా మెరుగైన ఫలితం ఉంటుంది.
Also Read: Royal Enfield Classic 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వచ్చేసింది.. బుల్లెట్ బండి ధర ఎంతంటే?
19. భోజనం విషయంలో ప్లాన్ చేయాలి
ఆహారం విషయంలో ప్లాన్ లేకపోవడంతో సడన్‌గా ఫుడ్ ఆర్డర్ చేస్తారు, దాంతో ఖర్చులు పెరుగుతాయని రాచెల్ క్రూజ్ పేర్కొన్నారు. రెస్టారెంట్లలో భోజనానికి వెళ్లాలని చాలా మంది ప్లాన్ చేసుకుంటారు. అయితే ఆ ఖర్చులను సగానికి తగ్గించుకుంటే మీ ఆరోగ్యంతో పాటు జేబు పరిపుష్టిగా మారుతుందని ఆమె చెబుతున్నారు. ఇంట్లోనే భోజనం చేయాలనే దానిపై ఆలోచన చేస్తే మీ ఖర్చులు అదుపులోకి వస్తాయి. మీ ఉదయం ప్రిపేర్ చేసిన వంటకాన్ని ఆఫీసు నుంచి తిరిగొచ్చాక తినడం ద్వారా ఖర్చులు తగ్గుతాయి.
20. అవసరమైతేనే డబ్బు బయటకు తీయాలి
ఎదైనా వస్తువు కొంటున్నామంటే.. నిజంగానే ఇది మనకు అవసరమా అని నిజాయితీగా ఆలోచించాలని లిసా డిక్‌సన్ అభిప్రాయపడ్డారు. చిల్లర ఖర్చులు చేసే ముందు తమ బిల్లు చెల్లింపులను గుర్తుంచుకోవాలి. తరచుగా బయట తిరిగే సమయంలో రోజుకో ఎన్నో కాఫీలు, టీలు తాగుతాం కానీ ఎక్కువగా వీటిని తీసుకోవడం వల్ల ఖర్చు అధికం, ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కొన్ని ప్రత్యేకమైన ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.